రూప్‌నగర్

పంజాబ్ రాష్ట్రం లోని పట్టణం

రూప్‌నగర్ పంజాబ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది రూప్‌నగర్ జిల్లాకు ముఖ్య పట్టణం. గతంలో దీన్ని రోపార్ అని పిలిచేవారు. రూప్‌నగర్ పంజాబ్లో కొత్తగా సృష్టించిన ఐదవ డివిజనుకు ప్రధాన కార్యాలయం. ఈ డివిజన్లో రూప్‌నగర్, మొహాలి దాని పరిసర జిల్లాలు భాగంగా ఉన్నాయి. సింధు లోయ నాగరికతకు చెందిన పెద్ద స్థలాల్లో ఇది కూడా ఒకటి. రూప్‌నగర్ చండీగఢ్ నుండి వాయవ్య దిశలో 43 కి.మీ దూరంలో ఉంది. పట్టణం పురపాలక మండలి పాలనలో ఉంది.రూప్‌నగర్‌లో గురుద్వారా భత్తా సాహిబ్, గురుద్వారా టిబ్బి సాహిబ్ వంటి అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి.

రూప్‌నగర్
రోపార్
పట్టణం
సట్లెజ్ నది ఒడ్డున ఉన్న గురుద్వారా టిబ్బీ సాహిబ్
సట్లెజ్ నది ఒడ్డున ఉన్న గురుద్వారా టిబ్బీ సాహిబ్
Nickname: 
రోపార్
రూప్‌నగర్ is located in Punjab
రూప్‌నగర్
రూప్‌నగర్
Coordinates: 30°57′59″N 76°31′59″E / 30.9664°N 76.5331°E / 30.9664; 76.5331
దేశం భారతదేశం
రాష్ట్రంపంజాబ్
జిల్లారూప్‌నగర్
స్థాపనసా.శ.పూ 19వ శతాబ్ది
Elevation
262 మీ (860 అ.)
Population
 (2011)
 • Total56,000
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
PIN
140 001
టెలిఫోన్ కోడ్91-1881
Vehicle registrationPB-12

చరిత్ర సవరించు

సింధు లోయ నాగరికత సవరించు

 
సింధు నాగరికత స్థలం రూప్‌నగర్ (రోపర్), పంజాబ్, ఇండియా

11 వ శతాబ్దంలో రూప్‌నగర్‌ను పాలించిన రోకేషర్ అనే గుజ్జర్ రాజా తన కుమారుడు రూప్ సేన్ పేరిట ఈ పట్టానికి పేరు పెట్టాడు.

ఘగ్గర్-హక్రా నది ఉన్న సింధు లోయ ప్రదేశాలలో రూప్‌నగర్ ఒకటి. స్వతంత్ర భారతంలోని మొట్టమొదటి హరప్పన్ ప్రదేశం ఈ పట్టణంలో ఉంది. నగరంలో ఒక పురావస్తు మ్యూజియం ఉంది, ఇది 1998 లో ప్రజల కోసం తెరచారు. పట్టణం లోని పురావస్తు ప్రదేశంలో సేకరించిన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

ఈ త్రవ్వకాల్లో హరప్పన్ నుండి మధ్యయుగ కాలం వరకు సాంస్కృతిక క్రమం తెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన వస్తువులలో హరప్పా కాలపు పురాతన వస్తువులు, చంద్రగుప్తుని బంగారు నాణేలు, రాగి, కాంస్య వస్తువులూ ఉన్నాయి.[1] సియాల్బాకు చెందిన ఎస్.హరి సింగ్ రయిస్ సా.శ. 1763 లో రోపార్‌ను జయించి, తన రాజ్యాన్ని స్థాపించాడు. ఎస్.హరి సింగ్ కుమారుడు చరత్ సింగ్ రోపార్ ను రాజ్య రాజధానిగా చేసుకున్నాడు.

 
పురావస్తు మ్యూజియం, రూప్‌నగర్, పంజాబ్, ఇండియా

షేఖియన్ మొహల్లా సవరించు

చౌక్ అబ్బాసియా అనే షేకియాన్ మొహల్లా రోపార్ నగరంలోని కేంద్ర భాగం. దేశ విభజనకు ముందు, ముస్లిం కక్కే షేక్‌లు (కక్కే అబ్బాసి అని పిలుస్తారు) రోపర్‌లో నివసించేవారు. ఇప్పుడు, ఇది రోపర్ నగరం లోని వాణిజ్య కేంద్రం. షేక్ అబ్బాసియా మసీదు షేకియన్ మొహల్లాలో ఉంది. ఇప్పుడు దీనిని వక్ఫ్ బోర్డు కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు.

భౌగోళికం సవరించు

రూప్నగర్ 30°58′N 76°32′E / 30.97°N 76.53°E / 30.97; 76.53 నిర్దేశాంకాలవద్ద [2] సముద్ర మట్టం నుండి 260 మీటర్ల ఎత్తున ఉంది. ఈ పట్టణం సత్లజ్ నది ఒడ్డున ఉంది. నదికి ఆవలి ఒడ్డున శివాలిక్ పర్వత శ్రేణి విస్తరించి ఉంది.

రవాణా సవరించు

రైలు సవరించు

రూప్‌నగర్ రైల్వే స్టేషన్ భారత రైల్వేఉత్తర రైల్వే జోన్ లో వస్తుంది. ఇక్కడి నుండి చండీగఢ్‌కు సింగిల్ లైన్ రైలుమార్గం ఉంది. ఇది జలంధర్, లూధియానా, మొరిండా, నంగల్ ఆనకట్ట ద్వారా అమృత్‌సర్‌కు వెళ్తుంది.

రోడ్డు సవరించు

రూప్‌నగర్ నగరం నుండి జిల్లాలోని పట్ట్టణాలు గ్రామాలకు రోడ్లున్నాయి. అలాగే బద్దీ, లుధియానా, జలంధర్, చండీగఢ్, ఢిల్లీ వఖ్టి నగరాలకు కూడా రోడ్డు మార్గాలున్నాయి. జాతీయ రహదారి వ్యవస్థ లోని క్రింది రహదారులు రూప్‌నగర్ గుండా వెళ్తాయి.జాతీయరహదారి 205 చండీగఢ్, కురాలీ నుండి రూప్‌నగర్ గుండా హిమాచల్ ప్రదేశ్ లోని కిరాత్‌పూర్ సాహిబ్^కు

జనాభా సవరించు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] రూప్‌నగర్ జనాభా 48,165. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. రూప్‌నగర్ అక్షరాస్యత 75%, జాతీయ సగటు 59.5% కంటే ఇది ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 82%. రూప్‌నగర్ జనాభాలో 11% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు

మూలాలు సవరించు

  1. "ASI Museum - Rupnagar". rupnagar.nic.in. Retrieved 2017-07-12.
  2. Falling Rain Genomics, Inc - Rupnagar
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు సవరించు