ప్రకృతినేస్తం మాసపత్రిక 2014లో ప్రారంభమైనది. హైదరాబాద్ నుండి వెలువడుతున్నది. వై.వేంకటేశ్వరరావు ఈ పత్రికకు సంపాదకుడు. రసాయన ఎరువుల వాడకం వీలైనంత తగ్గించి, సేంద్రీయ ఎరువుల వినిమయాన్ని పెంచే దిశలో రైతులకు ఈ పత్రిక మార్గదర్శకంగా ఉంది. ఈ పత్రిక ప్రకృతి వ్యవసాయ నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు రైతులకు అందించి వారిలో అవగాహన, చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రారంభమయ్యింది.

విషయసూచిక మార్చు

ప్రకృతినేస్తం ఆగస్టు 2015 సంచికలో ఈ క్రింది విషయాలున్నాయి.[1]

  • స్ఫూర్తి రగిలిస్తున్న సేద్యం
  • న్యాయం నుంచి వ్యవ"సాయాని"కి
  • సేంద్రీయ వ్యవసాయంలో దేశీయ సాంకేతిక విజ్ఞానం
  • వడలిన మొక్కలకు కొత్తజీవం
  • సేంద్రీయ వ్యవసాయం - సుస్థిరత
  • ప్రయోగాలే ఆయన పరమావధి
  • అన్నదాతకు ప్రకృతి సేద్య వందనాలు
  • వాతావరణ ఆధారిత పద్ధతి బయోడైనమిక్ వ్యవసాయం
  • మన నేల మన ఔషధ సంపద
  • రక్షకభటుడు ఇప్పుడు నేల పరిరక్షకుడు
  • బత్తాయిలో బంక తెగులు ప్రకృతి చికిత్స
  • కొర్ర మేలా... క్వినోవా మేలా...
  • చింత చిగురుతో కమ్మని వంటలు

మూలాలు మార్చు

  1. "ప్రకృతినేస్తం ఆగస్టు 2015 సంచిక". Archived from the original on 2017-09-24. Retrieved 2020-01-14.