ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్ధేశం ప్రజలలో అరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే.

దీని ప్రకారం, మానవ శరీరం పంచ భూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని మరియు ఆకాశంతో ఎర్పడింది. భూమి శరీరంలోని ఘన భాగాలు అనగా ఎముకలను సూచిస్తుంది. నీరు ద్రవరూపంలోని రక్తం మరి ఇతర రసాలను సూచిస్తుంది. గాలి శ్వాసకి ఆధారం. అగ్ని శక్తిని, ఆకాశం ఆత్మని సూచిస్తుంది. వీటిలో సమతూలనం లేకపోతే అనారోగ్యం కలుగుతుంది.

పకృతి అత్యుత్తమ వైద్యుడు. శరీరానికి రోగాన్ని నిరోధించడం మరియు రోగం నుండి విముక్తి కలిగించే శక్తి ఉంది. ఒక అవయవానికి లేక రోగానికి చికిత్స కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం దృష్టి ఈ పద్ధతిలో ఉంది. ఆహారం మరియు పంచభూతాల చికిత్స తప్ప ఇంక వేరే మందులు వుండవు.

చికిత్స పద్ధతులుసవరించు

మర్ధనసవరించు

ఇది మనస్సుకి శరీరానికి వరం. రక్త ప్రవాహం పెంచి శరీరం రంగు మెరుగు చేస్తుంది. నొప్పిని తగ్గించటానికి, కొవ్వు కరిగించటానికి, కండరాలకు బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది.

నీటి చికిత్ససవరించు

నీటిని, వివిధ ఒత్తిడి లేక వేడితో వాడి చికిత్స చేస్తారు. రకరకాల స్నానాలు (ఆవిరి స్నానం, వెన్ను, తుంటి, చేయి, కాలు కోసం స్నానం), నీటితో ఎనీమా వివిధ రకాలు.

మన్ను చికిత్ససవరించు

మన్ను శరీరంనుండి విష పదార్ధాలను గ్రహించి, చల్ల దనము కలుగచేస్తుంది. మన్నుతో స్నానం, మన్ను సంచి దీనిలో రకాలు. కొన్ని సూక్ష్మ జీవులకు చంపే శక్తి కూడా మన్నుకి ఉంది. చర్మ వ్యాధులు, జీర్ణ వ్యాధులు, అలెర్జీలకు బాగా పనిచేస్తుంది.

ఫథ్యం చికిత్ససవరించు

నియమిత ఆహారం ద్వారా అరోగ్యాన్ని పొందవచ్చు. వివిధరకాలైన ధాన్యాలు, కూరగాయలు, పళ్లు వాడుతారు.

యోగా చికిత్ససవరించు

ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలగునవి దీనిలో ఉన్నాయి.

వనరులుసవరించు

నేచర్ క్యూర్ హాస్పటల్, జయనగర్, బెంగుళూరు వారి కరపత్రం
జిందాల్ నేచర్ క్యూర్