సాతారా జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా
(సతారా జిల్లా నుండి దారిమార్పు చెందింది)

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో సాతారా జిల్లా ఒకటి. సాతారా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సాతారా జిల్లా పూనా డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 10,480 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,808,994. నగరాలలో నివసిస్తున్న వారి సంఖ్య 14.17%.[1] జిల్లాలో వయి, కరద్, కొరెగావ్, రహిమత్‌పూర్, ఫల్తాన్, మహాబలేశ్వర్, పంచాగ్ని మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి.

Satara district

सातारा जिल्हा
district
MaharashtraSatara.png
Country India
StateMaharashtra
Administrative DivisionPune Division
HeadquartersSatara
విస్తీర్ణం
 • మొత్తం10,484 కి.మీ2 (4,048 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం27,96,906
 • సాంద్రత209/కి.మీ2 (540/చ. మై.)
Languages
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Tehsils1. Satara, 2. Karad, 3. Wai, 4. Mahabaleshwar, 5. Phaltan, 6. Maan, 7. Khatav, 8. Koregaon, 9. Patan, 10. Jaoli, 11. Khandala
LokSabha1. Satara, 2. Madha (shared with Solapur district)
జాలస్థలిhttp://satara.nic.in/

సరిహద్దులుసవరించు

జిల్లా ఉత్తర సరిహద్దులో పూనా జిల్లా, వాయవ్య సరిహద్దులో రాజ్‌గడ్ జిల్లా, తూర్పు సరిహద్దులో సోలాపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో సంగ్లీ జిల్లా, సరిహద్దులో రత్నగిరి జిల్లా ఉన్నాయి.[2]

భౌగోళికంసవరించు

జిల్లా ఉత్తర దక్షిణాగా పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వతశ్రేణి జిల్లాను రత్నగిరి జిల్లాను విడదీస్తూ సాగిపోతూ ఉంటుంది. మహాబలేశ్వర్ సమీపంలో మొదలౌతున్న మహాదేవ్ పర్వతశ్రేణి ఎత్తులో మొదలై తూర్పు నుండి ఆగ్నేయం వరకు 10 కి.మీ పొడవున సాగిపోతుంది. మహదేవ్ పర్వతశ్రేణి బలమైన నల్లరాళ్ళతో కూడి ఉంటుంది. జిల్లాలో రెండు వాటర్ షెడ్లు ఉన్నాయి. కృష్ణానదికి ఉపనది భీమానది ఉపనది ఉంది. భీమానది జిల్లా ఉత్తర, ఈశాన్య సరిహద్దులో మహదేవ్ పర్వతాలకు ఉత్తరంలో ప్రవహిస్తుంది. మిగిలిన జిల్లాలో ఎగువ కృష్ణానది, కృష్ణానది ఉపనదులు ప్రవహిస్తున్నాయి. సాతారా జిల్లా మొత్తం దక్కన్ పర్వతశ్రేణిలో ఉంది. జిల్లాలోని భూమి నీటిపారుదల సౌకర్యం ఉంటే పుష్కలమైన పంటను అందించగలిగిన సారవంతంగా ఉంటుంది. సాతారా కృష్ణా కాలువ వంటి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి సన్నాహాలు చేస్తుంది. జిల్లా సరాసరి వర్షపాతం 5 మి. తూర్పు భూభాగం వర్షపాతం 1 మి. ఉంది. సాతారాలో 30 సి.మీ కంటే తక్కువగా ఉంటుంది. సాతారా జిల్లా ఉత్తర దక్షిణంగా రైలుమార్గం 15 కి.మీ దూరం పయనిస్తుంది.

మంధర్‌దేవి ఆలయంసవరించు

వాయి సమీపంలో మంధర్‌దేవి ఆలయం ఉంది. ఇది సముద్రమట్టానికి 4,650 మీ.ఎత్తున ఉంది. ఈ ఆలయం వాయీకి 20 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుండి పురందర్ కోట కనిపిస్తుంది. ఈ ఆలయం 400 సంవత్సరాల పురాతనమైనది. శివాజీ మహరాజ్ మరాఠీ రాజ్యాన్ని పాలించిన కాలంలో నిర్మించిందని భావిస్తున్నారు. అయినప్పటికీ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు.

