రాయదుర్గం మెట్రో స్టేషను

హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

రాయదుర్గం మెట్రో స్టేషను, హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[2][3] హైదరాబాద్ మెట్రో మొదటి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత 2019, నవంబరు 29 న ఈ స్టేషన్ ప్రారంభించబడింది. రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ సమీపంలో ఉన్న ఈ మెట్రో స్టేషను[4] హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటి.[5]

రాయదుర్గం మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
Raidurg metro station one.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామారహేజా మైండ్‌స్పేస్ జంక్షన్, లెమన్ ట్రీ హోటల్ ఎదురుగా, రాయదుర్గం, హైదరాబాదు, తెలంగాణ - 500081[1]
నిర్మాణ రకంపైకి
లోతు7.07 meters
లెవల్స్2
ట్రాక్స్2
ఇతర సమాచారం
ప్రారంభం2019 నవంబరు 29; 2 సంవత్సరాల క్రితం (2019-11-29)
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
హైటెక్ సిటీ
(మార్గం) నాగోల్
నీలం లైన్ గమ్యస్థానం

ఈ మెట్రో స్టేషను స్టేషన్ నీలిరంగు లైనుకు టెర్మినల్ పాయింట్.[6] ఇక్కడ 2వ దశ విమానాశ్రయ మార్గం ప్రారంభమవుతుంది.[7] 2012లో ఈ స్టేషను ప్రతిపాదించబడగా,[8] ప్రారంభంలో శిల్పారామం వద్ద మెట్రో రైలు ముగించాలని భావించారు. కానీ అక్కడ చెరువు ఉండడంతో[9] కిలోమీటరు దూరంలో ఉన్న రాయదుర్గం వరకు విస్తరించి, 15 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు.[10] ఈ స్టేషను లెమన్ ట్రీ హోటల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ లకు ఎదురుగా, హైదరాబాద్ బయోడైవర్శిటీ పార్క్ నుండి 1.6 కి.మీ.ల దూరంలో ఉంది.[11] ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అతిపెద్ద మాల్ (సుమారు పది మిలియన్ చదరపు అడుగులు) ను ఈ మెట్రో స్టేషను సమీపంలో నిర్మించబోతున్నారు.[12][13] ఈ స్టేషనుకు సమీపంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) లో భాగంగా మైండ్‌స్పేస్ అండర్‌పాస్ నిర్మించబడింది.[14]

టిసిఎస్ దక్కన్ పార్క్ వైపు నుండి రైదుర్గ్ మెట్రో స్టేషను
రాయదుర్గం మెట్రో సమీపంలో మైండ్‌స్పేస్ అండర్‌పాస్

చరిత్రసవరించు

2019, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలుసవరించు

నిర్మాణంసవరించు

రాయదుర్గం ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలుసవరించు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్సవరించు

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ నాగోల్ వైపు →
ఉత్తర దిశ ← టెర్మినల్ ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 https://www.ltmetro.com/metro_stations/
 2. Geetanath, V. (28 July 2019). "Wait could get longer for HiTec City metro passengers". The Hindu. Retrieved 17 December 2020.
 3. "Metro rail line to Rayadurgam another two years away".
 4. "Metro line at Rayadurgam to factor in proposed underpass, flyover".
 5. "Metro rail rides into 2020 with new record".
 6. "HiTec City metro travellers can expect better frequency".
 7. "Metro line to RGIA under study".
 8. "Metro rail extended till Rayadurgam".
 9. "Metro rail extended till Rayadurgam".
 10. "Metro rail work may hit a snag".
 11. "New road at Biodiversity Park to ease traffic burden".
 12. "L&TMRH to build biggest mall at Rayadurgam".
 13. "Eyeing non-fare revenues, L&T Metro Hyderabad takes up transit oriented development".
 14. "Hyderabad: Women safety is key objective for metro".

ఇతర లంకెలుసవరించు