పెమా ఖండు (1979 ఆగస్టు 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. 2016 జూలై నుండి పరిపాలనలో ఉన్న పెమా ఖండు ప్రభుత్వం రెండు సార్లు తమ పార్టీని మార్చారు: 2016 సెప్టెంబరులో భారత జాతీయ కాంగ్రెస్ నుండి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కి ఒకసారి, 2016 డిసెంబరులో రెండవసారి భారతీయ జనతా పార్టీకి మారారు.[2][3]

పెమా ఖండు
పెమా ఖండు


అరుణాచల్ ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2016 జులై 17
డిప్యూటీ చౌన మెయిన్
ముందు నభమ్ తుకీ

అరుణాచల్ ప్రదేశ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అరుణాచల్ ప్రదేశ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2011
ముందు దోర్జీ ఖండు
నియోజకవర్గం ముక్తో

వ్యక్తిగత వివరాలు

జననం (1979-08-21) 1979 ఆగస్టు 21 (వయసు 44)
తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు *భారత జాతీయ కాంగ్రెస్ (2016 సెప్టెంబర్ వరకు)
సంతానం 3 (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
నివాసం తవాంగ్ జిల్లా and ఇటానగర్
పూర్వ విద్యార్థి [Hindu College, University of Delhi

వ్యక్తిగత జీవితం మార్చు

పేమ ఖండు అరుణాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు కుమారుడు. దోర్జి ఖండు 2011 ఏప్రిల్ 30న తవాంగ్ నగరం వెళ్తున్న సమయంలో హెలికాఫ్టర్ యాక్సిడెంట్లో మరణించాడు. ఖండు భౌద్ధమతస్తుడు. హిందూ కాలేజి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసాడు.[4]

కెరీర్ మార్చు

రాజకీయాల్లో మార్చు

2011 లో అతని తండ్రి మరణం తరువాత రాష్ట్ర కాబినెట్లో ఖండు వాటర్ రిసోర్స్ డెవెలప్మెంట్, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2011 జూన్ 30న తన తండ్రి నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఏకగ్రీవంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముక్తో నియోజకవర్గం నుండి పోటీ లేకుండా ఖండు తిరిగి ఎన్నికయ్యాడు. ఏడాది పొడవునా రాజకీయ సంక్షోభం తరువాత 37 సంవత్సరాల వయసులో ఖండు 2016 జూలై 17 న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

2016 సెప్టెంబరు 16 న, సిఎం పెమా ఖండు ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన అరుణాచల్ పీపుల్స్ పార్టీకి ఫిరాయించారు. దీంతో కొన్ని కారణాల వల్ల 2016 డిసెంబరు 21న ఖండునీ పార్టీ అధ్యక్ష పదవినుండి తప్పించారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బిజెపి తన బలాన్ని 45 కి పెంచడంతో 2016 డిసెంబరు లో, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 43 మంది శాసనసభ్యులు 33 మంది భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఖండు శాసనసభలో తన మెజారిటీని తిరిగి సాధించాడు.

ఖండు అరుణాచల్ ప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ నుండి రెండవ ముఖ్యమంత్రి, అంతకు మునుపు గెగోంగ్ అపాంగ్ 2003 లో 44 రోజుల పాటు బిజెపి నుండి అరుణాచల్ ప్రదేశ్ కి ముఖ్యమంత్ర్రిగా ఉన్నాడు.[5][6]

మూలాలు మార్చు

  1. Shankar Bora, Bijay (31 December 2016). "Arunachal CM Pema Khandu joins BJP, ends political crisis". The Tribune. Arunachal Pradesh. Retrieved 31 December 2016.[permanent dead link]
  2. "Arunachal gets full-fledged BJP govt as Pema Khandu, 32 others join saffron party". The Indian Express (in ఇంగ్లీష్). 2016-12-31. Retrieved 2021-06-01.
  3. Service, Tribune News. "Arunachal CM Pema Khandu joins BJP, ends political crisis". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  4. "The Arunachal Times - Archives - may11 24". www.arunachaltimes.in. Retrieved 2021-06-01.
  5. "In Arunachal, CM Pema Khandu wins musical chairs game for BJP". The Indian Express (in ఇంగ్లీష్). 2017-01-01. Retrieved 2021-06-02.
  6. "Arunachal: Shifting to BJP, Pema Khandu drops 3 ministers, 2 advisors, 5 parliamentary secretaries". The Indian Express (in ఇంగ్లీష్). 2017-01-03. Retrieved 2021-06-02.
"https://te.wikipedia.org/w/index.php?title=పెమా_ఖండు&oldid=4075839" నుండి వెలికితీశారు