పృథ్వీరాజ్ చౌహాన్

పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192 సా.శ. రాజపుత్ర వంశమైన చౌహాన్ (చౌహమాన) వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు. పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి. (చివరి హిందూ చక్రవర్తి హేమూ). 11 ఏళ్ల వయసులో 1179లో సింహాసనాన్ని అధిష్టించిన పృథ్వీరాజు అజ్మీరు, ఢిల్లీలు జంట రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలోని చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో ఉంది. ఈయన ముస్లిం దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశాడు. అందుకు గాను రాజపుత్ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్. పృథ్వీరాజు, కనౌజ్ ను పరిపాలించిన ఘడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త (సంయోగిత) ను లేవదీసుకొనిపోయి పెళ్ళి చేసుకోవటం భారతదేశపు జనసాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమకథ. పృథ్వీరాజు ఆస్థానకవి, స్నేహితుడైన చంద్ బర్దై వ్రాసిన పృథ్వీరాజ్ రాసో అనే కావ్యం ఈ కథపై ఆధారితమైనదే.పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ర సామ్రాట్ అగ్నికులక్షత్రియులు[ఆధారం చూపాలి] అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ తను రాసి ప్రచురించిన పృధ్వీరాజ్ రాసో అనే పుస్తకంలో తెలియజేసాడు. పృథ్వీరాజు 1191లో మొదటి తారాయిన్ యుద్ధంలో గెలిచాడు.

Prithvi Raj Chauhan (Edited).jpg

నేపథ్యంసవరించు

సమాచార మూలాలుసవరించు

పృథ్వీరాజ్ పాలన కాలానికి చెందిన శాసనాలు కొంత తక్కువగా ఉన్నాయి. రాజు తనను గురించితానుగా శాసనాలలో వివరణ ఇవ్వలేదు. [1] ఆయన గురించిన చాలా సమాచారం మధ్యయుగ పురాణ గాథల నుండి లభించింది. తారైన్ యుద్ధం వంటి ముస్లిం పోరాటాలతో అతను హిందూ, జైన రచయితలు అనేక మధ్యయుగ కావ్యాలలో (పురాణ కవితలు) ఆయన గురించి పేర్కొన్నారు. వీటిలో హమ్మరా మహాకవియా, పృథ్వీరాజ్ రాస్సోలలో పృథ్వీరాజ విజయాల వివరణలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో వృత్తాకార వివరణలు ఉన్నాయి.[2]పృథ్వీరాజ్ పాలన నుండి ఉనికిలో ఉన్న ఏకైక సాహిత్య గ్రంథం పృథ్వీరాజ విజయ.[3]గొప్ప రాజుగా ప్రాచుర్యం పొందిన పృథ్వీరాజ్ రాసో రాజు ఆస్థాన కవి చంద్ బర్దై చేత వ్రాయబడింది. పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ర సామ్రాట్ అగ్నికులక్షత్రియులు అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ తను రాసి ప్రచురించిన పృధ్వీరాజ్ రాసో అనే పుస్తకంలో తెలియజేసాడు.

పుట్టుకసవరించు

పృథ్వీరాజ్ చహమాన రాజు సోమేశ్వరా, రాణి కర్పూరదేవి (ఒక కలాచూరి యువరాణి) కు జన్మించాడు.[4]వారి తండ్రి సోమేశ్వరాను తన తల్లి బంధువులు గుజరాతులోని చాళుఖ్యరాజసభకు తీసుకుని వెళ్ళారు. ఆయన చాళుఖ్యుల రాజసభలో ఉన్న సమయంలోనే పృథ్వీరాజు, అతని తమ్ముడు హరిరాజా ఇద్దరూ గుజరాతులో జన్మించాడు. [4] పృథ్వీరాజ విజయ ప్రకారం పృథ్వీరాజ్ జ్యేష్తా నెల 12 వ రోజు జన్మించాడు. ఈ గ్రంథంలో తన పుట్టిన సంవత్సరాన్ని ప్రస్తావించలేదు. కానీ తన జన్మ సమయంలో జ్యోతిషశాస్త్ర ఆధారిత జాతకచక్రాన్ని అందిస్తుంది. జాతకచక్ర ఆధారంగా దశరథ శర్మ కాలాన్ని గణించి ఆయన పృథ్వీరాజు పుట్టిన సంవత్సరం క్రీ.పూ. 1166 (విక్రమ సంవత్సరం 1223) గా నిర్ణయించాడు.[5]

