పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం
పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం, విశాఖపట్నంలో ఉన్న స్టేడియం. సుందరమైన కొండల మధ్య ఉన్న ఈ స్టేడియంలో, 18 అండర్ -19 మ్యాచ్‌లు జరిగాయి. స్టేడియంలో రెండు అంచెల నిర్మాణంలో కూర్చునే ప్రదేశంతో సంబంధం లేకుండా మ్యాచ్ చూసేవిధంగా రూపొందించబడింది.[1][2] ప్రస్తుతం దీనిని ప్రధానంగా క్రికెట్ మ్యాచ్‌లకు ఉపయోగిస్తున్నారు.
Full name | పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం |
---|---|
Location | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Owner | విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ |
Operator | విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ |
Capacity | 5,000 |
Construction | |
Broke ground | 1993 |
Opened | 1993 |
Website | |
Cricinfo |
చరిత్ర
మార్చు1993లో నిర్మించబడిన ఈ స్టేడియంలో 5,000 సీట్ల సామర్థ్యం ఉంది.[3][4]
మ్యాచ్‌ల వివరాలు
మార్చుఈ స్టేడియంలో ఫుట్‌బాల్, క్రికెట్, ఇతర క్రీడల మ్యాచ్‌లను జరుగుతాయి. 1993లో ఆంధ్రా-గోవా క్రికెట్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్[5]కు ఆతిథ్యం ఇచ్చింది.[6] ఇండియా ఎ -న్యూజిలాండ్ ఎ క్రికెట్ జట్ల మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఇక్కడ జరిగింది.[7] 1993లో ఆంధ్రా- గోవా క్రికెట్ జట్ల మధ్య 12 లిస్ట్ ఎ మ్యాచ్‌లు జరిగాయి.[8][9]
2005లో ఆఫ్రో-ఆసియా అండర్ -19 కప్ కు సంబంధించిన అండర్ -19 క్రికెట్ మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరిగాయి. భారత జాతీయ అండర్ -19 క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ జాతీయ అండర్ -19 క్రికెట్ జట్టుతో ఇక్కడ మ్యాచ్ జరిగింది.[10]
సభ్యత్వం
మార్చుఇందులోని స్టేడియంల వాడకానికి సభ్యత్వం (గేట్ పాస్ కార్డు) అవసరం ఉంటుంది. సభ్యత్వ రుసుము సంవత్సరానికి 300 రూపాయలు. సభ్యత్వం కోసం ప్రతినెల రెండవ శనివారం రోజున నేరుగా స్టేడియంలో ఉదయం 8:00 - 10:00 ల మధ్య నమోదు చేసుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ "Visakhapatnam Port Trust lift Major Ports Hockey Championship". Archived from the original on 2016-03-04. Retrieved 2021-07-18.
- ↑ "Indian Express". Archived from the original on 2016-03-04. Retrieved 2021-07-18.
- ↑ Taking first steps towards stardom in Chiranjeevi
- ↑ Colts make short work of Aus
- ↑ First-class matches
- ↑ Scorecard for Andhra v Goa
- ↑ Scorecard for India A v New Zealand A
- ↑ List A matches
- ↑ Scorecard for Andhra v Goa
- ↑ Youth One-Day International Matches