పొచ్చెర జలపాతం
పొచ్చెర జలపాతం, తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది.
విశేషాలు
మార్చుఇది నిర్మల్ కు 37 కి.మీ దూరంలో కలదు. ఆదిలాబాదు నుండి 47 కి.మీ దూరంలో ఉంది. ఈ జలపాతం చిన్న చిన్న కొండవాగు రాళ్ల నుంచి ఎగసిపడే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. ఈ అందమైన జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాలలో అధికంగా వస్తుంటారు. అటవీ శాఖలోని సామాజిక వన విభాగం దీనిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జలపాతం వద్ద ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు వివిధ రకాలైన మొక్కలను పెంచుతున్నారు, వనదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ జలపాతం వద్దకు రోడ్డు వేయడంతో పాటు విద్యుత్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగాయి.
ఈ జలపాతం క్రొత్తగా కనుగొనబడింది. ఇది ఇతర జలపాతాల కన్న భిన్నమైనది. ఇది దట్టమైన అరణ్యం అంతర్భాగంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. పొచ్చెర జలపాతాలకు పవిత్ర గోదావరీ నదీ ప్రవాహం వల్ల నీరు వస్తుంది. ఈ నది సహ్యాద్రి పర్యతశ్రేణి నుండి వస్తుంది. ఈ నది అనేక పాయలలో ప్రవహించి ఈ ప్రాంతంలో అన్నీ కలసి 20 మీటర్ల ఎత్తునుండి పడి పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ జల పాతాల వద్ద సినిమా షూటింగులు కూడా జరిగాయంటే వీటి అందచందాలను అర్థం చేసుకోవచ్చు.