విద్యసవరించు

పృథ్వీరాజు గురించిన మధ్యయుగ జీవిత చరిత్రలు అతను బాగా చదువుకున్నాడని సూచిస్తున్నాయి. పృధ్వీరాజా విజయం ఆయనకు 6 భాషలలో ప్రావీణ్యం ఉందని సూచించింది. పృథ్వీరాజ్ రాసో 14 భాషలను నేర్చుకున్నాడని వివరిస్తుంది. ఇది ఒక అతిశయోక్తిగా భావించబడుతుంది. చరిత్ర, గణితం, ఔషధం, సైనిక, పెయింటింగు, తత్వశాస్త్రం (మీమాంస), వేదాంతశాస్త్రం వంటి అనేక అంశాలలో అతను బాగా ప్రావీణ్యం పొందాడని రసో వ్యాఖ్యానించాడు. ఈ రెండు రచనల్య్ ఆయన విలువిద్యలో ప్రత్యేకంగా నైపుణ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి.[6]

అధికారబాధ్యతసవరించు

రెండవ పృథ్వీరాజా తరువాత పృథ్వీరాజు తండ్రి సోమేశ్వరా చహమానా రాజు కిరీటాన్ని ధరించిన తరువాత పృథ్వీరాజు గుజరాతు నుండి అజ్మీరుకు మారిపోయాడు.[7] క్రీ.పూ. 1177 లో (విక్రమ సంవత్సరం 1234) పృథ్వీరాజు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సోమదేవరా మరణించాడు. సోమేశ్వరా పాలన చివరి శిలాశాసనం, పృథ్వీరాజు పాలనా మొదటి శాసనం ఈ సంవత్సరం నాటివి. ఆ సమయంలో చిన్న వయస్సులో ఉన్న పృథ్వీరాజు తన తల్లి రాజప్రాతినిర్ధ్యం వహిస్తుండగా సింహాసనం అధిరోహించాడు. [5] సోమేశ్వరా సింహాసనంపై పృథ్వీరాజును సింహాసనం అధిష్టింపజేసి ఆ తరువాత విశ్రాంతజీవితం గడపడానికి వనవాసానికి వెళ్ళాడని హమీరా మహాకవి పేర్కొన్నాడు. అయితే ఇది సందేహాస్పదంగా ఉంది [8]#పృథ్వీరాజ్ చౌహాన్#బంజారా_పరివార్#

ఢిల్లీ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ‌ ఇది. తనకళ్ళు పీకేసిన కూడా గురితప్పని వీరుడు.

మ‌న దేశంలోని ఎన్నో రాష్ట్రాల‌ను, ప్రాంతాల‌ను అనేక మంది రాజులు పాలించారు. అయితే ఏ రాజుకైనా ధైర్యం, తెగువ, ఆలోచ‌న‌, యుద్ధ విద్య‌లు, తంత్రాలు అన్నీ స‌మ‌గ్రంగా తెలిసి ఉండాలి. అలాంట‌ప్పుడే శ‌త్రు రాజుల‌ను ఎదుర్కొని వారిని ఓడించ‌గ‌లుగుతారు. ఈ క్ర‌మంలో రాజుల‌కు ఉండే యుద్ధ విద్య నైపుణ్యాల్లో చెప్పుకోద‌గింది విలు విద్య‌. అవును విలు విద్యే. అర్జునుడి వంటి వారు త‌మ విలువిద్య‌తోనే ఎంతో ప్రాచుర్యంలోకి వ‌చ్చారు. బాణం ప‌ట్టి విల్లు సంధిస్తే శ‌త్రు సైన్యాలు పారిపోవాల్సిందే. ఎటు వైపు చూపు ఉన్నా, ఏ దిక్కున శ‌బ్దం విన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా బాణం విడిచి పెడితే శ‌త్రువుకు తాకే తీరుతుంది. అంత‌టి ప్రావీణ్యాన్ని కొంద‌రు రాజులు క‌లిగి ఉంటారు. అలాంటి రాజుల్లో పృథ్వీ రాజ్ చౌహాన్ (పృథ్వీ రాజ్ 3) కూడా ఒక‌రు.

