బాన్సువాడ రెవెన్యూ డివిజను
బాన్సువాడ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కామారెడ్డి జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం బాన్సువాడ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
బాన్సువాడ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కామారెడ్డి |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
మార్చుబాన్సువాడ డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | బాన్సువాడ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | బాన్స్‌వాడ మండలం | 19 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
2 | బీర్కూర్ మండలం | 15 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
3 | నసురుల్లాబాద్ మండలం | 16 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
4 | బిచ్కుంద మండలం | 29 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
5 | జుక్కల్ మండలం | 31 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
6 | పిట్లం మండలం | 27 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
7 | పెద్ద కొడపగల్ మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
8 | మద్నూరు మండలం | 42 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
9 | నిజాంసాగర్ మండలం | 30 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-30.
- ↑ "Revenue Divisions | District Kamareddy, Government of Telangana | India". www.kamareddy.telangana.gov.in. Archived from the original on 2022-02-15. Retrieved 2022-04-30.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-04-30.