పోలవరపు కోటేశ్వరరావు

తెలుగు రచయిత

పోలవరపు కోటేశ్వరరావు తెలుగు రచయిత. నాటికలు, నాటకాలు, నవలలు, కథలు, నృత్యరూపకాలు, యక్షగానాలు, బుర్రకథలు మొదలైన ప్రక్రియలలో 100కు పైగా గ్రంథాలను రచించాడు. ఇతడు కృష్ణా జిల్లా, దివిసీమ సమీపంలోని శ్రీకాకుళం శివారు వీరమాచినేనివారిపాలెంలో 1929, జూలై 26న జన్మించాడు.

పోలవరపు కోటేశ్వరరావు
జననం(1929-07-26)1929 జూలై 26
వీరమాచినేని వారి పాలెం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా
మరణం2008 మార్చి 2(2008-03-02) (వయసు 78)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు రచయిత
గుర్తించదగిన సేవలు
కృష్ణాతరంగాలు,
రాజముద్రిక
పిల్లలు3 కుమారులు, 1 కుమారుడు
విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం ప్రాంగణంలో పోలవరపు కోటేశ్వరరావు కాంస్య విగ్రహం

రచనలు

మార్చు
  • అక్షరాన్వేషణ (జీవితచరిత్ర)
  • కొండవీటి ప్రాభవం - శ్రీనాథుని వైభవం
  • కాకుళయ్య కథలు
  • కృష్ణాతరంగాలు
  • మావూరి మనుషులు
  • లచ్చుమయ్య కథలు
  • రాజముద్రిక
  • నాటి గాధలు - నేటి కథలు
  • మనము - మన నృత్యాలు
  • చినబాబు
  • మహాత్మా జిందాబాద్ (నాటిక)
  • నృత్యారాధన - హిందూ దేవతలు
  • కృష్ణవేణి
  • చాటుకవిసార్వభౌమ శ్రీనాథుని చాటువులు
  • శ్రీనాథులవారొచ్చారు (నాటిక)
  • ఆముక్తమాల్యద - ఆంధ్రమహావిష్ణువు అను రాయలు-రంగన్న(నాటిక)
  • సోమూరి జీవితం
  • కృష్ణా గోదావరి బేసిన్ - నూనె, సహజవాయు సంపద

పురస్కారాలు

మార్చు
  • 1998లో ఆంధ్రపదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారాన్ని అందుకున్నాడు.[1]
  • 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఏటుకూరి వెంకటనరసయ్య మెమోరియల్ ఎండోమెంట్ అవార్డు.[2]

ఇతడు తన 79 యేళ్ల వయసులో విజయవాడలో 2008, మార్చి 2వ తేదీన మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-07. Retrieved 2020-07-07.
  3. సంపాదకుడు (1 April 2008). "పోలవరపు కోటేశ్వరరావు" (PDF). సాహిత్య ప్రస్థానం. 6 (30): 16. Archived from the original (PDF) on 7 జూలై 2020. Retrieved 7 July 2020.