నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయము. నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రాంతములో ఉంది.

నిజాం కళాశాల
రకంసార్వత్రిక
స్థాపితం1887
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారత్
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుఉస్మానియా విశ్వవిద్యాలయం
జాలగూడుఅధికారిక జాలగూడు

నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. సంవత్సరం పొడుగునా జరిగే ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

చరిత్రసవరించు

ప్రస్తుతమున్న ప్రధాన కళాశాల భవనము హైదరాబాదు నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II యొక్క మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల), మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించారు. కళాశాల స్థాపకుడు, విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, సరోజినీ నాయుడు తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.

ప్రముఖ పూర్వవిద్యార్ధులుసవరించు

బయటి లింకులుసవరించు