రేవూరి అనంత పద్మనాభరావు

రేవూరి అనంత పద్మనాభరావు కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు.

రేవూరి అనంత పద్మనాభరావు
జననంజనవరి 29, 1947
చెన్నూరు, నెల్లూరు జిల్లా
వృత్తిరచయిత
యజమానిఆకాశవాణి
మతంహిందూమతం
జీవిత భాగస్వామిశోభాదేవి
తల్లిదండ్రులు
 • లక్ష్మీకాంతరావు (తండ్రి)
 • శారదమ్మ (తల్లి)

జీవిత సంగ్రహంసవరించు

వీరు 1947 జనవరి 29న నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మించారు. నెల్లూరు వి. ఆర్. కళాశాల నుండి బి. ఏ. పట్టభద్రులైనారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ.లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు. 1967 నుండి 75 వరకు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ఆ కాలంలో 50కి పైగా అష్టావధానాలు చేశారు. కవిగా, రచయితగా పద్మనాభరావు 70 గ్రంథాలు ప్రచురించారు. కందుకూరి రుద్రకవి పై పరిశోధన చేసి పి. హెచ్.డి. పట్టా పొందారు.

1975 ఆగస్టు 16న ఆకాశవాణి కడప కేంద్రంలో తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, విజయవాడలలో పనిచేశారు. 1982 అక్టోబరు నుండి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పనిచేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పనిచేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగస్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుండి విజయవాడ కేంద్ర డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరక్టరు.

కేంద్ర సాహిత్య అకాడమీ వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. ముల్క్ రాజ్ ఆనంద్ "Morning Face"కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలపై శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు. జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.

రచనలుసవరించు

జీవితచరిత్రలుసవరించు

 1. వి.వి.గిరి
 2. ఆంధ్రకేసరి ప్రకాశం
 3. శంకరంబాడి సుందరాచారి
 4. బెజవాడ గోపాలరెడ్డి
 5. రాయలసీమ రత్నాలు - 2 భాగాలు
 6. ప్రసార ప్రముఖులు
 7. ప్రసార రథసారథులు
 8. ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు

విమర్శసవరించు

 1. భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు
 2. కందుకూరి రుద్రకవి
 3. ప్రకృతి కాంత

నవలలుసవరించు

 1. మారని నాణెం
 2. సంజ వెలుగు
 3. వక్రించిన సరళరేఖ
 4. వారసత్వం

కథలుసవరించు

 1. కథాకమామీషు
 2. గోరింటపూచింది

ప్రసార మాధ్యమాలుసవరించు

 1. తెలుగులో ప్రసార మాధ్యమాలు
 2. ఆకాశవాణి తీరుతెన్నులు
 3. రేడియో నాటకాలు
 4. రేడియోకి ఎలా వ్రాయాలి?

ఆంగ్ల గ్రంథాలుసవరించు

 1. Literary Heritage
 2. Radio 2002
 3. Indian Classics - Telugu
 4. Job Interviews
 5. Marathon Race to Civil Services
 6. వేయిపడగలు - విశ్వనాథ -ఆంగ్లానువాదం (4 ప్రకరణాలు)

తెలుగులోకి అనువాదాలుసవరించు

 1. ప్రభాత వదనం - ముల్క్‌రాజ్ ఆనంద్ - Morning Face
 2. ఛాయారేఖలు - అమితాబ్ ఘోష్ - Shadow Lines
 3. వాల్మీకి - ఐ.పాండురంగారావు - Valmiki
 4. నీరు
 5. చెట్లు
 6. బోధనోపకరణాలు
 7. మధుక్షీరాలు - హీబ్రూ కథలకు అనువాదం - Not Just Milk & Honey
 8. మదర్ థెరిసా - మెహతా - Mother Teresa - Inspiring Incidents

ఆధ్యాత్మిక గ్రంథాలుసవరించు

 1. రామాయణంలో స్త్రీ పాత్రలు
 2. యశోద (బాల సాహిత్యం. తి.తి.దే ప్రచురణ)
 3. హరివంశం (ఆకాశవాణి ధారావాహికం)
 4. భక్తి సాహిత్యం (వ్యాస సంపుటి)
 5. ఆంధ్రమహాభారత వ్యాఖ్యానం - విరాటపర్వం
 6. ఆంధ్ర మహాభాగవతం - చతుర్థ స్కంధం
 7. వర్ణన రత్నాకరం - వ్యాఖ్యానం

ఇతరాలుసవరించు

 1. దాంపత్యజీవన సౌరభం
 2. తలపుల తలుపులు
 3. ఆంధ్ర మణిహారం
 4. భయం వేస్తోందా భారతీ?

అవార్డులుసవరించు

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన డాక్టర్ అనంత పద్మనాభరావుకు పలు అవార్డులు లభించాయి. వానిలో కొన్నింటి వివరాలు.

 • 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమి నుంచి ఉత్తమ అనువాదక బహుమతి లభించింది.
 • 1999లో ఢిల్లీ, మద్రాసు తెలుగు అకాడమీల అవార్డులు వచ్చాయి.
 • 2004లో డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు, దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు,
 • 2003లో చెన్నయ్‌లో భారతీయ సమైక్యతా పురస్కారం,
 • 2002లో ఢిల్లీలో రాష్ట్ర్టీయ ఏక్తా అవార్డు,
 • 2000 సంవత్సరంలో నాగభైరవ కళాపీఠం అవార్డు,
 • 1996లో విజయవాడలో ఈకే అవార్డు,
 • 1991లో కవిత్రయ అవార్డు,
 • 1992లో ఎస్. ఆంజనేయులు అవార్డులు లభించాయి.
 • 1993లో ఉత్తమ అనువాదకుడిగా తెలుగు యూనివర్శిటీ పురస్కారం పద్మనాభరావుకు దక్కింది.
 • సనాతన« దర్మ ఛారిటబుల్ ట్రస్టు ఇటీవల ఈయనను శ్రీరామ నవమి పురస్కారంతో సత్కరించింది.
 • 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో అవధానిగా అనంత పద్మనాభరావును సన్మానించారు.
 • న్యూయార్క్‌లో జరిగిన ఆటా సభలో ఈయన్ని సత్కరించారు.
 • రేడియో నాటకాలపై పరిశోధన చేసేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ పద్మనాభరావుకు ఫెలోషిప్‌నిచ్చింది.

బయటి లింకులుసవరించు