పౌడీ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌడీ గర్వాల్ జిల్లాలో ఉన్న పట్టణం. పౌడీ గర్హ్వాల్ డివిజన్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.

పౌడీ
పట్టణం
పౌడీ నుండీ పశ్చిమ హిమాలయాల ఎడమ వైపు దృశ్యం
పౌడీ నుండీ పశ్చిమ హిమాలయాల ఎడమ వైపు దృశ్యం
Nickname: 
గఢ్వాల్
పౌడీ is located in Uttarakhand
పౌడీ
పౌడీ
ఉత్తరాఖండ్ పటంలో పౌడీ స్థానం
Coordinates: 30°09′N 78°47′E / 30.15°N 78.78°E / 30.15; 78.78
దేశం India
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
జిల్లాపౌడీ గఢ్వాల్
Elevation
1,765 మీ (5,791 అ.)
Population
 (2011)
 • Total25,440
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN Code
246001
Telephone code+91-1368

భౌగోళికం మార్చు

పౌడీ 30°09′N 78°47′E / 30.15°N 78.78°E / 30.15; 78.78 వద్ద [1] సముద్ర మట్టానికి 1,765 మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడి నుండి నందా దేవి, త్రిశూల్, గంగోత్రి గ్రూప్, తలయ్యా-సాగర్, నిఖంతా, బ్యాండర్ పూంచ్, స్వర్గారోహిణి, కేదార్నాథ్, కర్చా కుండ్, సాతోపంథ్, చౌకంభా, ఘోరీపర్వత్, హాతి పర్వత్, సుమేరు, మొదలైన మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు కనిపిస్తాయి. కండోలియా-టెక్కా మీదుగా సతత హరిత దేవదారు వృక్షాల వెంట నడక ఆహ్లాదం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. ట్రెక్కర్లు, పారాగ్లైడింగ్ ప్రియులు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం స్వర్గధామం

శీతోష్ణస్థితి మార్చు

ఈ ప్రాంతంలో ఉప-ఉష్ణోగ్రత నుండి సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఇది ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. పౌడీ శీతోష్ణస్థితి చలికాలంలో చాలా చల్లగా ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రాంతంలో తక్కువ నుండి మితమైన హిమపాతం సంభవిస్తుంది. వర్షాకాలంలో శీతోష్ణస్థితి చాలా చల్లగా ఉంటూ పట్టణాన్ని పచ్చదనంతో కప్పేస్తుంది.

జనాభా వివరాలు మార్చు

2011 జనగణన ప్రకారం [2] పౌడీ నగర్ పాలికా పరిషత్తు జనాభా 25,440, అందులో 13,090 మంది పురుషులు, 12,350 మంది స్త్రీలు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2766. ఇది పౌడీ మొత్తం జనాభాలో 10.87%. రాష్ట్రంలో లింగనిష్పత్తి 963 ఉండగా, పౌడీలో 943గా ఉంది. పిల్లల్లో లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 890 కాగా పౌడీలో 877. ఇక్కడి అక్షరాస్యత 92.18%. రాష్ట్ర సగటు 78.82%. పౌడీలో పురుషుల అక్షరాస్యత 95.74% కాగా స్త్రీల అక్షరాస్యత 88.44%. పౌడీలో 6,127 గృహాలున్నాయి.

2001 జనగణన నాటికి [3] పౌడీ జనాభా 24,742. ఇందులో పురుషులు 53% స్త్రీలు 47%. జనాభాలో 12% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. పౌడీ గర్వాల్‌లో సాధారణంగా ఉపయోగించే భాష గఢ్వాలీ.

దర్శనీయ ప్రదేశాలు మార్చు

  • కండోలియా ఆలయం -కండోలియా దేవత స్థానిక దేవత. ఈ ఆలయం దట్టమైన పైన్ అడవుల మధ్య ఉంది. ఈ ప్రాంతంలో, కండోలియా ఠాకూర్ ఆశీస్సులతో ప్రతి శుభ కార్యాన్ని ప్రారంభించడం ఆచారం. ప్రతి సంవత్సరం, ఆలయంలో మే-జూన్ నెలలో భండారా (విందు) జరుగుతుంది. దీనికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.
  • నాగ్ దేవ్ ఆలయం: ఇది పైన్, రోడోడెండ్రాన్ అటవుల్లో ఉన్న ఒక చిన్న దేవాలయం. ఈ ఆలయం నాగదేవత (పాము దేవుడు)కి చెందినది.
  • క్యుంకాలేశ్వర్ ఆలయం - ఇది 8వ శతాబ్దపు పురాతనమైన శివాలయం. దీన్ని ఆది శంక్రాచార్యులు స్థాపించాడు. ఈ దేవాలయం ఒక చారిత్రికమైన పుణ్యక్షేత్రం క్యుంకాలేశ్వర్ ఆలయం ఆలయ ప్రాంగణంలో చేసిన కళాత్మక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయంలో సంస్కృత విద్యాలయం గురుకులం కూడా ఉన్నాయి, ఇక్కడ చిన్న పిల్లలు వేదాలు పురాణాలు నేర్చుకోవడానికి వస్తారు.
  • లక్ష్మీ నారాయణ దేవాలయం - ప్రధాన నగరంలోని ప్రధాన లక్ష్మీ-నారాయణ దేవాలయం రోడ్డులో ఉంది.
  • హనుమాన్ మందిర్ -నగరం నుండి 2 కి.మీ. దూరంలో దేవదారు అడవిలో ఈ ఆలయం ఉంది.
  • మెథడిస్ట్ చర్చి-ఈ చర్చి 100 సంవత్సరాల నాటిది. ఇది పట్టణంలోని దిగువ చోప్రా ప్రాంతంలో ఉంది.
  • మెథడిస్ట్ చర్చి, గాడోలి - చర్చి గడోలి ప్రాంతంలో ఉన్న మెథడిస్ట్ కమ్యూనిటీకి చెందినది.
  • ధారా రోడ్ - నగరంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ప్రాంతం
  • ఖిర్సు -పౌడీ నగరానికి 15కి.మీ దూరంలో ఉన్న ఈ చిన్న, పర్యాటక గ్రామంలో వసంతకాలంలో పూలు పండ్లతో నిండిన ఆపిల్ తోటలు ఉన్నాయి. గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ (GMVN) ఖిర్సులో ఒక టూరిస్ట్ రెస్ట్ హౌస్ (TRH)ని నడుపుతోంది.
  • చౌఖంబ వ్యూ పాయింట్ -ఇది నుండి 4 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుండి ఇద్వాల్ లోయ, చౌఖంబ శిఖరాన్ని చూడవచ్చు. ఇది ఓక్, రోడోడెండ్రాన్ యొక్క దట్టమైన అడవిలో ఉంది.
  • రాన్సీ గ్రౌండ్ -ఇది ఉంది పట్టణం నుండి 2.5 కి.మీ. దూరంలో ఉంది. పౌడీలోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. రాన్సీ ఒక పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఒక స్టేడియం ఉంది. ఇది ఆసియాలో రెండవ ఎత్తైన స్టేడియం.
  • నాగ్‌దేవ్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ - ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన నడక.
  • లక్ష్మణ దేవాలయం - 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా పరిగణించబడే లక్ష్మణుని ఆలయం.
  • దండ నాగరాజ ఆలయం -ఇది శ్రీకృష్ణుని ఆలయం.  

మూలాలు మార్చు

  1. Falling Rain Genomics, Inc - Pauri
  2. "Census India 2011 Pauri".
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పౌడీ&oldid=3918709" నుండి వెలికితీశారు