పోప్ బెనడిక్ట్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
16వ పోప్ బెనడిక్ట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించారు. క్రైస్తవ మతంలో అతిపెద్ద విభాగమైన క్యాథలిక్కులకు సారథ్యం వహిస్తోన్న పోప్ 2013 ఫిబ్రవరి 11న తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2005లో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్ అనారోగ్య కారణాలతో తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దైవ నిర్ణయం మేరకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని, తన వారసుడ్ని భగవంతుడే ఎంపిక చేస్తారని ప్రకటించారు. 16వ పోప్ బెనడిక్ట్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 600 సంవత్సరాల వాటికన్ చరిత్రలో రాజీనామా చేస్తున్న పోప్‌గా బెనడిక్ట్ రికార్డు సృష్టించారు. 2005లో పోప్ జాన్‌పాల్ - 2 మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్ సాంప్రదాయక క్యాథలిక్ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు శరీరం సహకరించనందున రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు వాటికల్ కార్డినల్స్‌కు వివరించారు. ఈ నెలాఖరున పోప్ రాజీనామా అమల్లోకి స్తుంది. మార్చి నెలాఖర్లోపు కార్డినల్స్ కొత్త పోప్ ఎంపికను పూర్తి చేస్తారు. వాటికన్ దేశాధ్యక్షుడిగా, క్యాథలిక్ ప్రపంచ సారథిగా ఉండే పోప్‌కు చర్చిలో విశేషాధికారాలు సంక్రమిస్తాయి. క్రీస్తు మరణం తర్వాత క్రైస్తవ సాంప్రదాయాల కొనసాగింపు బాధ్యతల్ని పోప్‌లు నడిపించడం అనవాయితీగా వస్తోంది. క్రీస్తు అనుచరుల్లో కీలకమైన సెయింట్ పీటర్ నుంచి పోప్‌ల పరంపర మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన క్యాథలిక్ చర్చి గురువులు, ఆర్చిబిషప్‌లు , కార్డినళ్లు వాటికన్ వ్యవస్థలో భాగంగా ఉంటారు. జర్మనీలో జన్మించిన బెనడిక్ట్ 2005 ఏప్రిల్ 19న పోప్‌గా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఏప్రిల్ 24న పట్టాభిషిక్తులయ్యారు. 1951లో క్యాథలిక్ మత గురువుగా జీవితాన్ని ప్రారంభించిన బెనడిక్ట్ తత్వశాస్త్రంలో అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలో సుదీర్ఘ కాలం మత గురువుగా పనిచేసిన బెనడిక్ట్ మునిచ్ ఆర్చ్ బిషప్‌గా కూడా పనిచేశారు. 1977లో పోప్ జాన్ పాల్-6 ద్వారా కార్డినల్‌గా ఎంపికయ్యారు. క్యాథలిక్ సాంప్రదాయాలపై తిరుగులేని పట్టున్న బెనడిక్ట్ సాంప్రదాయక విధానాల్లో లోపాలను చాలాసందర్భాల్లో తప్పు పట్టారు. అరబ్బు ప్రపంచాన్ని విముక్తి ఉద్యమాలు కుదిపేస్తున్న సమయంలో లెబనాన్‌లో పర్యటించి సంచలనం సృష్టించారు. మతానికి-యుద్ధానికి సంబంధం లేదంటూ శాంతి స్థాపన కోసం కృషి చేశారు. వాటికన్ సిటీ నుంచి పోప్ బెనడిక్ట్ విడుదల చేసిన అధికారిక పత్రంలో భగవంతుడి ఆదేశాల ప్రకారమే తన నిర్ణయం తీసుకున్నానని ప్రకటిం్చారు. ప్రపంచం అధ్మాత్మికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోందని దైవంపై విశ్వాసం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తన వారసుడ్ని భగవంతుడే ఎంపిక చేస్తారని, తన పదవి కాలంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరారు. ఫిబ్రవరి 28 రాత్రి 8 గంటల తర్వాత వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్‌కు వారసుడిగా కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పోప్ నేతృత్వంలోని క్యాథలిక్ చర్చికు 150కోట్ల మంది మద్దతుదారులున్నారు. 1415లో 13వ పోప్ గ్రెగరీ తర్వాత పోప్ బెనడిక్ట్ తన పదవికి రాజీనామా చేసి రికార్డు సృష్టించారు.