ఢిల్లీ రాజ్యాన్ని ఏలిన చివ‌రి హిందూ రాజుగా పృథ్వీ రాజ్ చౌహాన్ పేరుగాంచారు. క్రీస్తు శ‌కం 1149లో జ‌న్మించిన ఆయ‌న 1192 వ‌ర‌కు ఉత్త‌ర భారతదేశంలోని అజ్మీర్‌, ఢిల్లీ రాజ్యాల‌ను పాలించాడు. చౌహామ‌నా వంశానికి చెందిన పృథ్వీ రాజ్ 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో అంటే 1169లోనే రాజుగా ప‌ట్టాభిషిక్తుడై రాజ్య నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాడు. అలా రాజు కాగానే త‌న నైపుణ్యాలు, ధీర‌త్వంతో ఎంద‌రో రాజుల‌ను ఓడించి వారి రాజ్యాల‌ను కైవ‌సం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌స్థాన్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల‌ను పాలించాడు. 1175వ సంవ‌త్స‌రంలో కనౌజ్ రాజ్యానికి చెందిన జై చంద్ర రాథోడ్ కుమార్తె సంయుక్త‌ను వివాహం చేసుకున్నాడు. వారిద్ద‌రి ప్రేమ‌క‌థ‌ను కూడా చ‌రిత్ర‌కారులు ఆస‌క్తిగా చెబుతారు. అయితే పృథ్వీ రాజ్ చౌహాన్ కు చాంద్ బ‌ర్దెయ్ అనే స్నేహితుడు ఉండేవాడు. అత‌ను ఓ మంచి క‌వి. పృథ్వీ రాజ్ చౌహాన్ వ‌ద్దే ఉండేవాడు. అయితే అంద‌రు రాజుల్లాగే పృథ్వీ రాజ్ చౌహాన్ కు కూడా ఒకానొక సంద‌ర్భంలో గ‌డ్డుకాలం వ‌చ్చింది. అదే అత‌ని మ‌ర‌ణానికి దారి తీసింది.

1191లో షాహ‌బుద్దీన్ మ‌హ‌మ్మ‌ద్ ఘోరీ ఇరాన్ నుంచి 1.20 ల‌క్ష‌ల మంది సైనికుల‌తో కైబ‌ర్ క‌నుమ‌ల గుండా పంజాబ్ స‌రిహ‌ద్దు ప్రాంతంలోకి ప్ర‌వేశించాడు. ఢిల్లీని ఎలాగైనా ఆక్ర‌మించాల‌నేది అత‌ని వ్యూహం. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ కూడా త‌క్కువేం తిన‌లేదు. అత‌ని వ‌ద్ద 1 ల‌క్ష మంది మెరిక‌ల్లాంటి సైనికులు ఎప్ప‌టికీ సిద్ధంగా ఉండేవారు. కాగా తారెయిన్ (హర్యానాలో, ప్ర‌స్తుత ఢిల్లీకి 150 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది) అనే ప్రాంతంలో ఘోరీ త‌న సైన్యంతో వ‌చ్చి పృథ్వీరాజ్ చౌహాన్ కు స‌వాల్ విసిరాడు. దీంతో చౌహాన్ ఘోరీతో యుద్ధం చేశాడు. అయితే విజ‌యం చౌహాన్‌నే వ‌రించింది. కానీ ఘోరీ అనేక విధాలుగా ప్రాధేయ‌ప‌డ‌డంతో చ‌లించిపోయిన చౌహాన్ ఇత‌రులు వ‌ద్దంటున్నా విన‌కుండా ఘోరీని విడిచిపెట్టాడు. అదే అత‌నికి మృత్యుపాశ‌మైంది.

