పెద్దింటి రామస్వామి నాయిడు
రాజకీయ నాయకుడు, రచయిత
పెద్దింటి రామస్వామి నాయుడు (జననం: 31-12-1905) రాజకీయ నాయకుడు, రచయిత.[1]
పెద్దింటి రామస్వామి నాయుడు | |
---|---|
జననం | డిసెంబరు 31, 1905 బొబ్బిలి మండలం పిరిడి గ్రామం |
నివాస ప్రాంతం | పిరిడి |
వృత్తి | రాజకీయ నాయకుడు, కవి. |
పదవి పేరు | శాసనసభ్యుడు |
పదవీ కాలం | 1955-1956 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
వీరి స్వస్థలం బొబ్బిలి తాలూకా లోని పిరిడి గ్రామం. వీరు బలిజిపేట నియోజకవర్గం నుండి 1955 లో ఆంధ్ర రాష్ట్రానికి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి యం.ఏ. పట్టభద్రులయ్యారు. రాజకీయల్లో ప్రవేశించి 1945 నుండి కాంగ్రెసు సభ్యునిగా, బొబ్బిలి తాలూకా కాంగ్రెసు అధ్యక్షునిగా, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సభ్యునిగా విశిష్ట సేవలందించారు. బొబ్బిలి తాలూకా చెరుకుపంటదారుల సంఘము అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడు. ఇదివరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గ సభ్యుడు. వీరి ప్రత్యేక అభిమానం: సారస్వతము, గ్రంథరచన. కర్షకచక్రవర్తి (పద్యకావ్యము) అప్పకవీయ విషయపరిశోధన, శ్రీనాథుని కళాప్రావీణ్యము..
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6. Retrieved 9 June 2016.