పెద్ద కొడపగల్ మండలం
పెద్ద కొడపగల్, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
పెద్ద కొడపగల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, పెద్ద కొడపగల్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | కామారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | పెద్ద కొడపగల్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 93 km² (35.9 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 20,891 |
- పురుషులు | 10,642 |
- స్త్రీలు | 10,249. |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 47 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 13 గ్రామాలున్నాయి. నిర్జన గ్రామాలు లేవు.దానికి ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.మండల కేంద్రం పెద్ద కొడపగల్.
గణాంకాలుసవరించు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 93 చ.కి.మీ. కాగా, జనాభా 20,891. జనాభాలో పురుషులు 10,642 కాగా, స్త్రీల సంఖ్య 10,249. మండలంలో 4,228 గృహాలున్నాయి.[4]
2016లో ఏర్పడిన మండలంసవరించు
లోగడ పెద్ద కొడపగల్ గ్రామం నిజామాబాదు జిల్లా కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని బిచ్కుంద మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్ద కొడపగల్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా, కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో 1+12 (పదమూడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
మండలం లోని రెవెన్యూ గ్రామాలుసవరించు
రెవెన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.