పొవాధ్ (లేదా పోధ్ or పొవాధా) అన్నది వాయువ్య భారతదేశానికి చెందిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని ఒక ప్రాంతం. సాధారణంగా అది సట్లెజ్, ఘగ్గర్-హక్రా నదుల మధ్య, దక్షిణాన, ఆగ్నేయం, తూర్పు ప్రాంతాల్లో రూప్‌నగర్ జిల్లా ఉంది, పక్కనే హర్యానాలోని అంబాలా జిల్లా ఉంది. [1]

పంజాబ్ ప్రాంతంలో పంజాబీ మాండలీకాలు చూపే పటం

పంజాబీ మాండలీకాల్లో పొవాధీ కూడా ఒకటి. పొవాధ్ సట్లెజ్ సమీపంలోని రూప్‌నగర్ జిల్లా నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని కాలా అంబ్ దగ్గర హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను విడదీసే ఘగ్గర్ నది వరకూ విస్తరించింది. ఫతేఘర్ సాహిబ్ జిల్లా, పటియాలా జిల్లాల్లోని రాజ్ పురా వంటి భాగాలు, పంచ్ కుల, అంబాలా, యమునా నగర్ జిల్లాలు, హరిత్ ప్రదేశ్ కు చెందిన సహరణ్ పూర్, బేహాత్ జిల్లాలలు పొవాధ్ లో భాగాలు. భాషను పంజాబ్ లోనూ, హర్యానాలోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు మాట్లాడతారు.[2]

పొవాధ్ విస్తారమైన ప్రాంతం, దీనిలో హర్యానాకు చెందిన మొత్తం పంచకుల జిల్లా, చండీగఢ్, ఆగ్నేయ పంజాబ్ లో విస్తారమైన ప్రాంతం, పటియాలా, మొహాలీ రూపార్ జిల్లాలు ఇందులో చేరివున్నాయి. ఈమధ్య ప్రసారమాధ్యమాల్లో తప్పుగా ఆగ్నేయ పంజాబ్ ను మాళ్వాలో భాగమన్నట్టు పేర్కొంటున్నారు.[3] అక్బర్ దర్బారులో సైతం దీనికి ప్రత్యేకమైన కవులు ఉండేవారు. మాయి బన్నో, భగత్ ఆశా రాం బైద్వాన్ వంటి కవులతో సుసంపన్నమైంది. ధద్ సారంగీ, కావిశ్రీ మొదలైన కవులు, సాహిత్యకారులు ఉన్నారు.ధడ్ సారంగి, కావిశ్రీల వంటి సంగీత శైలులు ఇక్కడే ప్రారంభమైనట్టు చెప్తారు, అఖారాల్లో రబ్బీ భైరోన్ పురీ వంటి భేదాలు కూడా ఇక్కడే జన్మించాయని భావిస్తారు. పొవాధ్ మొత్తం పంజాబ్ ప్రాంతంలో చూస్తే ఒకానొక చిన్న భాగమనే చెప్పాలి. మాఝా, మాళ్వా, దోఅబా వంటి ప్రాంతాలు పంజాబ్ లోని ప్రధానభాగాన్ని ఏర్పరుస్తాయి.[4]

పొవాధ్ ప్రాంతంలోని ప్రజలను పొవాధీలని పేర్కొంటారు.

మూలాలు మార్చు

  1. "Powadh or Puadh or Powadha is a region of Punjab and parts of Haryana between the Satluj and Ghaggar rivers. The part lying south, south-east and east of Rupnagar adjacent to Ambala District (Haryana) is Powadhi". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-20.
  2. "10. Pwadhi Punjabi". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-20.
  3. "Major Punjabi Dialects". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-20.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Punjab region dilects. Archived from the original (PDF) on 2017-03-28. Retrieved 2016-07-21.
"https://te.wikipedia.org/w/index.php?title=పోధ్&oldid=3485617" నుండి వెలికితీశారు