పోప్.....
120కోట్లకు పైగా ఉన్న క్యాథలిక్ క్రైస్తవులకు అధిపతి....ప్రపంచంలోనే అతిపెద్ద మతసంస్థకు మార్గనిర్దేశం చేసే శక్తి. రోమన్ క్యాథలిక్ పరంపరలో రెండువేల సంవత్సరాలుగా చర్చిని నడిపిస్తోన్న ఆ శక్తి సాంప్రదాయానికి భిన్నంగా స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. వాటికన్ దేశాధ్యక్షుడి కంటే క్యాథలిక్ మతాధిపతిగా సులువుగా గుర్తించే పేరు. గత నెలలో పోప్ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్లు ప్రకటించి పోప్ బెనడిక్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న ప్రత్యేక ప్రార్థన, భక్తులనుద్దేశించి ప్రసంగంతో పోప్ బెనడిక్ట్ పదవీ కాలాన్ని ముగించారు. సహజంగా పోప్ పదవిని చేపట్టిన వ్యక్తి చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగుతుంటారు. రెండువేల సంవత్సరాలకు పైగా సాగుతున్న పోప్‌ల పరంపరలో 600సంవత్సరాల క్రితం మాత్రమే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. క్యాథలిక్ సాంప్రదాయక ఆచారాలను కొనసాగించడానికి ఆరోగ్యం సహకరించనందున దైవ నిర్ణయం మేరకు పదవి నుంచి వైదొలగుతున్నట్లు పోప్ ప్రకటించడంతో కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. క్యాథలిక్ సాంప్రదాయాల ప్రకారం ఆ మతానికి చెందినవారేవరైనా పోప్ పదవికి పోటీ చేసే అవకాశమున్నా., వాటికన్ చర్చిలో అత్యున్నత వర్గాలుగా భావించే కార్డినల్స్ మాత్రమే పోప్ పదవి ఎంపికవుతున్నారు. పదవిలో ఉన్న పోప్ మరణిస్తే 20రోజుల తర్వాతే కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ మొదలుపెడతారు. ప్రస్తుతం పోప్ పదవికి రాజీనామా చేయడంతో కొత్త పోప్ ఎంపిక ప్రారంభమైంది. మార్చి 15లోగా కొత్త పోప్ ఎంపిక పూర్తి చేయాలని చర్చి భావిస్తోంది. మార్చి 24న క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్‌కు ముందే కొత్త పోప్ ఎంపిక పూర్తయ్యే అవకాశాలున్నాయి. వారసుడ్ని ఎన్నుకునే ప్రక్రియలో పోప్ బెనడిక్ట్ పాల్గొనట్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాటికన్ చర్చిలో ఉన్న 115మంది కార్డినల్స్‌లో 65మందిని పోప్ బెనడిక్ట్ నియమించడంతో విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పోప్ ఎంపిక ఎలా.....?
