పోసుపల్లె
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఫిబ్రవరి 2017) |
పోసుపల్లె , ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పోసుపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°14′32.100″N 78°58′14.628″E / 15.24225000°N 78.97073000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొమరోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523373 |
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుతిమ్మరాజు చెరువు:- ఈ చెరువుకు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు 50 మంది రైతులకు చెందిన 60 వ్యవసాయ బోర్లు, పోసుపల్లె, బొడుసుపల్లె, మూలపల్లె గ్రామాలలోని త్రాగునీటి బోర్లకు ఆధారం. ఈ చెరువులో నీరు ఉన్నప్పుడు వరి, మిరప, సజ్జ, పత్తి మొదలగు పంటలు పండించెదరు. [2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ గురప్పస్వామివారి ఆలయం
మార్చుగ్రామంలో నూతనంగా వెలసిన గురప్పస్వామి నూతన విగ్రహప్రతిష్ఠ ఉత్సవాలను 2017, ఫిబ్రవరి-11వతేదీ శనివారంనాడు, భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. 2017, ఫిబ్రవరి-13వతేదీ సోమవారం ఉదయం ప్రాతఃకాలపూజలు నిర్వహించారు. వేదపండితులు విగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ఠలను నిర్వహించారు. మనోజ్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఈ మూడు రోజులూ అన్నప్రసాద వితరణ చేసారు. ఈ సందర్భంగా రాత్రిపూట పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసీనారు.