పూల తిరుపతి రాజు
రచయిత, విద్యావేత్త, తత్త్వవేత్త
(పూల తిరుపతిరాజు నుండి దారిమార్పు చెందింది)
పూల తిరుపతి రాజు (3 సెప్టెంబరు 1904 – 1992) ఒక భారతీయ రచయిత, తత్త్వవేత్త, విద్యావేత్త. ఇతడు జోధ్‌పూర్‌లోని జస్వంత్ కాలేజీ(ప్రస్తుతం జైనారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయం)లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[1] ఇతడు తత్త్వశాస్త్రం, సాహిత్యాలలో అనేక తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రచించాడు.[2][3] ఇతని రచనలలో స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్[4] తెలుగు లిటరేచర్,[5] ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా[6] ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ[7] ,ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా ముఖ్యమైనవి.[8] ఇతడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్రాసిన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించాడు.[9] భారత ప్రభుత్వం విద్యా సాహిత్య రంగాలలో ఇతడు చేసిన సేవను గుర్తించి ఇతనికి 1958లో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది.[10]
పూల తిరుపతి రాజు | |
---|---|
జననం | 3 సెప్టెంబరు 1904 ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మరణం | 1992 |
వృత్తి | రచయిత తత్త్వవేత్త విద్యావేత్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతీయ తత్త్వము |
పురస్కారాలు | పద్మభూషణ్ |
ముఖ్యమైన రచనలు
మార్చు- పూల తిరుపతి రాజు (1937). థాట్ అండ్ రియాలిటీ:హెగెలియనిజం అండ్ అద్వైత. జార్జ్ అల్లెన్ అండ్ అన్విన్ లిమిటెడ్, లండన్. p. 288.[11]
- పూల తిరుపతి రాజు (1944). తెలుగు లిటరేచర్. ఇంటర్నేషనల్ బుక్ హౌస్. p. 154.
- పూల తిరుపతి రాజు, డీన్ ఇంగె తదితరులు (1951). కంపేరిటివ్ స్టడీస్ ఇన్ ఫిలాసఫీ. జార్జ్ అల్లెన్ అండ్ అన్విన్ లిమిటెడ్, లండన్ హార్పర్ బ్రదర్స్, న్యూయార్క్.
- పూల తిరుపతి రాజు (1952). ఇండియాస్ కల్చర్ అండ్ హర్ ప్రాబ్లమ్స్. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్.
- పూల తిరుపతి రాజు (1953). ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. p. 454. OCLC 3615962.
- పూల తిరుపతి రాజు (1957). ఐడియలిస్టిక్ అప్రోచస్:ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్. బరోడా యూనివర్సిటీ, బరోడా.
- పూల తిరుపతి రాజు (1961). ఇండియన్ ఐడియలిజం అండ్ మాడ్రన్ ఛాలెంజస్. పంజాబ్ యూనివర్సిటీ పబ్లికేషన్స్ బ్యూరో, చండీఘర్.
- పూల తిరుపతి రాజు (1962). ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ప్రెస్. p. 364. OCLC 372601.
- పూల తిరుపతి రాజు (1965). ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ ఫిలాసఫీ. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్.
- పూల తిరుపతి రాజు (1972). ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ ప్రెస్. pp. 256. ISBN 9780822911050.
- పూల తిరుపతి రాజు (1985). స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్. p. 599. ISBN 9780887061394.
- సర్వేపల్లి రాధాకృష్ణన్ (రచయిత), పూల తిరుపతి రాజు (సంపాదకుడు) (2011). ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ. లిటరరీ లైసెన్సింగ్. p. 382. ISBN 9781258007546.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Notification" (PDF). The Gazette of India. 1958. Retrieved 31 May 2018.
- ↑ "Raju, P. T. (Poolla Tirupati)". WorldCat identities. 2016. Retrieved 31 May 2018.
- ↑ "P. T. Raju (1904–1992)". LibraryThing. 2016. Retrieved 31 May 2018.
- ↑ Poola Tirupati Raju (1985). Structural Depths of Indian Thought. State University of New York Press. p. 599. ISBN 9780887061394.
- ↑ Poola Tirupati Raju (1944). Telugu Literature. Internat. Book House. p. 154.
- ↑ Poola Tirupati Raju (1972). The Philosophical Traditions of India. University of Pittsburgh Press. p. 256. ISBN 9780822911050.
- ↑ Poola Tirupati Raju (1962). Introduction to Comparative Philosophy. University of Nebraska Press. p. 364. OCLC 372601.
- ↑ Poola Tirupati Raju (1953). Idealistic Thought of India. Harvard University Press. p. 454. OCLC 3615962.
- ↑ Sarvepalli, Radhakrishnan (2011). Poola, Tirupati Raju (ed.). The Concept of Man: A Study in Comparative Philosophy. Literary Licensing. p. 382. ISBN 9781258007546.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 3 January 2016.
- ↑ P.t. Raju (1937). Thought And Reality. London: George Allen and Unwin Ltd. p. 288. Retrieved 4 April 2020.