ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి

ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి (1900 - 1948) సంస్కృతాంధ్ర భాషా పండితుడు.

జీవిత విశేషాలుసవరించు

అతను గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా తిమ్మరాజుపాలెంలో 1900లో జన్మించాడు. అతను తిరుపతి వేంకట కవులులో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వద్ద వ్యాకరణం, కావ్యాలు, నాటకాది విశేషాలు అభ్యసించాడు.

రామాయణం మొదలైన కావ్యాలను సంగీతంతో సహా శ్రోతలను రంజిల్లింపజేసే విధంగా గానం చేయడానికి ప్రసిద్ధిచెందాడు.

వీరు 1948 సంవత్సరంలో పరమపదించారు.

రచనలుసవరించు

  • గణపతి విజయం
  • శివస్తోత్రం
  • త్యాగరాజు

మూలాలుసవరించు