ప్రకాష్ నగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు బేగంపేట ప్రాంతంలోని ప్రకాష్ నగర్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను
ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా ఇన్వెస్కో ప్రకాశ్ నగర్), హైదరాబాదు బేగంపేట ప్రాంతంలోని ప్రకాశ్ నగర్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] షాపర్స్ స్టాప్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, చికోటి గార్డెన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొలంబస్ హాస్పిటల్, పేస్ హాస్పిటల్ దగ్గర సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]
ఇన్వెస్కో ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | షాపర్స్ స్టాప్ దగ్గర, బేగంపేట, సికింద్రాబాదు-500016[1] |
Coordinates | 17°26′42″N 78°27′55″E / 17.4448917°N 78.4652894°E |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Platform levels | 2 |
History | |
Opened | 29 నవంబరు 2017 |
చరిత్ర
మార్చు2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
మార్చునిర్మాణం
మార్చుప్రకాశ్ నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]
సౌకర్యాలు
మార్చుస్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]
స్టేషను లేఔట్
మార్చు- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
- రెండవ స్థాయి
- ఈ పొర రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటుంది. రైళ్లు ఈ స్థాయి నుండి ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → రాయదుర్గం → వైపు | |
ఉత్తర దిశ | → వైపు ← నాగోల్ ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
మార్చుఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.