ప్రచురణ విభాగం (భారత ప్రభుత్వం)

(ప్రచురణ విభాగము, భారత ప్రభుత్వం నుండి దారిమార్పు చెందింది)

ప్రచురణ విభాగం, (Publications Division (India)) భారతదేశానికి చెందిన ప్రచురణ విభాగం. ఇది న్యూఢిల్లీ లోని సూచనా భవనం ప్రధానకేంద్రంగా పనిచేస్తుంది. ఇది సమాచార ప్రచార మంత్రిత్వశాఖ (భారతదేశం) లో ఒక విభాగం. ఈ కేంద్రం హిందీ, ఆంగ్లం, ఇతర భారతీయ భాషలలో పుస్తకాలను ప్రచురిస్తుంది. ముద్రించిన పుస్తకాల్ని దేశమంతటా విస్తరించిన సుమారు 20 కేంద్రాలు, ఏజెంట్ల ద్వారా విక్రయిస్తుంది.[1] జాతీయ పుస్తక ప్రదర్శనలలో వీరు పాల్గొని ప్రచురణలను ప్రజలకు అందజేస్తారు.

ప్రచురణ విభాగం, భారత ప్రభుత్వం
స్థాపన1941
ప్రధాన కార్యాలయం స్థానంసూచనా భవనం, లోధీ రోడ్, న్యూఢిల్లీ
యజమాని/యజమానులుసమాచార ప్రచార మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం
అధికార వెబ్‌సైట్http://publicationsdivision.nic.in/

ఈ శాఖ 1941 లో స్థాపించబడి ఇప్పటివరకు సుమారు 7,600 పుస్తకాలను కళలు, సంస్కృతి, జీవితచరిత్రలు, శాస్త్ర సాంకేతిక, జీవశాస్త్ర, బాలలకు సంబంధించిన సాహిత్యాన్ని ముద్రించింది. మహాత్మా గాంధీ రచనలన్నింటినీ 100-భాగాలుగా ముద్రించింది.

ప్రచురణ విభాగం యోజన, ఆజ్‌కల్, కురుక్షేత్ర, బాలభారతి, ఎంప్లోయ్‌మెంట్ న్యూస్ వంటి కొన్ని పత్రికలు కూడా ముద్రిస్తుంది.

కొన్ని తెలుగు ప్రచురణలు

మార్చు
  • నవ భారత నిర్మాతలు (Builders of Modern India):
    • మోక్షగుండం విశ్వేశ్వరయ్య (రచయిత: వి. సీతారామయ్య)
    • మదనమోహన్ మాలవీయ (రచయిత: సీతారం చతుర్వేది)
    • ఎన్.జి.రంగా (రచయిత: అధరాపురపు తేజోవతి)
    • పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ (రచయిత: మహేష్ చంద్ర శర్మ)
    • కేశవ బలిరాం హెడ్గేవార్ (రచయిత: రాకేష్ సిన్హా)
  • స్పూర్తి ప్రదాతలు
  • భారతీయ సంస్కృతీ వైతాళికులు:
  • పౌరులు-రాజ్యాంగం
  • పదునెనిమిది వందల ఏబది ఏడు
  • మహనీయుల మహత్కార్యాలు (రచయిత: ఆర్. కె. మూర్తి)
  • భారత మహాపురుషులు మహోన్నత మహిళలు
  • ప్రాచీన భారతదేశం
  • విదేశీ యాత్రికుల దృష్టిలో భారతదేశం
  • నోబెల్ పురస్కార మహిళా విజేతలు (రచయిత: చిత్రా గర్గ్)
  • సరళ పంచతంత్రం
  • మన జాతీయ పతాకం (రచయిత: కర్మ వీర్ సింగ్)
  • భారతదేశపు బలమైన, రహస్యమయమైన నదులు (రచయిత: అలకా శంకర్)
  • ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యోద్యమ చరిత్ర (రచయిత: జి. కృష్ణ)
  • ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, సంపత్తి
  • భారత సుప్రసిద్ధ గ్రంథాలు (రచయిత: ఆర్. అనంతపద్మనాభరావు)
  • బాలల భారతదేశ చరిత్ర
  • రవీంద్రనాథ్ టాగూర్ బాలల కథలు
  • బాలల మహాభారతం
  • దేశ విదేశాల కథలు
  • విజయనగర ప్రాభవం (రచయిత: డా. వి. వి. కృష్ణ శాస్త్రి)
  • ఇది భారతదేశం
  • సంగ్రహ భారతీయుల ఇతిహాసం

మూలాలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 4 March 2016. Retrieved 21 February 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)