పోరెడ్డి రంగయ్య

పోరెడ్డి రంగయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు.[1] ఆలేరులో తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ అనే సాహిత్య సంస్థను నెలకొల్పి, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.[2] ప్రస్తుతం యాదాద్రి - భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు.[3]

పోరెడ్డి రంగయ్య
జననం
పోరెడ్డి రంగయ్య

మార్చి 10, 1966
జాతీయతభారతీయుడు
వృత్తికవి, రచయిత, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు
తల్లిదండ్రులుచంద్రయ్య, రాజమ్మ
బంధువులురాజేశ్వరి (భార్య)

జననం - విద్యాభ్యాసం మార్చు

రంగయ్య 1966, మార్చి 10న చంద్రయ్య, రాజమ్మ దంపతులకు ఆలేరు మండలం గుండ్లగూడెంలో జన్మించాడు. స్వగ్రామంలో పాఠశాల విద్యను, ఆలేరు లో ఇంటర్మీడియట్ విద్యను, హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో డిగ్రీని చదివాడు. తెలుగు సాహిత్యంపై ఆసక్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేశాడు. అనంతరం ‘సీమకథలు – సామాజికాంశాలు’ అనే అంశంపై ఎం.ఫిల్, ‘ఆచార్య తిరుమల కావ్యాలు – పరిశీలన’ అంశంపై పిహెచ్.డి పూర్తిచేశాడు. అంతేకాకుండా తెలుగు పండిత్ శిక్షణ, బీఈడి డిగ్రీలు అందుకున్నాడు.

ఉద్యోగం మార్చు

కొంతకాలం ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసిన రంగయ్యకు 1996లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. కొలనుకొండ, షారాజీపేటలలోని పాఠశాలలో విద్యను బోధించి ప్రస్తుతం రాయగిరి ఉన్నత పాఠశాలో ఉద్యోగం చేస్తున్నాడు.

రచనా ప్రస్థానం మార్చు

ఎటువంటి సాహిత్య నేపథ్యం లేకపోయినా పల్లె వాతావరణంలో పుట్టడంవల్ల పాఠశాల స్థాయినుండే రంగయ్యకు సాహిత్యంపై ఆసక్తి ఉండేది. దానికితోడు తనకు తెలుగు బోధించిన డాక్టర్ లింగంపల్లి రామచంద్ర ప్రభావం రంగయ్యపై పడింది.

వెలువరించిన పుస్తకాలు మార్చు

  • శబ్ద చిత్రాలు (మిని కవితలు, 2003)
  • బడి నానీలు
  • మా అమ్మ (కవిత్వ సంకలనం)
  • నిత్యచైతన్యశీలి సినారె (సంపాదకీయం)
  • అగ్ని పుష్పాలు (సంపాదకీయం)
  • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాల వీరులు (స్కృతి కవితా సంకలనం)
  • అక్షర (సహ సంపాదకులు, ఎన్. గోపి షష్ట్యబ్ది సంచిక)
  • సాహితీ వసునందనం (సంపాదకవర్గ సభ్యులు, రావికంటి వసునందన్ షష్టిపూర్తి అభినందన సంచిక)
  • యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర (యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాహిత్య చరిత్రపై వచ్చిన పుస్తకం)
  • భువన కవనం (యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పరిచయ పుస్తకం)

తేజా ఆర్ట్స్ సంస్థ మార్చు

సాహిత్యరంగానికి ప్రోత్సాహం అందించాలనే ఉద్ధేశ్యంతో రంగయ్య తేజా ఆర్ట్స్ సంస్థను ప్రారంభించాడు. 2006, ఆగస్టు 14న హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో డా. సి. నారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో తేజా ఆర్ట్స్ సంస్థ ప్రారంభించబడింది. ఈ సంస్థ గ్రంథావిష్కరణలతోపాటూ తేజ పురస్కారాల ప్రదానం కూడా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా జీవన సాఫల్య పురస్కారం, డా. సి. నారాయణరెడ్డి సాహితీ పురస్కారం, తేజ విశిష్ట సాహితీ పురస్కారం, ఆచార్య తిరుమల సాహితీ పురస్కారం, పోరెడ్డి రాజమ్మ స్మారక సాహితీ పురస్కారం అందజేస్తుంది.

వ్యాఖ్యాతగా మార్చు

రంగయ్య మంచి వక్త అవడంతో అనేక సాహిత్య, సామాజిక కళా రంగాలకు సంబంధించిన వక్తగా పాల్గొంటూ వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు కూడా చేస్తున్నాడు.

అవార్డులు – పురస్కారాలు మార్చు

  • రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (ఎన్.టి.ఆర్. ట్రస్ట్)
  • రాష్ట్రస్థాయి సేవా పురస్కారం (మున్నరు కాపు)
  • రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం (హృదయ భారతి)
  • రాష్ట్రస్థాయి సాహిత్య సేవా పురస్కారం (సూర్యచంద్ర)
  • రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (సి.వి.ఎస్.చారిటీస్, తిరుపతి)
  • ఉగాది పురస్కారం (అక్షర కళాభారతి, చౌటుప్పల్)
  • ఉగాది పురస్కారం (సాహితి మిత్ర మండలి, రామన్నపేట)
  • జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
  • పాల్కురికి పురస్కారం (హృదయ భారతి)

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ (10 December 2017). "సాహితీ సేవలో రంగన్న". Archived from the original on 2 ఫిబ్రవరి 2018. Retrieved 2 February 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. ఆంధ్రభూమి, హైదరాబాద్ (2 May 2016). "'ముసుగు తొలగిన తర్వాత' కవితాసంపుటి ఆవిష్కరణ". Archived from the original on 3 మే 2016. Retrieved 2 February 2018.
  3. నమస్తే తెలంగాణ, యాదాద్రి న్యూస్ (9 December 2016). "రచయితల సంఘం అధ్యక్షుడిగా రంగయ్య". Retrieved 2 February 2018.