పూర్ణియా జిల్లా

బీహార్ లోని జిల్లా

పూర్ణియా జిల్లా బిహార్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. పూర్ణియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. పూర్ణియా డివిజన్‌లో పూర్ణియా జిల్లా భాగం. జిల్లా ఉత్తరంలో ఉన్న గంగానది వైపు విస్తరిస్తూ ఉంది.

Purnia district
Ruins of a guesthouse
Ruins of a guesthouse
Location of Purnia district in Bihar
Location of Purnia district in Bihar
దేశం India
రాష్ట్రంబీహార్
డివిజన్పూర్ణియా
Established14 ఫిబ్రవరి 1770
ముఖ్యపట్టణంపూర్ణియా
విస్తీర్ణం
 • Total3,229 కి.మీ2 (1,247 చ. మై)
జనాభా
 (2011)
 • Total32,64,619
 • జనసాంద్రత1,000/కి.మీ2 (2,600/చ. మై.)
Demographics
 • Literacy52.09 per cent
 • Sex ratio921
 • Major ethnolinguistic groupMaithils[1]
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationBR-11
Major highways
Major Railway Lines

చరిత్ర

మార్చు

ముగల్ పాలనా కాలంలో పూర్ణియా సైనిక విభాగానికి ఆదాయ వనరుగా ఉండేది. ఇక్కడి ఆదాయం అధికంగా సరిహద్దులను భారతదేశం తూర్పు, ఉత్తర గిరిజనుల నుండి రక్షించడానికి వెచ్చించబడేది. .[2] ఈ భూభాగం రాజప్రతినిధి సిరాజ్- ఉద్- దుల్లాహ్‌ కొలకత్తాను స్వాధీనం చేసుకున్న తరువాత 1757 లో తిరుగుబాటును లేవదీసాడు. 1765లో మిగిలిన కొలకత్తాతో ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది.[3] 1770 ఫిబ్రవరి 10న ఈస్టిండియా కంపెనీ పూర్ణియా జిల్లాను రూపొందించింది.[4]

పూర్ణియా జిల్లాలో ఉన్న " రామక్రిష్ణ మిషన్ " ఏప్రిల్ మాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న దూర్గాపూజ జిల్లాకు ప్రఖ్యాతి తీసుకువస్తుంది. జిల్లాలో ఉన్న " పూర్ణిమాదేవి ఆలయం జిల్లాకు " ప్రత్యేక ఖ్యాతి తీసుకువస్తుంది. ఈ ఆలయం ప్రధాన నగరానికి 5 కి.మీ దూరంలో ఉంది. కొంత మంది ప్రజలు పూర్ణియా ఒకప్పటి పూర్ణా అరణ్యమని. ఇది దట్టమైన అరణ్యప్రాంతమని అందుకే ఈ ప్రాంతానికి పూర్ణియా అని పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు.

పూర్ణియా జిల్లా నుండి 1976లో కతియార్ జిల్లా [5] 1990లో అరారియా జిల్లా విడివడ్డాయి.[5]

భౌగోళికం

మార్చు

పూర్ణియా జిల్లా వైశాల్యం 3229 చ.కి.మీ.[6] ఇది సొలోమన్ ఇలాండ్స్ లోని మకరియా ద్వీపం వైశాల్యానికి సమానం..[7] హిమాలయాలో జన్మించిన పలు నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తూ ఈ జిల్లా భూభాగాన్ని సారవంతం చేస్తున్నాయి. ఇది జిల్లావ్యవసాయానికి మరింతగా సహకరిస్తుంది. జిల్లాలో ప్రధానంగా కోసి నది, మహానందా నది, సువరా కాళీ నది, కొలి నది ప్రవహిస్తున్నాయి. జిల్లా పశ్చిమ భూభాగంలో కోసీ నది ప్రావం కారణంగా భూమి అధికంగా ఇసుకమేటలు వేసి ఉంది. మహానందా, పన్నర్ నదీ జలాలతో జిల్లాలో జనుము, అరటి విస్తారంగా పండించబడుతుంది

