ప్రణీత వర్థినేని

భారతదేశ విలుకాడు

1990, నవంబర్ 17న ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో జన్మించిన ప్రణీత వర్థినేని (Pranitha Vardhineni) అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.

Beijing 2008 logo.svg

2008 ఒలింపిక్ క్రీడలుసవరించు

2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో ప్రణీత వర్థినేని మహిళ అర్చెరీ వ్యక్తిత, టీం విభాగాలలో ప్రాతినిధ్యం వహించింది. వ్యక్తిగత విభాగంలో రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన జానె వాల్లెర్‌పై 106-100 స్కోరుతో విజయం సాధించి రౌండ్ 32కు వెళ్ళిననూ, అందులో ఉత్తర కొరియాకు చెందిన కోన్ ఉన్ సిల్ తో 99-106 తేడాతో ఓడి చివరకు 37వ స్థానం పొందినది..[1] టీం విభాగంలో డోలా బెనర్జీ, బాంబ్యాలాదేవిలతో కలిసి పోటీపడిన ప్రణీత వర్థినేని క్వార్టర్ ఫైనల్లో చైనాతో ఒడిపోయి చివరకు 6వ స్థానం పొందినారు.

మూలాలుసవరించు

  1. Athlete biography: Pranitha Vardhineni, beijing2008.cn, ret: August 23, 2008