పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది[3]. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.[4]

పోలవరం ఆనకట్ట
ఏలూరు దగ్గర పోలవరం కుడికాలవ
పోలవరం ప్రాజెక్టు is located in Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పథకం స్థానం
అధికార నామంఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు
ప్రదేశంపోలవరం, ఏలూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు17°17′31″N 81°38′38″E / 17.2919°N 81.6440°E / 17.2919; 81.6440
నిర్మాణం ప్రారంభం2004
ప్రారంభ తేదీ2021 (అంచనా) [1]
నిర్మాణ వ్యయం55,548.87 Cr [2]
యజమానిపోలవరం ప్రాజెక్టు అధారిటీ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంకాంక్రీటు నీటి ప్రవాహపు దారి (754 m), నీటి ప్రవాహంలేని రాతి నిర్మాణపు అడ్డుకట్ట (560 m) & మట్టి అడ్డుకట్ట (1600 m)
నిర్మించిన జలవనరుగోదావరి నది
Height39.28 m (129 ft)
పొడవు2,914 m (9,560 ft)
Spillway typeOgee section
Spillway capacity3,600,000 cusecs at 140 ft msl
జలాశయం
సృష్టించేదిపోలవరం జలాశయం
మొత్తం సామర్థ్యం194 tmcft at FRL 150 ft msl
పరీవాహక ప్రాంతం307,800 km2 (118,800 sq mi)
ఉపరితల వైశాల్యం600 km2 (230 sq mi)
గరిష్ఠ నీటి లోతు32.08 m at FRL 150 ft msl
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుఏపీజెన్‌కో
టర్బైన్లు12 × 80 మెగావాట్లు Francis-type (left bank side)
Installed capacity960 మెగావాట్లు (నిర్మాణంలో ఉంది)
Website
http://polavaram.cgg.gov.in/ispp/home

జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు మార్చు

 
పోలవరం స్పిల్‌వే ఆనకట్ట - నిర్మాణ దశలో. బొమ్మలో పైభాగాన అనకట్టకు ఎగువన గోదావరి నది కనబడుతోంది.

పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది[3]. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ తో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.[4]

ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుందని అంచనా. అంతేగాకుండా, విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఉపయోగపడుతుంది.

ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్ళించే బృహత్ పథకం "గంగా - కావేరి నదుల అనుసంధానం" లో పోలవరం పథకం ఒక భాగం. ఇక్కడ గోదావరి మిగులు జలాలు ఉన్న నది. కృష్ణానది నీటి కొరత ఉన్న నది. పశ్చిమగోదావరి జిల్లాలోని రామాలపేట గ్రామం వద్ద, (రాజమండ్రి - కొవ్వూరు రోడ్డు నుండి 34 కి.మీ ల దూరం, ధవళేశ్వరం లోని కాటన్ ఆనకట్టకి 42 కి.మీ ఎగువన) నిర్మిస్తున్న ఈ పథకం అంచనా విలువ రూ. 16716 కోట్లు.

నేపథ్యం మార్చు

 
Map

ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితమైంది.భారతదేశంలోని సగటు సాగుభూమి శాతం (22.2%), ఉత్తరప్రదేశ్ సాగుభూమి శాతం (22%), పంజాబ్ సాగుభూమి శాతం (35%) తో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ సాగుభూమి శాతం (14%) చాలా తక్కువ. కాలువలద్వారా నీటిలభ్యత ఉన్న కృష్ణా-గోదావరి డెల్టాలలో 22 లక్షల ఎకరాలలోనూ, నాగార్జునసాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని 20 లక్షలలో మాత్రమే సాగు జరుగుతుంది. గోదావరికి ఎడమవైపునున్న తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని మెట్టప్రాంతాలు, కుడివైపునున్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటివనరు లేదు. వర్షాలు సరిగా కురవని సమయాలలో కరువుకి గురవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలు అయినందున ఆధారపడదగినవి కావు. అందువలన ఈ ప్రాంతాలలో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది. పోలవరం పథకం వలన మాత్రమే ఈ అనిశ్చిత పరిస్థితులు, ఈ ప్రాంతాల వెనుకబాటుతనం పోగలవు.

పోలవరం అంధ్రప్రదేశ్ జీవనాధారంగా పిలువ బడ్తుంది. సర్ ఆర్థర్ కాటన్ భారతదేశపు నదుల అనుసంధానం గురించి ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ, 1930-40 ల వరకూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941 లో, మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, దివాన్ బహుద్దూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, గోదావరి నది పైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ . రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున “రామపాద సాగరం”గా పిలిచిన ప్రాజెక్టు వివరాలు ఇవి,

  • 130.0 మీ ల గరిష్ఠ ఎత్తు ఉన్న ఆనకట్ట
  • ఎడమ వైపు, విశాఖపట్నం ఓడరేవు వఱకూ, 209 కి.మీల పొడవైన కాలువ.
  • కుడి వైపు, కృష్ణా నది వఱకూ 200 కి.మీ ల పొడవైన కాలువ.[5] అటుపైన, గుండ్లకమ్మ నది వఱకూ మరో 143 కి.మీ పొడవైన కాలువ,,
  • 150 మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుతుత్పత్తి కేంద్రం

ప్రాజెక్టు పురోగతి మార్చు

2004 లో ప్రారంభించబడి, 2015లో జాతీయ ప్రాజెక్టుగా చేయబడింది. 2017 జూన్ నాటికి పురోగతి క్రింది విధంగా ఉంది. రిజర్వాయర్ లో మట్టిపని 68%, కరకట్ట 9%, కుడికాలవ పనిలో మట్టిపని 100%, లైనింగ్ 81%, ఎడమకాలవ పనిలో మట్టిపని 87%, లైనింగ్ 62% పూర్తయ్యాయి.[6] 2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు, స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా నిధుల్లో గతంలో కోత పెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది.[7]

ఎత్తిపోతల పథకాలు మార్చు

పోలవరం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది, కావున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాలు చేపట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడికాలవకు నీరు తరలించడానికి నిర్మించారు. 2015లో దీని నిర్మాణం రూ. 1299 కోట్లు ఖర్చుతో పూర్తయింది. రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. దీని ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.[6]

మూలాలు మార్చు

  1. "2021కి పోల‌వ‌రం పూర్తి: ప‌నుల పైన నిపుణుల ఆడిటింగ్‌..సీఎం జ‌గ‌న్‌..!". OneIndia. 2019-06-20. Archived from the original on 2019-07-17. Retrieved 2019-07-17.
  2. "పోలవరం నిధులకు ఆమోదం". 2019-06-24. Archived from the original on 2019-07-17.
  3. 3.0 3.1 "Indirasagar (Polavaram) Project, Ministry of water resources, GoI". Archived from the original on 2013-12-24. Retrieved 23 May 2014.
  4. 4.0 4.1 "Polavaram Reservoir Project". irrigationap.cgg.gov.in. Retrieved 2022-10-01.
  5. "పోలవరం కుడి కాలవ". OSM. Retrieved 2019-07-17.
  6. 6.0 6.1 "పోలవరం ప్రాజెక్టు: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?". BBC. 2017-12-26. Archived from the original on 2019-07-06.
  7. "జగన్ సర్కార్‌కు కేంద్రం తీపి కబురు.. లైన్ క్లియర్!". Samayam Telugu. Retrieved 2021-08-24.

వెలుపలి లంకెలు మార్చు