పోప్ ఎంపిక ఆద్యంతం రహస్యంగా సాగుతుంది. వాటికన్ చర్చి సాంప్రదాయాల ప్రకారం మూడు పద్ధతుల్లో పోప్‌ను ఎన్నుకునే అవకశమున్నా గత కొన్నేళ్లుగా బ్యాలట్ పద్ధతిపైనే ఆధారపడుతున్నారు. వాటికన్ చర్చిలో భాగమైన కార్డినల్స్ పోప్‌ను ఎన్నుకుంటారు. పోప్ మరణించిన సందర్భాల్లో ఓటింగ్‌కు అర్హత ఉన్న 80ఏళ్లలోపు కార్డినల్స్ కాలేజీ డీన్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చి పాలకమండళ్ల నుంచి కార్డినల్స్ వాటికన్ చేరుకుంటారు. వాటికన్ చేరాక పోప్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటి ప్రపంచంతో వారికి సంబంధాలుండవు. పోప్ ఎంపిక విధానాల్లో బెనడిక్ట్ ఎలాంటి మార్పులు చేయలేదు. పోప్ ఎన్నికకు ముందు సెయింట్ పీటర్ బసలికాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యహ్నం కార్డినల్స్ అంతా ఊరేగింపుగా ప్రఖ్యాత చిత్రకారుడు మైఖెల్ ఏంజిలో రూపుదిద్దిన సిస్టైన్ ఛాపెల్‌కు చేరుకుంటారు. అక్కడ పోప్‌గా ఎన్నికయ్యే వ్యక్తి పేరును కార్డినల్స్ కాగితంపై రాసి మడతపెడతారు. అక్కడ్నుంచి సీనియారిటీ ప్రకారం వరుస క్రమంలో వెళ్లి పీఠంపై ఉంచిన ప్రత్యేక పాత్రలో ఓట్లను వేస్తారు. ఓటింగ్ రహస్యంగా జరిగినా ఆ తర్వాత కౌంటింగ్ మాత్రం బహిరంగంగానే జరుగుతుంది. పోప్‌గా ఎంపికవడానికి పోటీపడే కార్డినల్‌కు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఒకవేళ పోప్ ఎంపికవపోతే అదే రోజు మరోమారు ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పటికి ఎంపిక పూర్తి కాకపోతే ఓట్లన్నింటిని ప్రత్యేక రసాయనం సాయంతో మండిస్తారు. ఫలితంగా సిస్టైన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగవెలువడుతుంది. పోప్ ఎంపిక పూర్తైతే ఓట్లకు రసాయనం పూయకుండానే మండిస్తారు. ఫలితంగా వెలువడే తెల్లటి పొగతో వాటికన్ సిటీ వెలుపల ఉత్కంఠతో ఎదురుచూసే క్రైస్తవులకు పోప్ ఎంపిక పూర్తైందని తెలుస్తుంది. మొదటి రోజు ఎంపిక పూర్తికాకపోతే రెండు మూడు రోజుల్లో రోజుకు నాలుగు సార్లు ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పటికి ఎంపిక పూర్తి కాకపోతే సంప్రదింపులు, చర్చల కోసం ఓ రోజు విరామాన్నిస్తారు. ఆ తర్వాత మరో ఏడుసార్లు ఓటింగ్ జరుగుతుంది.
అప్పటికి ఎంపిక పూర్తి కాకపోతే.....?
పోప్ ఎన్నికకు అవసరమైన మెజార్టీ తగ్గుతుంది. కనీసం 50శాతం ఓట్లు సాధిస్తే పోప్‌గా ఎన్నికవుతారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల ఆధారంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఇద్దరి మధ్యే పోటీ నెలకొంటుంది. ఇలా పోప్ ఎంపిక పూర్తయ్యాక అప్పటిదాకా కార్డినల్‌కు ఉన్న పేరు స్థానంలో అధికారిక పేరును స్వీకరించాలని సీనియర్ కార్డినల్ సూచిస్తారు. ఎన్నికైన వ్యక్తి పూర్వీకుల గౌరవార్దం కొత్త పేరును స్వీకరిస్తారు. సాధారణంగా కొత్తగా ఎన్నికైన వారు అంతకుమందు పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన వారి పేర్లను వారసత్వంగా స్వీకరిస్తుంటారు. ఎంపిక పూర్తయ్యాక కార్డినల్స్‌తో కలిసి చాపెల్ నుంచి ప్రజలకు దర్శనమిస్తారు. ఆ తర్వాత సెయింట్ పీటర్ బసలికాలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పోప్ పదవిని చేపడతారు.