చరిత్రసవరించు

 
Satara district in 1884

సాతారా ప్రాంతం క్రీ.పూ 200 నుండి ఉనికిలో ఉందని భావిస్తున్నారు. సాతారా లోని అతిపురాతన ప్రదేశం కరద్ (కర్షకద). పాండవులు తమ అఙాతవాస కాలంలోవాయి వద్ద నివసించారని ఇదే విరాటనగరమని విశ్వసిస్తున్నారు.

చాళుక్యులుసవరించు

సాతారా జిల్లా పురాతన రాష్ట్రకూట చరిత్రతో సంబంధితమై ఉంది. కృష్ణా నదీ లోయలలోని కుంతల ప్రాంతానికి చెందిన వారని భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్నీ మనక్ (క్రీ.పూ 350-375) పాలించాడు. ఆయన మాన్పూర్ వద్ద కోటను నిర్మించాడు. (ప్రస్తుతం ఇది సాతారా జిల్లాలో ఉంది). తరువాత విదర్భాకు చెందిన ఒకతకాలు రాష్ట్రకూటులు మాన్పూర్ వద్ద యుద్ధం చేసారు. తరువాత రాష్ట్రకూటులు చాళుఖ్యులకు కప్పం కట్టారు. తరువాత 753 వరకు దంతిదుర్గ పాలన కొనసాగింది.

రెండవ చంద్రగుప్త సామ్రాజ్యం (మొదటి మహేంద్రాదిత్య కుమారగుప్తా) (క్రీ.శ 451 - 455) సాతారా జిల్లా వరకు విస్తరించబడింది. తరువాత ఈ ప్రాంతాన్ని క్రీ.పూ 550 - 750 వరకు శాతవాహనులు పాలించారు.

ముస్లిములుసవరించు

ఈ ప్రాంతం మీద మొదటిసారిగా 1296లో ముస్లిముల దాడి జరిగింది. 1636లో నిజాం షాహి సామ్రాజ్యం ముగింపుకు వచ్చింది. 1663లో చత్రపతి శివాజీ పరాలిని, సాతారా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఛ్త్రపతి శివాజీ మరణించిన తరువాత ఔరంగజేబు సాతారా కోటను జయించాడు. 1706లో పరసురాం పంత్ ఈ ప్రాంతాన్ని జయించాడు. 1708లో ఛత్రపతి సాతారా కోట మీద విజయకేతనం ఎగురవేసాడు. ఛత్రపతి శివాజీ వారసుకు సాతారా జిల్లాలో నివసిస్తున్నారు.

ఆంగ్లో ఇండియన్ యుద్ధంసవరించు

1818లో మూడవ ఆంగ్లో - మారాఠా యుద్ధం తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం మరాఠా ప్రాంతాన్ని తమరాజ్యంలోని విలీనం చేసుకుని బాబే ప్రొవింస్‌లో భాగంచేసింది. బ్రిటిష్ ప్రభుత్వానికి రాజా ప్రతాప్ సింగ్‌ను సాతారా రాజప్రనిధిని చేసింది. (అది ప్రస్తుత సాతారా జిల్లా కంటే విశాలమైనది) రాజకీయ ప్రత్యర్థుల కారణంగా 1839లో ప్రతాప్‌సింగ్‌ను సింహాసనం నుండి తొలగించి ఆయన సోదరుడు సింహాసనం అధిష్టించాడు. 1848 రాజకుమారుడు మగ సంతానం లేకుండా మరణించిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనమై బాంబే ప్రొవింస్‌లో భాగమైంది.

