జోధ్‌పూర్ జిల్లా
రాజస్థాన్ రాష్ట్రం జిల్లాలలో జోధ్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానకార్యాలయం జోధ్‌పూర్ పట్టణం 2011 గణాంకాలను అనుసరించి రాజస్థాన్ రాష్ట్ర జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి స్థానంలో జైపూర్ జిల్లా ఉంది.[1]
జోధ్‌పూర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
Coordinates (జోధ్‌పూర్): 27°37′N 72°55′E / 27.62°N 72.92°E - 26°00′N 73°52′E / 26.00°N 73.87°E | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
విభాగం | జోధ్‌పూర్ | ||||||
పరిపాలనా కేంద్రం | జోధ్‌పూర్ | ||||||
Government | |||||||
• లోక్‌సభ నియోజకవర్గాలు | జోధ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 22,850 కి.మీ2 (8,820 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 36,87,165 | ||||||
• జనసాంద్రత | 160/కి.మీ2 (420/చ. మై.) | ||||||
• Urban | 34.30 percent | ||||||
జనాభా | |||||||
• అక్షరాస్యత | 65.94 | ||||||
• లింగనిష్పత్తి | 916/1000 | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
చరిత్ర
మార్చుచారిత్రకంగా జోధ్‌పూర్, మేవార్ మధ్యభూభాగంలో ఉంది. జిల్లాలో ప్రతిహరా రాజపుత్రుల రాజధాని (6-13 శతాబ్దాలు) మందోర్ నగరం, ఆలయ నగరం, ఒసియాన్ నగరం ఉన్నాయి. జోధ్‌పూర్‌ను 15వ శతాబ్దంలో రావు జోధా స్థాపించాడు. అలాగే జోధ్‌పూర్ రాథోర్ రాజపుత్రుల పాలనలో 1947 వరకు మేవార్ రాజ్యానికి రాజధానిగా ఉంది.
భౌగోళికం
మార్చుజోధ్పూర్ జిల్లా రాజస్థాన్ రాష్ట్ర పశ్చిమ భూభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో బికనీర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో నగౌర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో అజ్మీర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో పాలి జిల్లా, పశ్చిమ, వాయవ్య సరిహద్దులో జైసల్మేర్ జిల్లా ఉన్నాయి. జిల్లా 26 00’, 27 37’ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72 55’, 73 52’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
పర్యాటకం
మార్చుజోధ్పూర్ ప్రాంతం చారిత్రకంగా సుసంపన్నమైంది. దీనికి బ్లూ సిటీ, సన్ సిటీ అనే పేర్లు ఉన్నాయి. మెహ్రాంగర్ కోటలో గృహాలకు నీలిరంగు కలిపిన వైట్ వాష్ వేయడం వలన ఈ నగరానికి బ్లూ సిటీ అనే పేరు వచ్చింది. జిల్లాలో ఉమైడ్ భవన్ ప్యాలెస్ వంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమైడ్ భవన్ ప్యాలెస్‌లో కొంతభాగం ప్రస్తుత మహారాజా గజ సింగ్ కుంటుంబానికి నివాసంగా ఉంది.మిగిలిన భాగంలో ఐదు నక్షత్రాల హోటల్ " తాజ్ గ్రూప్ హోటల్ "లో ఒకటిగా ఉంది.
