ప్రధాన మెనూను తెరువు
చిలగడదుంప
Kumara.jpg
చిలగడ దుంప
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియాప్సిడా
క్రమం: సొలనేలిస్
కుటుంబం: కన్వాల్వులేసి
జాతి: ఐపోమియా
ప్రజాతి: ఐ. బటాటాస్
ద్వినామీకరణం
ఐపోమియా బటాటాస్
లిన్నయస్
Sweet Potato of Salem.jpg

చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి

  1. లేత పసుపు
  2. నారింజ
  3. గులాబి రంగు

ఉపయోగాలుసవరించు

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---

పీచుసవరించు

బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.

విటమిన్‌ బీ6సవరించు

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

పొటాషియంసవరించు

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

విటమిన్‌ ఏసవరించు

చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.

మాంగనీసుసవరించు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి.

విటమిన్‌ సి, ఈసవరించు

వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.

సహజ చక్కెరలుసవరించు

లగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి

Raw Sweet Potato
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 90 kcal   360 kJ
పిండిపదార్థాలు     20.1 g
- చక్కెరలు  4.2 g
- పీచుపదార్థాలు  3.0 g  
కొవ్వు పదార్థాలు0.1 g
మాంసకృత్తులు 1.6 g
విటమిన్ A  709 μg79%
థయామిన్ (విట. బి1)  0.1 mg  8%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.1 mg  7%
నియాసిన్ (విట. బి3)  0.61 mg  4%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)  0.8 mg 16%
విటమిన్ బి6  0.2 mg15%
ఫోలేట్ (Vit. B9)  11 μg 3%
విటమిన్ సి  2.4 mg4%
కాల్షియమ్  30.0 mg3%
ఇనుము  0.6 mg5%
మెగ్నీషియమ్  25.0 mg7% 
భాస్వరం  47.0 mg7%
పొటాషియం  337 mg  7%
జింకు  0.3 mg3%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=చిలగడదుంప&oldid=2546694" నుండి వెలికితీశారు