మ‌రుస‌టి ఏడాది 1192లో ఘోరీ 1.20 ల‌క్ష‌ల మంది సైనికుల‌తో మ‌ళ్లీ చౌహాన్‌పై యుద్ధం చేసేందుకు దండెత్తి వ‌చ్చాడు. ఈ సారి చౌహాన్ 150 మంది రాజుల‌ను ఏకం చేసి, 3 ల‌క్ష‌ల మంది సైనికులు, 3వేల ఏనుగుల‌తో ఘోరీపై యుద్ధానికి దిగాడు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ చౌహాన్ ఈసారి ఘోరీపై ఓడిపోయాడు. చౌహాన్‌తోపాటు అత‌ని స్నేహితుడు చాంద్ బ‌ర్దెయ్ కూడా ఘోరీకి చిక్కాడు. వీరిద్ద‌ర్నీ ఘోరీ యుద్ధ ఖైదీలుగా ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని పెషావ‌ర్‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ చౌహాన్‌ను నానా అవ‌స్థ‌ల‌కు గురి చేశాడు. అనేక క‌ష్టాలు పెట్టాడు. భ‌గ భ‌గ మండే అగ్ని కీల‌ల‌తో క‌ళ్ల‌లో పొడిచే స‌రికి చౌహాన్ గుడ్డి వాడ‌య్యాడు. కాగా ఒకానొక సంద‌ర్భంలో ఘోరీ విలువిద్య‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌మ‌ని చౌహాన్‌ను స‌భా స్థ‌లిలో నిల‌బెడ‌తాడు. అత‌నికి బాణాలు, విల్లును ఇస్తారు. అదే స‌మ‌యంలో చాంద్ బ‌ర్దెయ్ చౌహాన్‌కు వినిపించేలా ఘోరీ ఉన్న ప్ర‌దేశాన్ని పాట రూపంలో చౌహాన్‌కు చెబుతాడు. దీంతో చౌహాన్ అప్ర‌మ‌త్త‌మై బాణం వేస్తాడు. అది స‌రిగ్గా వెళ్లి ఘోరీకి తాకుతుంది. దీంతో అత‌ను మ‌ర‌ణిస్తాడు. అనంత‌రం చాంద్ బ‌ర్దెయ్ చౌహాన్‌ను చంపి, తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఇదీ ఢిల్లీ చివ‌రి హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ‌. అయితే చాంద్ బ‌ర్దెయ్, పృథ్వీరాజ్ చౌహాన్‌ల‌ను స‌మాధి చేసిన చోటు ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని పెషావ‌ర్‌లో ఇప్ప‌టికీ ఉంది. అక్క‌డ వారి స‌మాధుల ఆన‌వాళ్లు ఇప్ప‌టికీ క‌నిపిస్తాయ‌ని చెబుతారు. కానీ ఆ ప్ర‌దేశం స్థానికుల ఆద‌ర‌ణ‌కు క‌రువైంది. కార‌ణం, త‌మ రాజైన ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ చంపాడ‌ని, అంతే..! అయితే నేటి తరం వారు మాత్రం చౌహాన్ నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది. అదేంటంటే… ఎంత‌టి దీనావ‌స్థ‌లో ఉన్నా, ఎన్ని క‌ష్టాలు ఎదురైనా త‌న‌కు కూడా ఎప్పుడో ఒకప్పుడు స‌మ‌యం వ‌స్తుంద‌ని చౌహాన్ అనుకున్నాడు, అలాగే వ‌చ్చింది, దాన్ని స‌రిగ్గా వాడుకుని ఘోరీని అంత‌మొందించాడు, అదీ అత‌ని జీవితం నుంచి మ‌నం నేర్చుకోవాల్సింది..! అంతే క‌దా, ఏమంటారు..!

ప్రబంధ చింతామణి అనే పుస్తకంలో మాత్రం ఘోరీ పృథ్విరాజ్ చౌహాన్ మధ్య 22 యుద్ధాలు జరుగగా 21 సార్లు చౌహాన్ గెలిచి ఘోరీకి క్షమాభిక్ష పెట్టి వదిలేసాడని 22వ యుద్ధంలో పరాజయం పొందారని రాసి ఉంది. ముఖ్య గమనిక.. చరిత్ర చేరిపేసిన వేల సత్యాలలో ఇది ఒకటి... ఎర్రకోట కట్టింది #షాజాహాన్ (ముస్లీం) (నేను చదివిన దొంగ చరిత్ర)

ఎర్రకోట కట్టింది 1060 లో అనంగపాల్ అనే హిందూ రాజు ఢిల్లీ నీ పాలించిన రాజులు చరిత్ర ఎక్కిన స్వయాన పృధ్వీరాజ్ చౌహాన్ రాజు యొక్క తాత గారు.... ఇది రేపు నా పిల్లలు చదివే అసలు చరిత్ర.. మన చరిత్ర, మన సంప్రదాయాలు నీ మార్చాలని చూసిన ముస్లిం కవులుకి ఒక విన్నపం మీరు ఎన్నిసార్లు చరిత్ర మార్చిన ఎక్కడో ఒకచోట నిజం వుంటుంది మేము వాటిని వెలికి తీసి మరల ఇక్కడే ప్రచురిస్తాము...ఇప్పటికీ, ఎప్పటికీ ఈ దేశం ముమ్మాటికీ హిందువులదే....ఇది జగమెరిగిన సత్యం...ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే జమనా కాదు ఒక చెంప మీద కొడితే అలా కొట్టిన వాడి తలని నరికే జమాన.

మూలాలుసవరించు

  1. Cynthia Talbot 2015, p. 38.
  2. R. B. Singh 1964, p. 162.
  3. Cynthia Talbot 2015, p. 37.
  4. 4.0 4.1 Dasharatha Sharma 1959, p. 69.
  5. 5.0 5.1 Dasharatha Sharma 1959, p. 72.
  6. R. B. Singh 1964, p. 161.
  7. R. B. Singh 1964, p. 156.
  8. R. V. Somani 1976, p. 38.