విభాగాలు
మార్చు2001 గణాంకాలను అనుసరించి జిల్లాను 5 ఉపవిభాగాలుగా, 7 తాలూకాలుగా విభజించబడి ఉంది.[2][3] నిర్వహణా సౌలభ్యం కొరకు 4 ఉప తాలూకాలు (బలేశ్వర్, బాప్, ఝంవర్, తుంవరి) [3] రెండు స్థానిక సంస్థలు (పంచాయతీ సమితి), బాలేశ్వర్, బాప్.[3]2011 నాటికి జిల్లాలో 3 ఉప విభాగాలు, 11 తాలూకాలు, 2 స్వతంత్ర ఉప తాలూకాలు (జంవర్, తింవారి) ఉన్నాయి.[4]
సబ్డివిజన్ | సబ్ డివిజన్ ప్రధాన కేంద్రాలు | తాలూకా | ప్రధాన కేంద్రాలు తాలూకా | పంచాయతీ గ్రామాలు |
---|---|---|---|---|
జోధ్‌పూర్
సబ్ డివిజన్ |
జోధ్‌పూర్ | జోధ్‌పూర్ | - | జోధ్‌పూర్ తాలూకా |
భోపాల్గర్ సబ్ డివిజన్ | భోపాల్గర్ | భోపాల్గర్ తాలూకా | భోపాల్గర్ | 39 |
బాడి తాలూకా | - | - | - | 26 |
లూనీ సబ్ డివిజన్ | లూనీ | లూనీ తాలూకా లూనీ | - | 41 |
ఒసియన్ సబ్ డివిజన్ | ఒసియన్ జోధ్‌పూర్ | ఒసియన్ తాలూకా | ఒసియన్ | 41 |
ఫాలోడి సబ్ డివిజన్ | ఫాలోడి | ఫాలోడి తాలూకా | ఫాలోడి | 38 |
బి.ఎ.పి తాలూకా | బి.ఎ.పి రాజస్థాన్ | - | - | 32 |
పిపర్ సిటీ | బిలర తాలూకా | బిలర | పిపర్ సిటీ సబ్ డివిజన్ | 40 |
మండార్ తాలూకా | - | - | - | 28 |
షేర్గర్ సబ్ డివిజన్ | షేర్గర్ | షేర్గర్ తాలూకా | షేర్గర్ | 33 |
బలెసర్ తాలూకా | బలెసర్ | - | - | 33 |
తాలూకాలు
మార్చుతాలూకాలు అన్ని మండలాలు, పంచాయితీ సమితులుగా ఉన్నాయి.[5][6] జోధ్‌పూర్ మాత్రం నగరపాలక సంస్థగా ఉంది.[7] బిర్లా, ఫలోడీ, పిపర్‌సిటీలు పురపాలికలుకలుగా ఉన్నాయి.[7] జిల్లాలో 1,794 గ్రామాలు [4] 351 గ్రామ పంచాయితీలు .[5] ఉన్నాయి.
2011 లో గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,685,681, [1] |
ఇది దాదాపు. | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | ఒక్లహోమా నగర జనసంఖ్యకు సమం..[9] |
640 భారతదేశ జిల్లాలలో. | 73 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 161 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.69%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 905:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 67.09%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "Census 2001 Population Finder: Rajasthan: Jodhpur:". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. Archived from the original on 2013-05-13. Retrieved 2014-11-14.
- ↑ 3.0 3.1 3.2 "Administrative Setup". Jodhpur District. Archived from the original on 25 డిసెంబరు 2002. Retrieved 14 November 2014.
- ↑ 4.0 4.1 "Administrative Setup". Jodhpur District. Archived from the original on 6 ఆగస్టు 2013. Retrieved 14 November 2014.
- ↑ 5.0 5.1 "Reports of National Panchayat Directory: Block Panchayats of Jodhpur, Rajasthan". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-13. Retrieved 2014-11-14.
- ↑ "Map:Jodhpur District, Administrative Setup". Jodhpur District. 2007. Archived from the original on 9 ఏప్రిల్ 2009. Retrieved 14 November 2014.
- ↑ 7.0 7.1 "Reports of National Panchayat Directory: Report on Urban Local Bodies". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 13 మే 2013. Retrieved 14 November 2014.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oklahoma 3,751,351
సరిహద్దులు
మార్చువెలుపలి లంకెలు
మార్చు- "District Jodhpur: Gram Panchayat, Samiti and Ward Map". Excise Department, Government of Rajasthan. Archived from the original on 2013-05-20. Retrieved 2014-11-14.
- Jodhpur district Official website
- Jodhpur district
- Jodhpur Map