విభాగాలుసవరించు

 • జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- సాతారా, వాయి, కరద్, ఫల్తన్.
 • జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి :- .[3] సాతారా, కరద్, వాయి, మహాబలేశ్వర్, ఫల్తాన్, మాన్, ఖాతవ్, కొరెగావ్, పతన్, జయోలి, ఖండల.
 • జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- సాతారా, మాన్, ఖాతవ్, కొరెగావ్, వాయి, ఫల్తాన్.
 • సాతారా పార్లమెంటు జియోజకవర్గంలో : - సాతారా, మాన్, ఖాతవ్, కొరెగావ్, వాయి, ఫల్తాన్, జయోలి, పతన్, కరద్ (ఉత్తర), కరద్ (దక్షిణ).
 • కరద్ పార్లమెంటు జియోజకవర్గంలో :- జయోలి, పతన్, కరద్ (ఉత్తర), కరద్ (దక్షిణ)
తాలూకా రాజధాని
సాతారా సాతారా (నగరం)
కరద్ కరద్
వై వై (మహారాష్ట్ర )
కారేగావ్ కారేగావ్
జయోలి మేధా
మహాబలేశ్వర్ మహాబలేశ్వర్
ఖండాలా ఖండాలా (పర్గయొన్)
పటాన్ పటాన్
ఫల్తన్ ఫల్తన్
ఖత్వ్ వదుజ్
మన్ దహివాడి

2009లో కరద్ పార్లమెంటు నియోజకవర్గం రద్దు చేయబడి అదే సంవత్సరం మాథా పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటు చేయబడింది. జ్యోలీ, ఖాతవ్ నియోజకవర్గాలను తొలగించి మాన్, ఫల్తాన్ నియోజకవర్గాలు చేర్చబడ్డాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,003,922,[4]
ఇది దాదాపు. అల్బేనియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. మిసిసిపి నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 122 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 287 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 6.94%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 986:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 84.2%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

విద్యసవరించు

సాతారాలో ఉన్న సైనిక స్కూల్ జిల్లాలోని పూరాతన రెసిడెంషియల్ పాఠశాలలో ఒకటి. ఇక్కడ బాలురు నేషనల్ డిఫెంస్ అకాడమీ, యు.పి.ఎస్.సి ఎగ్జామినేషన్, ఆర్మీ, నేవీ,, ఎయిర్ ఫోర్స్ లకు శిక్షణ తీసుకుంటారు. ఇక్కడ ప్రబల సైనికాధికారులు విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. డిఫెంస్ మినిస్టరీ ఆధ్వర్యం నడుస్తున్న మొదటి సైనిక పాఠశాలగా ఇది గుర్తించబడుతుంది. జిల్లాలో రాయత్ శిక్షాదాన్ సంస్థ నిర్వహణలో పలు విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో కర్మవీర్ భౌరావ్ పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పాలిటెక్నికల్ వంటి విద్యా సంస్థలు ఉన్నాయి.

ప్రాథమిక విద్యసవరించు

రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపును పొందిన మోనా స్కూల్ సాతారా, నిర్మల కాంవెంట్, నర్మద ఆగ్లమాధ్యమ పాఠశాలలు. కేంద్ర ప్రభుత్వ అంగీకారం పొందిన పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రథమస్థాయిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి.[7] మరాఠీ మాధ్యమ పాఠశాలలలో రాయత్ శిక్షణ్ సంస్థలు అన్న సాహెబ్ కల్యాణి విద్యాలయ, మహారాజ సయాజీరావ్ విద్యాలయ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి.[8]

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2015-04-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-27. Cite web requires |website= (help)
 2. Map of districts in Maharashtra
 3. "Satara: Province to District". Satara District. మూలం నుండి 2011-08-09 న ఆర్కైవు చేసారు. Retrieved 27 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Albania 2,994,667 July 2011 est. line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)
 6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Mississippi 2,967,297 line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
 7. http://www.podareducation.org
 8. http://www.rayatshikshan.edu

బయటి లింకులుసవరించు

ప్రత్యేకతలుసవరించు

 • మాలిక్ ఎస్.సి స్టోన్ ఏజ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ది బాంబే & సాతారా డిస్ట్రిక్ట్, ఎం.సాయాజీ రావ్ యూనివర్శిటీ బరోడా (1959).
 • బి.ఎ గుప్తా (కలకత్తా 1922) సేకరించిన బరోడా వారసత్వ ఆధారాలు : బాంబే, బరోడా, పూనా, సాతారా ప్రభుత్వాల ఉత్తరాలు.

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు