పైథాగరస్
పైథాగరస్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు. ఈయన పేరు విననివారు ఉండరు. పైధోగొరస్ సిద్ధాంతం తెలియని వారు ఉండవు. గణిత శాస్త్రములో ముఖ్యంగా - జ్యామితి విభాగాములో ఈయన గురించి తప్పక చదవుతారు.
Pythagoras Pre-Socratic philosophy | |
---|---|
Bust of Pythagoras of Samos in the Capitoline Museums, Rome | |
పేరు: | Pythagoras (Πυθαγόρας) |
జననం: | c. 580 BC – 572 BC |
మరణం: | c. 500 BC – 490 BC |
సిద్ధాంతం / సంప్రదాయం: | Pythagoreanism |
ముఖ్య వ్యాపకాలు: | Metaphysics, Music, Mathematics, Ethics, Politics |
ప్రముఖ తత్వం: | Musica universalis, Golden ratio, Pythagorean tuning, Pythagorean theorem |
ప్రభావితం చేసినవారు: | Thales, Anaximander, Pherecydes |
ప్రభావితమైనవారు: | Philolaus, Alcmaeon, Parmenides, Plato, Euclid, Empedocles, Hippasus, Kepler |
బాల్యం-విద్యాభ్యాసంసవరించు
గణిత వేత్త, తత్వవేత్త అయిన పైథోగొరస్ క్రీస్తు పూర్వం 580-500 మధ్య కాలానికి చెందిన వాడు. గ్రీసు లోని సామౌస్ అనే చోట జన్మించాడు. ఈ సామౌస్ ద్వీపం అప్పట్లో పద్ద వర్తక కేంద్రంగా, విద్యా కేంద్రంగా ఉండేది. పైధోగరస్ ధనవంతుల బిడ్డ కాబట్టి బాగానె చదువుకున్నాడు. చిన్నప్పటినుండి ఈయన అసమాన ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించాడు. ఈయన ప్రశ్నలకు అధ్యాపకులే సమాధానాలు చెప్పలేక తలమునకలయ్యేవారు. ఈయనకు చదువు నిమిత్తం థేల్స్ ఆఫ్ మిలెటస్ సు పంపడం జరిగింది. అప్పుడే పైధోగొరస్ విశ్వవిఖ్యాతమైన తన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఒకరకంగా చెప్పాలంటె జ్యామితీయ గణితానికి బీజాలు వేసినవారిలో ఈయన కూడా ఒకరు.
సిద్ధాంతాలుసవరించు
ఒక త్రిభుజం లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు. బ్లెయిస్ పాస్కల్ కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథోగొరస్ సిద్ధాంతం. ఒక త్రిభుజంలో భుజాల కొలతలు 3,4 అయి కర్ణం 5 అయితే 32+42=52అవుతుంది.
పరిశీలనలుసవరించు
ఆ కాలంలో పుస్తకాలు లేవు చర్చల ద్వారానే విషయాల పట్ల అవగాహన యేర్పరచుకొనేవారు. ఈయన పెర్షియా, బాబిలోనియా, అరేబియా, భారతదేశంలో కొంతభాగం వరకు వెళ్లాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఈజిప్ట్లో ఎక్కువ కాలం ఉండి సంగీతం నేర్చుకున్నాడు. సంగీతానికి, అంకగణితము నకు మధ్య గల సంబంధముల గూర్చి పరిశీలనలు చేశాడు.
గురువుగాసవరించు
దక్షిణ ఇటలీ లోని క్రోటోనేలో క్రీ.పూ 529 లో ఒక పాఠశాల ప్రారంభించాడు. 300 మంది శిష్య గణం ఉన్న ఈ పాఠసాలలో అంకగణితం, జ్యామితి, సంగీతం, ఖగోళ శాస్త్రాల గూర్చి బోధించేవారు. గ్రీకు తత్వ శాస్త్రం కూడా చెప్ఫేవారు. పైధోగరస్ అతి సామాన్యంగా జీవించారు. సంఖ్యా శాస్త్రం పట్ల ఈయనకు చక్కటి అవగాహన ఉండేది. పిరమిడ్లను క్యూబ్ లను చిత్రించేవాడు.రాత్రింబవళ్ళు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణాల చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఏర్పడుతున్నాయని ఈయన ఊహించాడు. ఏ సాధనాలు లేనప్పుడు ఇన్ని విషయాలు చెప్పే పైధాగరస్ అభినందనీయుడు.
ముగింపుసవరించు
అనవసర రాజకీయాలు ముదిరి పైధాగరస్ ను ప్రక్కకు నెట్టడం జరిగింది. ఆయన అజ్ఞాత వాసంలోకి వెళ్ళక తప్పలేదు. ఆ దిగులు తోనే ఎనభై యేళ్ళ వరకు బ్రతికి ఆ తరువాత ఇటలీ లోని మెటో పోంటంలో క్రీ.పూ 500 లో కన్నుమూసాడు. ఈయన మరణించిన 200 సంవత్సరాల తర్వాత గ్రీకులు ఈయన గొప్ప తనాన్ని గ్రహించి రోంలో ఒక విగ్రహాన్ని యెర్పాటు చేశారు. "అతి తెలివైన సాహసి"గా కితాబిచ్చారు.