పెద్దాపురం పురపాలక సంఘం

పెద్దాపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని,పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

పెద్దాపురం పురపాలక సంఘం
పెద్దాపురం
స్థాపన1915
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

పెద్దాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఇది 1915 సంవత్సరంలో 2 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురాన్ని ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురాన్ని రెవెన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు నిర్మించారు. 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశంలో కంపెనీ పాలన రద్దు చేయబడి 1858 నుండి బ్రిటీష్ రాజ్ ఆవిర్భవించింది. ఆ తరువాత కొంత కాలానికి 1902 లో బ్రిటీషు వారిచే "టౌన్ హాల్" నిర్మించబడి 1915 లో రాష్ట్రంలో నే రెండవ మున్సిపాలిటీగా పెద్దాపురం ఆవిర్భవించబడింది. వి. కే అనంత కృష్ణ అయ్యర్, అభినవ పట్నాయక్ లు బ్రిటీషు గవర్నమెంటు వారిచే నియమించబడి 1915 నుండి 1918 వరకూ పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్‌పర్సన్ లుగా వ్యవహరించగా వీరి అనంతరం బ్రిటీషు వారిచే నియమింపబడిన పెద్దాపురం వాస్తవ్యుడైన మొట్టమొదటి చైర్మెన్ పింగళి కృష్ణారావు పంతులు (1918 – 1921)

1921 నుండి 2014 వరకు పనిచేసిన చైర్‌పర్సనులు

మార్చు
 
1961లో పెద్దాపురంలో ఆలిండియా బ్యాడ్మింటన్, చెడుగుడు పోటీలను ప్రారంభిస్తున్న ముప్పన రామారావు
  • గోలి పెద కొండయ్య (1921 – 1924) పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు
  • గుర్రాల కృష్ణా రావు (1924-1926)
  • ముప్పన చిన వీర్రాజు (1926-1928)
  • చల్లా దొరయ్య (1928-1931)
  • జనాబ్ ఇస్మాయిల్ ఖాన్ సాహెబ్ (1931-1933)
  • నియోగి వెంకట సుబ్బారావు (1933-1934)
  • గొల్లకోట వెంకట రత్నం (1934-1936)
  • జనాబ్ M.A కరీం సాహెబ్ (1938-1941)
  • ముప్పన చిన అంకయ్య (1943-1947)
  • ముప్పన పెద వీరభద్ర రావు (1947-1952)
  • చల్లా వెంకట రావు (1952-1956)
  • ముప్పన రామారావు (1956 – 1972 & 1981- 1986) వరుసగా 4 సార్లు పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై 1961-66 కాలానికి ఛాంబర్ చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి ఇప్పటి వరకూ ఎక్కువ కాలం చైర్మన్ గా చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
  • తాళ్ళూరి గంగా భవాని (1987-1992)
  • బచ్చు శ్రీదేవి (1995-2000)
  • ముప్పన శ్యామలాంబ (2005-2010)
  • రాజా వత్సవాయ సూరిబాబు రాజు (2000 – 2005 & 2014 - ) రెండవ సారి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 49,477 జనాభా ఉండగా అందులో పురుషులు 24,334, మహిళలు 25,143 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 77.14% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 80.41% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 72.05%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4219 ఉన్నారు.[2]

భౌగోళికం

మార్చు

పెద్దాపురం పట్టణం17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది.[3] సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా లక్ష్మీ సూర్యనారాయణ రాజు,[4] వైస్ చైర్మన్‌గా సత్య భాస్కరరావు పనిచేస్తున్నారు.[4]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • మరిడమ్మ తల్లి దేవాలయం
  • సామర్లకోట చాళుక్య కుమరారామ మందిరం (భీమేశ్వరాలయం), ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
  • పెద్దాపురంపాండవులమెట్ట, పాండవగుహలు
  • ముప్పన వారి బంగ్లా గాలి బంగ్లా - కార్తీక మాసంలో జరుగు వనభోజనములకు ప్రసిద్ధి
  • హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔలియా దర్గా తొమ్మిది మూరల సాహెబ్ దర్గా
  • కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
  • తిరుపతి (పెద్దాపురం) శృంగార వల్లభస్వామి వారి దేవాలయం
  • వాలుతిమ్మాపురం ఆంజనేయ స్వామి వారి దేవాలయం
  • పాండవుల మెట్ట మీద గల సూర్యనారాయణ స్వామి దేవాలయం.
  • పరమేశ్వర, వెంకటేశ్వర, అయ్యప్ప స్వామి దేవాలయాలు.
  • చంద్రబాబు శతాబ్ది పార్కు

ఇతర వివరాలు

మార్చు

ఈ పురపాలక సంఘం 38.77.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.15 రెవెన్యూ వార్డులు,28 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 45 మురికివాడలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,2ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Peddapuram Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-11.
  3. "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2008-06-27.
  4. 4.0 4.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

మార్చు