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పూర్ణియా జిల్లా ఒకటి అని గుర్తించింది.[8] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[8]

  • వ్యవసాయ ఉత్పత్తులు :- వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, గోధుమ. దాదాపు జిల్లాలో సగభాగంలో వరి పండించబడుతుంది. జిల్లాలో పుచ్చ, కూరగాయలు వంటి వాణిజ్య పంటలు పండించబడుతున్నాయి.
  • జిల్లాలోని లైన్ బజార్ వద్ద " అభా కాంప్లెక్స్ " నింర్మించబడింది. డాక్టర్ డి.ఎన్ రాయ్ 65 షాపులు ఆరంభించడానికి ఏర్పాటు చేస్తున్నాడు.

విభాగాలు

మార్చు

పూర్ణియా జిల్లాలో 4 విభాగాలు ఉన్నాయి : పూర్ణియా, బన్మంఖి, బైసి ధందహా. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. అవి వరుసగా తూర్పు పూర్ణియా, క్రిత్యానంద్ నగర్, బన్మంఖి, కస్వా, అముర్, బైంసి, బైసా, ధందహా, బర్హరా కొథి, రూపౌలీ, భవానీపూర్, డగరుయా, జలాల్గర్, శ్రీనగర్.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,673,127,[9]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[11]
640 భారతదేశ జిల్లాలలో. 105 వ స్థానంలో ఉంది..[9]
1చ.కి.మీ జనసాంద్రత. 1014 [9]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.66%.[9]
స్త్రీ పురుష నిష్పత్తి. 930:1000 [9]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 64.49%.[9]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సంస్కృతి

మార్చు

మందిరాలు

మార్చు

నగరంలో హజారత్ ముస్తాఫా జమాలుల్ హక్యూ బండగీ దర్గా, చిమ్నీ బజార్ ఉన్నాయి. నగర వాసులు ఉర్స్ మేళా జరుపుకుంటారు. ఇది ఈద్- ఉల్- అఝా తరువాత 7 రోజుల తరువాత ఆరంభించి 3 రోజులు జరుపుకుంటారు.దర్గా, ఖాంక్వాహ్ అలియా ముస్తాఫియా ప్రధాన నగరానికి 7 కి.మీ దూరంలో ఉంది. ఇది ఆధ్యాత్మిక, సమూహాల కూటములు, సూఫీయిజానికి కేంద్రంగా ఉంది. ఈప్రాంతానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. హజరత్ బందగి జౌన్‌పూర్ (ఉత్తరప్రదేశ్) నుండి వచ్చి ఖంక్వాలు, దర్గాలను (పాండవా షరీఫ్, ది బీహార్ షరీఫ్ మొదలైన భారతీయ దర్గాలు) సందర్శించే సమయంలో ఈప్రాంతాన్ని సందర్శించాడు. దర్గా స్థాపించినప్పటి నుండి ఈశాన్య బీహార్ రాష్ట్రంలో సంస్కృతి, విద్య, దయ, లౌకికవాదం, ఆధ్యాత్మిక విస్తరణలో ఈ దర్గా ప్రధానపాత్ర వహించింది. గర్బానిలి (పూర్ణియా) సమీపంలో ఉన్న డియోర్హి సమీపంలో ఇప్పటికీ పురాతన సభామండపం శిథిలాలు ఉన్నాయి. ఇది రాజా కాలానంద్ సింగ్‌కు స్వంతమైనదని భావిస్తున్నారు. ఆయన సంతతికి చెందిన వారు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. https://m.aajtak.in/elections/lok-sabha-election-2019/story/purnia-lok-sabha-election-result-2019-live-updates-will-santosh-kumar-win-again-from-this-seat-1085204-2019-05-23
  2. Purnea District - Imperial Gazetteer of India, v. 20, p. 414
  3. Purnea District - Imperial Gazetteer of India, v. 20, p. 415
  4. The Times of India, Patna Edition Feb 15, 2012
  5. 5.0 5.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  6. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  7. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Makira 3,190km2
  8. 8.0 8.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritania 3,681,634 July 2011 est.
  11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు