సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు (పుస్తకం)

(ప్రతిభా మూర్తులు నుండి దారిమార్పు చెందింది)

సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు సామాజిక సేవలోఆత్యుత్తమ ప్రతిభ కనపరిచి భారతదేశంలోని కొందరి గురించి తెలియజేసే తెలుగు పుస్తకం. ఇది శారదా బెయిల్ రచించిన "Icons of Social Change" పుస్తకం తెలుగు అనువాదం. సామాజిక సేవారంగంలో పనిచేసేవారికి స్పూర్తిదాయకంగా రావెల సాంబశివరావు అనువదించారు.

పుస్తకం గురించి

మార్చు

ఈ పుస్తకంలో భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చి వెసిన ప్రతిభామూర్తుల కథలు ఉన్నాయి. ఆయా వ్యక్తులు తమ రంగాలలో సాధించిన విజయలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇందులో ఒక్కొక్క కథ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కథానాయకులుగా ఎదిగిన వైనం ఉంటుంది.

సమాజంలో అన్యాయాలను ఎదిరించి తమసాటి పౌరులకు తల ఎత్తుకు జివించే ధైర్యాన్ని ఇచ్చేందుకు ఉద్యమించిన పది మంది సంఘ సేవకుల కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ప్రతిభా మూర్తులు

మార్చు
  • మహాశ్వేతాదేవి: దేశంలోని వివిధ ప్రాంతాలలో గిరిజనులతో కలసిన పనిచేయడం ద్వారా తన రచనల ద్వారా వారి దయనీయ జీవితాలను వెలుగులోకి తెచ్చిన బెంగాలీ రచయిత్రి.
  • బాబా ఆమ్టే: కుష్ఠురోగుల పట్ల సమాజంలో ఏవగింపును మూరం చేసేంద్కు అతన జీవితం ధారపోసి, వారి కోసం ప్రత్యేక సమాజాన్ని నిర్మించిన వ్యక్తి.
  • చండీప్రసాద్ భట్: చిప్కో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలచి, గఢ్వాల్ లో అంతరించిపోతున్న అటవీ సంపదను కాపాడేందుకు నడుం బిగించిన వ్యక్తి.
  • జె.యన్.కౌల్: అనాథ పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు దేశంలో ఎస్.ఓ.ఎస్. చిల్డ్రన్ విలేజెస్ ను స్థాపించిన వ్యక్తి.
  • ఇలా భట్: అహ్మదాబాదులోని మహిళా కార్మికులను సంఘటిత పరచి, వారి కోసం "సేవా" సహకార సంఘాన్ని నెలకొల్పేందుకు సాహసం చేసిన వ్యక్తి.
  • బిందేశ్వర్ పాఠక్: పరిశుభ్రత, పారిశుధ్యం పట్ల విస్తృత అవగాహన కల్పించి "సులభ్" మరుగుదొడ్లను ఏర్పాడు చేయడానికి పూనుకొన్న వ్యక్తి.
  • అరుణా రాయ్: ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తున్నారో నలుగురికీ తెలిసేలా సమాచార హక్కు కోసం ఉద్యమం నడిపిన వ్య్హక్తి.
  • సుగథ కుమారి: అంతరించిన ఒక అడివిని మళ్ళీ చిగురింపజేసి, నిరాశ్రయులైన అబ్నలలకు ఆశ్రయం కల్పించిన మలయాళ కవయిత్రి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కారిణి.
  • రాజేంద్రసింగ్: రాజస్థాన్ పడమటి ప్రాంతంలో ఎండిపోయిన జలాశయాలను, నదులను నీటితో కళకళలాడేట్టు చేసిన అపర బగీరథుడు.
  • సందీప్ పాండే " అవకాశాలను నోచుకోని నిర్భాగ్యులైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మోడువారిన ఆ పసి జీవితాలను చిగురించజేయడమే ధ్యేయంగా సాగుతున్న వ్యక్తి.

మూలాలు

మార్చు
  • సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు, ఆంగ్లమూలం: శారదా బెయిల్, తెలుగు అనువాదం: రావెల సాంబశివరావు, అలకనంద ప్రచురణలు, విజయవాడ, 2005. ISBN 8182940117