పొదిలి బ్రహ్మయ్య శాస్త్రి

ప్రముఖ శరీరధర్మశాస్త్ర నిపుణులు

పొదిలి బ్రహ్మయ్య శాస్త్రి (Podili Brahmayya Sastry) M.B.,B.S., M.Sc., Ph.D., M.A.M.S. ప్రముఖ శరీరధర్మశాస్త్ర నిపుణులు.

వీరు ఆంధ్ర వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయునిగా 1964 - 1966 మధ్యకాలంలో తన సేవలను అందించారు.[1]

బ్రహ్మయ్య శాస్త్రి సుమారు 45 సంవత్సరాల కాలం వైద్యసేవలను చేసారు. పదవీ విరమణ అనంతరం కూడా 16 సంవత్సరాలు పనిచేశారు. ఇతని ముఖ్య పరిశోధన న్యూరోఫిజియాలజీ (Neurophysiology). వీరు 80 పైగా పరిశోధన పత్రాలను వివిధ పత్రికలలో ప్రచురించారు. ఎసిటైల్ కొలీన్ (acetylcholine) ఉత్పత్తి, సరఫరా మీద ఇతడు జరిపిన పరిశోధనకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలనుండి గుర్తింపు పొందింది. కళాశాల అభివృద్ధికి వీరు చాలా శ్రమించి నిధులను సమీకరించారు.

ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (Andhra Medical College Old Student's Association or AMCOSA) ఇతని శ్రమ ఫలితంగా ఉద్భవించింది. డా. చావలి వ్యాఘ్రేశ్వరుడు దీనిలో భాగం పంచుకున్నారు.

ఇతని జ్ఞాపకార్ధం ప్రొఫెసర్ పి. బ్రహ్మయ్య శాస్త్రి మెమోరియల్ ఆరేషన్ (Professor P. Brahmayya Sastry Memorial Oration) ఆంధ్ర వైద్యకళాశాలలో స్థాపించబడింది. చాలామంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబుల్ బహుమతి గ్రహీతలు ఈ ఆరేషన్ లో తమ పరిశోధనలను సమర్పించారు.[2]

మూలాలు

మార్చు
  1. "Images of Principals in AMC official website". Archived from the original on 2012-02-25. Retrieved 2013-05-07.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-08. Retrieved 2013-05-07.