పేడ పురుగు లేదా పెండ పురుగు (ఆంగ్లం Dung beetle) పశువుల మలంపై జీవించే ఒక విధమైన కీటకము. కొమ్ములుండే మగ పేడ పురుగు తన కంటే 1141 రెట్లు బరువు గల వస్తువులను ఎత్తగలదు. ఇది వాటి తొమ్మిది చేతులు కలిపి ఎత్తగలిగే సగటు బరువుకు సమానం.[1] జీవ అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో కీటకాలది ముఖ్యపాత్ర. అంటే ఏదైనా త్వరగా కుళ్లిపోయి, తిరిగి మట్టిలో కలిసేందుకు అవి ఉపయోగపడతాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బరువులు మోసే కీటకం ఇదే.

పేడ పురుగు
ఒక పేడ పురుగు, with a shovel-like head, rolling a dung ball with its hind legs
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:

‘‘మలాన్ని మట్టిలో కలిపే పేడ పరుగులు లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మనమంతా చట్టూ మలంతో, కళేబరాల మధ్య బతకాలి’’ అని మెక్ ఆలిస్టర్ బీబీసీతో చెప్పారు.[2]

దీని పరుగూ వేగంగా ఉంటుంది. వీటికి రెక్కలూ ఉంటాయి. గాల్లోనూ ఎగరగలవు. ఇవి పేడను గుండ్రటి బంతుల్లా చేసి... తరలిస్తుంటాయి. తర్వాత వీటిలో ఓ చోట భూమిలో కప్పెడతాయి. దీని వల్ల భూమి సారవంతం అవుతుంది. మొక్కలు, చెట్లకు కావాల్సిన ఎరువు దొరుకుతుంది. ఓ రకంగా వీటిని పారిశుద్ధ్య కార్మికులుగా, పర్యావరణ రక్షకులుగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇవి పేడను బంతుల్లా చేసి ఎందుకు తరలిస్తాయంటే.. వాటిలో తమ గుడ్లు పెట్టడానికి! పేడపురుగులతో పాటు.. వాటి  లార్వాలకు సైతం పోషకాలతో కూడిన పేడ చక్కటి ఆహారం. ఈ కీటకాల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. ఇవి ఎంతో బలవంతులైనప్పటికీ వీటి జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలే.[3]

ఉనికి

మార్చు

పేడ పురుగులు దక్షిణ ఐరొపా, ఉత్తరాఫ్రికా, టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఇవి అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కనిపిస్తున్నాయి. ఇవి కలయిక సమయంలో తన శక్తిని ఉపయోగించే ఇతర పేడ పురుగులతో పోరాడతాయి. ఆడ కొమ్ముల పేడ పురుగు పేడ దిబ్బల కింద సొరంగం నిర్మిస్తుంది. కొమ్ముల మగ పేడ పురుగులు వాటితో సంభోగం కోసం సొరంగంలోకి చొరబడతాయి. సొరంగాన్ని వేరు ఒక మగ పేడ పురుగు సంరక్షిస్తున్నట్లయితే అవి తమ కొమ్ములతో పోరాడుతూ సొరంగం నుంచి ఒకరినొకరు బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తుంటాయి.[1]

దంగ్ బీటిల్ దక్షిణాఫ్రికాలోని అడ్డో ఎలిఫెంట్ నేషనల్ పార్క్‌లో పేడ బంతిని రోలింగ్ చేస్తోంది.

వాటి శక్తి

మార్చు

పేడపురుగుల శక్తిని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు ఒక మెత్తని దారంతో పురుగును కట్టేస్తారు. దీని ప్రయోగశాలలో ఒక చిన్న సొరంగంలోకి వెళ్ళనిస్తారు. ఈ దారం ఒక గిన్నెతో కట్టి ఉంటుంది. పేడ పురుగు ముందుకు నడిస్తే ఈ గిన్నె కదులుతుంది. పురుగు బలం సొరంగానికి వ్యైరేకంగా ఉంటుంది. ఇది యుద్ధం చేసే పరిస్థితిలో ఉంటే తన కాళ్లలో బలం పెంచుకునేందుకు వాడుతుంది. గిన్నెలో నిదానంగా నీటిని పోసి బరుగు పెంచేలా చేస్తారు. ఇలా ఆ పేడ పురుగు గరిష్ఠ సమర్థ్యంతో బరువు లాగే వరకు చేస్తూ ఉంటారు. ఈ విధంగా పేడ పురుగుల శక్తిని నిర్ణయిస్తారు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Press, Delhi (2017-10-01). Champak Telugu: October 2017. Delhi Press.
  2. "కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు". BBC News తెలుగు. 2020-01-18. Retrieved 2020-04-27.
  3. "చకచకా.. ఎత్తేస్తాం.. ఎంతెంతో బరువులు!". m.eenadu.net. Retrieved 2020-04-27.[permanent dead link]

బాహ్య లంకెలు

మార్చు