2014
సంవత్సరం
2014 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
మరణాలు
మార్చు- జనవరి 6: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
- జనవరి 13: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
- జనవరి 15: నామదేవ్ ధసాల్, భారతీయ కవి, కార్యకర్త. (జ.1949)
- జనవరి 17: సునంద పుష్కర్,వ్యాపారవేత్త. (జ.1964)
- జనవరి 17: మహమ్మద్ బుర్హనుద్దీన్, దావోదీ బొహ్రాస్ లోని 52వ దాయ్. (జ.1915)
- జనవరి 22: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (జ.1923)
- జనవరి 28: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
- ఫిబ్రవరి 7: ఎస్ ఎం హెచ్ బర్నీ, మాజీ సివిల్ సర్వెంట్ (జ.1923)
- ఫిబ్రవరి 7: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
- ఫిబ్రవరి 13: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
- ఫిబ్రవరి 23: తవనం చెంచయ్య 2 సార్లు శాసనసభ్యునిగా పనిచేసారు.
- ఫిబ్రవరి 28: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
- మార్చి 20: కుష్వంత్ సింగ్, నవలా రచయిత, పాత్రికేయుడు (జ.1915)
- మార్చి 25: నందా, హిందీ, మరాఠీ చిత్రాలలో నటి. (జ.1939)
- ఏప్రిల్ 7: వి కె. మూర్తి, సినిమాటోగ్రాఫర్. (జ.1923)
- ఏప్రిల్ 9: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (జ.1946)
- మే 15: మల్లాది సుబ్బమ్మ స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
- మే 16: రస్సి మోడీ, మాజీ ఛైర్మన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్. (జ.1918)
- మే 17: సి పి. కృష్ణన్ నాయర్,హోటల్స్ లీలా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్. (జ.1922)
- మే 18: పి.అంకమ్మ చౌదరి, హేతువాది,మానవతావాది, న్యాయమూర్తి.
- జూన్ 3: గోపీనాథ్ ముండే, రూరల్ డెవలప్మెంట్ (భారతదేశం) యొక్క మంత్రిత్వశాఖ, మంత్రి గ్రామీణాభివృద్ధి. (జ.1949)
- జూన్ 14: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (జ.1951)
- జూన్ 14: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1928)
- జూలై 10: జోహ్రా సెహగల్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, కొరియోగ్రాఫర్, చిత్ర నటి. (జ.1912)
- జూలై 24: చేకూరి రామారావు, సాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు. (జ.1934)
- జూలై 31: ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931)
- ఆగష్టు 6: ప్రాణ్ కుమార్ శర్మ, కార్టూనిస్ట్, సృష్టికర్త చాచా చౌదరీ (జ.1938)
- ఆగష్టు 20: బి కె ఎస్. అయ్యంగార్, యోగా గురువు. (జ.1918)
- ఆగష్టు 20: మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్, పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.
- ఆగష్టు 22: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1932)
- ఆగష్టు 31: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.1933)
- సెప్టెంబరు 19: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
- సెప్టెంబరు 29: పైడి తెరేష్ బాబు, కవి. (జ.1963)
- అక్టోబరు 6: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930)
- అక్టోబరు 15: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)
- అక్టోబరు 17: ఎనుముల సావిత్రీదేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.
- నవంబరు 3: సదాశివ్ అమ్రాపుర్కర్, హిందీ, మరాఠీ చిత్రాలలో నటుడు. (జ.1950)
- నవంబరు 7: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (జ.1929)
- నవంబరు 12: రవి చోప్రా,హిందీ చిత్రాల్లో నిర్మాత, దర్శకుడు (జ.1946)
- డిసెంబరు 8: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940)
- డిసెంబరు 8: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)
- డిసెంబర్ 14: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1933)
- డిసెంబర్ 15: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (జ.1974)
- డిసెంబర్ 22: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)
- డిసెంబర్ 29: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (జ.1936)