ప్రధాన మెనూను తెరువు

పెండలము దుంప ఉష్ణ మండలాలలో పెరిగే ఒక రకమైన ఏక వార్షిక తీగ మొక్క. ఇది 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. సంస్కృతంలో పెండలాన్ని "ఆలూకమ్" అనిన్నీ, "పిండాలు" (పిండి + ఆలూ) అనిన్నీ పిలుస్తారు. ఇందులోంచే పెండలం అన్న తెలుగు మాట పుట్టింది.

ప్రపంచంలో పెండలం జాతి మొక్కలు 600 పైబడే ఉన్నాయి. వీటిల్లో తిండానికి పనికొచ్చే ఉపజాతులు ఉరమరగా 10 ఉంటాయేమో. భారతదేశంలో దొరికే పెండలాలలో దరిదాపు 50 రకాలు ఉన్నాయి: వాటిల్లో ముఖ్యమైనవి: పెద్ద పెండలం (డయొస్కోరియా అలాటా, Dioscorea alata), చిన్న పెండలం (డయొస్కోరియా ఎస్కులెంటం, Dioscorea esculentum). మిగిలినవి అటవీ జాతులు కాగా ఈ రెండింటినే భారత దేశంలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆధునిక వృక్షశాస్త్రానికి ఆద్యుడూ, మెటీరియా మెడికా గ్రంథకర్త, సా. శ. 1 శతాబ్దానికి చెందిన వాడైన గ్రీకు విజ్ఞఆని పెడారియోస్ డయస్కోరిడీజ్ (Pedanios Dioscorides) పేరిట ఈ తీగ మొక్కకి ఆయన పేరు పెట్టడం జరిగింది. తమాషా ఏమిటంటే పెద్ద పెండలం తీగ కుడి వైపుకి తిరుగుతూ అల్లుకుపోతుంది, చిన్న పెండలం తీగ ఎడమ వైపుకి తిరుగుతూ అల్లుకుపోతుంది. ఈ లక్షణాన్ని పురస్కరించుకుని పెండలాలని రెండు జాతులుగా విడగొట్టి అధ్యయనం చేస్తారు.

"అలాటా" అంటే "రెక్కలు కలది" అని అర్థం. బీరకాయ మీద పొటమరించిన నరాల మాదిరి ఈ మొక్క కాండం మీద పొటమరించిన "రెక్కలు" (wings) ఉంటాయి. అందుకని అలాటా అన్న పేరు వచ్చింది. దీని వేళ్లు భూమిలోపల దుంపలలా ఊరతాయి. ఒకొక్క దుంప 30 కేజీల వరకు తూగవచ్చు. చేమ దుంపల మాదిరి ఈ దుంపలు పైన గరుగ్గాను, నూగుతో కలసి ఉంటాయి. దుంఫ లోపల జిగురు గల పిండి పదార్థం (strachy substance) ఉంటుంది. "ఎస్కులేటం" అంటే ఆహారానికి ఉపయోగపడేది అని అర్థం.

ఇంగ్లీషులో పెద్ద పెండలాన్ని Greater Yam అనిన్నీ, చిన్న పెండలాన్ని Lesser Yam అనిన్నీ అంటారు. ఇంగ్లీషులో పెండలంలా కనిపించే మరొక దుంపని Cassava అని కూడ అంటారు. చిక్కు ఎక్కడ వస్తుందంటే దేశకాలపరిస్థితులని బట్టి ఇంగ్లీషు వాడకంలో పేరు మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి D. alata ని ఇంగ్లీషులో Guyana arrowroot, ten-months yam, water yam, white yam, winged yam, violet yam, purple yam, yam అనే పేర్లు ఉన్నాయి. అందుకని శాస్త్రీయ నామం మీద ఆధారపడడం వల్ల సందిగ్ధానికి అవకాశం ఉండదు. ఈ సందర్భంలో కొన్ని పేర్లని ఇక్కడ సంక్షిప్త పరుద్దాం:

  • బంగాళాదుంప = ఆలూ = ఉర్ల గడ్డ = [bot.] Solanum tuberosum = Potato
  • తియ్యదుంప = చిలగడదుంప = గెనుసు గడ్డ = [bot.] Ipomoea batatas = Sweet potato
  • చేమ దుంప = [bot.] Colacasia esculenta = Taro root
  • పాలగరుడ వేరు = [bot.] Marantha ramosissima or [bot.] en:Maranta arundinacea; [bot.] en:Curcuma angustifolia; క్షీరపిష్ఠ = Arrow-root; a flour made from this is called పాలగుండ and is used in the preparation of puddings; (note) this looks similar to other underground tubers such as cassava, yucca or kudzu, which are oblong in shape;
  • కంద = [bot.] amorphophallus campanulatus (Watts) = Elephant-foot yam
  • పెండలం = (1) [bot.] Dioscorea esculentum = Lesser Yam; (2) [bot.] Dioscorea alata = Grater yam = Purple yam;
  • కర్రపెండలం = cassava root = yucca; the starch from this root is used to make tapioca or sago [bot.] Manihot utilissima; Manihot esculenta;
  • అమెరికాలో అనేక రకాల దుంపలని కట్టగట్టి "యామ్" అని పిలిచెస్తారు.
తియ్యదుంప
ఏరోరూట్
arrowroot=క్షీరపిష్ఠ=పాలగరుడ
కర్ర పెండలము దుంప

డయోస్కోరియా జాతులుసవరించు

మూలాలుసవరించు

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  • ముత్తేవి రవీంద్రనాథ్, కూరగాథలు, విశాలాంధ్ర ప్రచురణాలయంలో దొరుకుతాయి, 2014
"https://te.wikipedia.org/w/index.php?title=పెండలము&oldid=2676866" నుండి వెలికితీశారు