పెద్దయ్య గుట్ట దేవాలయం
పెద్దయ్యగుట్ట దేవాలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వలయాకారంలో ఉంది.గుట్ట చూడడానికి నిటారుగా ఒక నిలబెట్టిన స్తంభం వలే ఉంటుంది[1][2].
పెద్దయ్య గుట్ట దేవాలయం దండేపల్లి | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E |
పేరు | |
ఇతర పేర్లు: | ధర్మరాజు కొండ పాండవుల క్షేత్రం పెద్దయ్య క్షేత్రంగా |
ప్రధాన పేరు : | పెద్దయ్య గుట్ట ఆలయం |
దేవనాగరి : | पेद्दय्या गुट्टा देवस्थान |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలోని మామిడిపల్లి పంచాయతీ పరిధిలో |
ప్రదేశం: | పెద్ద గుట్ట |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ధర్మరాజు |
ఉత్సవ దైవం: | పెద్దయ్య దేవుడు |
ఉత్సవ దేవత: | పెద్దయ్య దేవుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
స్థలపురాణం
మార్చుఈ పెద్దయ్య గుట్ట దేవుడు ఆలయం దండేపల్లి మండల కేంద్రము నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థలపురాణం ప్రకారం ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం చేసేందుకు ఈ గుట్ట ప్రాంతంలో వచ్చి ఈ కొండ మీదే తల రాసుకున్నారుని అంటారు. పెద్దయ్య అంటే పంచ పాండవులులో పెద్దవాడైన ధర్మరాజు కాబట్టి ఈ గుట్టకు పెద్దయ్య గుట్ట అని పేరు వచ్చిందని అంటారు.
విశేషాలు
మార్చుఈ పెద్దయ్య గుట్ట ఆలయంలో ఆదివాసీ నాయక్ పోడ్ గిరిజన తెగకు చెందిన పూజారి దేవుడి పూజా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు.గిరిజన పూజారి పూనకంతో దైవభక్తి, దైవధ్యానంలో ఉండి వేయ్యి అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న గుట్ట పైకి పది నిమిషాలలో ఎక్కడం విశేషం.
రైతులకు భరోసా
మార్చుపెద్దయ్య గుట్ట వద్ద దేవగణికలు ఉంటారని, అక్కడ నుంచి పూజారి పసుపు కుంకుమలు ఖరీఫ్ సీజన్లో పండే పంట గొలుకలను తీసుకుని వచ్చి గుట్ట దిగి దేవుని దగ్గర వచ్చిన రైతులకు ఏ సీజన్లో ఏ రంగు పంటలు ఎక్కువగా పండుతుందో,వర్షాల స్థితి ఎలా ఉంటుందో ఏ ఏ పంటలకు ఎలాంటి వ్యాధులు వస్తాయో మొదలగు విషయాల పై జోస్యం చెప్పి వారికి పొలాల్లో చల్లుకోమని పసుపు కుంకుమలను పూజారి పంచిపెడతాడు. పెద్దయ్య గుట్ట దేవుడు దర్శనం కోసం రైతన్నలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవుని దర్శించుకుంటారు. ఈ దేవుని మొక్కడం వలన రైతులకు పంటలు బాగా పండుతాయి రైతుల నమ్మకము. వర్షాకాలంలో పొలంలో విత్తనాలు విత్తేటప్పుడు, పంటలు కోతలకు వచ్చేటప్పుడు రైతులు చూట్టు ప్రక్కల గ్రామాల వారు వందల సంఖ్యలో వచ్చి దేవుని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు.
జాతర
మార్చుపెద్దయ్య గుట్ట జాతర ఎప్రిల్ నేలలో రెండు రోజులు ఆదివాసీ నాయక్ పోడ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయ ప్రధాన పూజారులుగా మేకల పోశయ్య ,తూట్ర అర్జున్, ఆలయ కమిటీ సభ్యులు నాయుడి చందు, మేకల ప్రశాంత, చిన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జాతరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవుని దర్శించుకుంటారు. గజ్జిబండ ప్రాంతం వరకు వాహనాల్లో వెళ్ళి మళ్ళీ అచటి నుండి కాలినడకన పెద్దయ్య గుట్టును చేరుకుంటారు. చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవులు గల ఈ ప్రాంతంలో ఆరుగాలం నీరందించే జీడివాగు ఉంది. ఇక్కడ ఒక పవిత్రమైన అల్లు బండ ఉంది. కోరిక కోర్కెలు తీర్చుకోవడానికి ఈ బండను భక్తులు ఎత్తిచో మనసులో అనుకున్నా కోర్కెలు తీర్చును. ఈ పెద్దయ్య దేవాలయంను అన్నదాతల దేవాలయం అని పేరుంది. ఎందుకంటే రైతులు ఈ దేవుని దర్శించుకొని పూజారి ఇచ్చిన పసుపు, కుంకుమ, నీళ్ళు ను పొలంలో చల్లుకోవడం తో చిన్న చిన్న సూక్ష్మజీవులు చీడపీడలు చనిపొతాయని రైతుల నమ్మకము.
మూలాలు
మార్చు- ↑ Bharat, E. T. V. (2021-03-21). "పెద్దయ్యగుట్ట.. రైతుల కోర్కెలు తీర్చునంట!". ETV Bharat News. Retrieved 2024-11-02.
- ↑ ABN (2023-07-01). "పెద్దయ్య ఆలయంపై పట్టింపేది..?". Andhrajyothy Telugu News. Retrieved 2024-11-01.