పెద్దాపుర సంస్థాన చరిత్రము (పుస్తకము)

తెలుగు పుస్తకము

పెద్దపుర సంస్థాన చరిత్ర గురించి చదవండి పెద్దాపుర సంస్థానం

పెద్దాపుర సంస్థాన చరిత్రము వత్సవాయ రాయజగపతి వర్మ ప్రచురించిన చారిత్రక పుస్తకం. దీనిని మనోరమా ముద్రాక్షరశాల, రాజమహేంద్రవరంలో 1915లో రెండవసారి ముద్రించారు. దీనిలో పెద్దాపుర సంస్థానం యొక్క చరిత్ర విశదీకరించారు.

బ్రిటీష్ పరిపాలన కాలంలో దేశంలో వివిధ సంస్థానాలు, రాజ్యాలు సామంతదేశాల్లా ఉండేవి. వాటి అధికారాలు, పన్నుల విధానం కూడా బ్రిటీష్ వారికి ఆ సంస్థానాధీశునితో ఉండె సంధి ఒప్పందాల ఫలితంగా వేర్వేరుగా ఉండేది. ఈ క్రమంలోనే బ్రిటీష్ పాలనలో నేటి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన పెద్దాపురం సంస్థానం చరిత్ర ఈ పుస్తకంలో వివరించారు. వత్సవాయి వంశక్రమం, పెద్దాపురం గెలుచుకోవడం, పాలన, వివిధ మార్పులు వంటివన్నీ ఇందులో వివరించారు. ఆంధ్రదేశంలో ప్రముఖమైన ప్రాంతంలోని సంస్థానం కావడంతో ఈ సంస్థాన చరిత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

ఈ గ్రంథాన్ని కవి తన తాతయ్యగారికి, బుచ్చి వెంకయ్యంబాదేవిగారికి అంకితమిచ్చాడు.

సంస్థానం చరిత్ర కధలు

మార్చు

పెద్దాపుర సంస్థాన చరిత్రము : చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు


తిమ్మరాజు గారి కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607) శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు సంస్థాన సంపాదకులు. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురంలో ఒక కోటను నిర్మించారంట. తిమ్మరాజు గారి తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.

'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె నతని కీర్తి నటించు శీతాద్రిసేతు మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు' - రామ విలాసము, అవతారిక, పు. 21.

ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తిని బహుమానంగా ఇచ్చాడట.

'షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.

విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు

ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు మూస:Https://plus.google.com/+vangalapudisivakrishna/posts

మూలాలు

మార్చు