ప్రతీక్షా లోన్కర్

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి.

ప్రతీక్షా లోన్కర్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. ఎక్కువగా హిందీ, మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియళ్ళలో నటించింది.[1] డిడిసహ్యాద్రిలో ప్రసారమైన దామిని మరాఠీ టీవి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించి పేరు పొందింది.[2]

ప్రతీక్షా లోన్కర్
జననం1968
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దామిని సీరియల్ లో దామిని పాత్ర

జీవితం విశేషాలు

మార్చు

ప్రతీక్షా లోన్కర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించింది. తండ్రి డాక్టర్, తల్లి ఉపాధ్యాయురాలు. ప్రతిక్షా 10వ తరగతి వరకు పాఠశాల విద్యను పూర్తిచేసిన తర్వాత, కళారంగం మీద అభిరుచితో నాటకరంగంలోకి వెళ్ళింది.[2]

కళారంగం

మార్చు

నటనపై ఉన్న ఆసక్తితో ముంబైకి వెళ్ళి మరాఠీ, హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది. డిడి సహ్యాద్రిలో వచ్చిన దామిని సీరియల్ లో దామిని పాత్ర పోషించింది.[3][4] హిందీ టీవీ సీరియల్ కహానీ నహీ....జీవన్ హై మరాఠీలో వసుధగా రీమేక్ చేయబడింది. ఈ రెండు సీరియల్స్‌లో కూడా ప్రధాన పాత్ర పోషించింది.[5] దూరదర్శన్‌లో ముద్దుపెట్టుకున్న మొదటి మహిళా నటి ప్రతిక్షా. బ్యోమకేష్ బక్షి ఎపిసోడ్‌లో వ్యాంప్‌గా నటిస్తున్నప్పుడు ముద్దు పెట్టుకుంది.

టీవీ సీరియల్స్‌తోపాటు అనేక మరాఠీ, హిందీ సినిమాలలో కూడా నటించింది. 2002లో వచ్చిన భేట్ అనే మరాఠీ సినిమాలో విడాకుల తర్వాత కొడుకు నుండి విడిపోయిన సుధ అనే తల్లి పాత్రలో నటించి అవార్డులు, ప్రశంసలు అందుకుంది.[6] 2007 ఏవ్‌దే సే ఆభాల్‌లో ఒక చిన్న పిల్లవాడికి తల్లిగా నటించింది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఇక్బాల్, దోర్, ఆశేయిన్, మోడ్ అనే నాలుగు సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

మరాఠీ స్క్రీన్ ప్లే రచయిత ప్రశాంత్ దాల్వీని వివాహం చేసుకున్నది.[7][8]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష
1997 గుడ్గుడీ సునీత హిందీ
1998 సర్కర్నామ మరాఠీ
1999 పైజ్ లగ్నాచి వైశాలి మరాఠీ
1999 బింధాస్త్ మరాఠీ
2002 భేట్[9] సుధ మరాఠీ
2005 ఇక్బాల్ సైదా హిందీ
2006 దోర్ గౌరీ సింగ్ హిందీ
2006 హీ పోర్గి కునాచీ శ్రీమతి. పాట్కీ మరాఠీ
2007 ఖన్నా & అయ్యర్ హిందీ
2007 ఏవధేసే ఆభల్ మరాఠీ
2007 హ్యాట్రిక్ శ్రీమతి. చవాన్ హిందీ
2007 నాన్హే జైసల్మేర్ నాన్హే తల్లి హిందీ
2007 సుర్వంత మరాఠీ
2008 మీరాబాయి నాటౌట్ నీలిమ ఎం. అచ్రేకర్ హిందీ
2008 హీరోస్ శ్రీమతి. నఖ్వీ హిందీ
2008 సక్క భౌ పక్క వైరీ మరాఠీ
2009 కావలెను లక్ష్మి హిందీ
2009 వాద రహా డాక్టర్ కేల్కర్ హిందీ
2010 ది వెయిటింగ్ రూమ్ రీమా హిందీ
2010 ఖేల్ సాత్ బరాచా మరాఠీ
2010 లేక్ లడ్కీ మరాఠీ
2010 ఆశయైన్ సోదరి గ్రేస్ హిందీ
2011 ముంబై కట్టింగ్ హిందీ
2011 మోడ్ శ్రీమతి. రేమండ్ హిందీ
2012 తుకారాం కంకీ మరాఠీ
2012 మోక్లా శ్వాస మరాఠీ [10]
2014 దుసరి గోష్ట మరాఠీ
2016 ఫ్యామిలీ కట్టా సుజాత మరాఠీ
2018 ఆక్సిజన్ అమ్మీ గుజరాతీ

నాటకరంగం

మార్చు
పేరు భాష ఇతర వివరాలు
లగ్న మరాఠీ కమలాకర్ సారంగ్ దర్శకత్వం
చార్ చౌగీ మరాఠీ చంద్రకాంత్ కులకర్ణి దర్శకత్వం
యెల్కోట్ మరాఠీ శ్యామ్ మనోహర్ నాటకం, చంద్రకాంత్ కులకర్ణి దర్శకత్వం[11]
డాక్టర్ తుమ్హి సుధ. . . మరాఠీ చంద్రకాంత్ కులకర్ణి దర్శకత్వం [12]
ఆంహి సౌ కుముద ప్రభాకర్ ఆప్టే మరాఠీ వీరేన్ ప్రధాన్ దర్శకత్వం

అవార్డులు

మార్చు
  • 2003 – మహారాష్ట్ర టైమ్స్ (మాతా) భేట్ కోసం సన్మాన్[13][14]
  • 2003 – భేట్ కోసం మరాఠీ చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్ స్క్రీన్ అవార్డు 
  • 2007 – పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏవ్‌దే సే ఆభాల్ కోసం ఉత్తమ నటి పురస్కారం[15]
  • 2008 – ఏవదే సే ఆభాల్ సినిమాలో ఉత్తమ నటి పురస్కారం[16]
  • ప్రింట్ వ్యూ పబ్లికేషన్స్, లయన్స్ క్లబ్ ద్వారా వైభవ్ పురస్కారం[17][18]

మూలాలు

మార్చు
  1. Aparna Nair (23 January 2012). "National Youth Festival starts at Nagpur varsity". The Times of India. Archived from the original on 3 January 2013. Retrieved 2022-08-26.
  2. 2.0 2.1 Shabdagandha Kulkarni (7 July 2003). "सक्सेस स्टोरी – प्रतीक्षा लोणकर – मुंबईने संघर्ष शिकवला". Maharashtra Times (in Marathi). Archived from the original on 26 January 2013. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. Shabdagandha Kulkarni (7 July 2003). "सक्सेस स्टोरी – प्रतीक्षा लोणकर – मुंबईने संघर्ष शिकवला". Maharashtra Times (in Marathi). Archived from the original on 26 January 2013. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. "प्रेक्षकांनीच कंटाळवाण्या मालिका पाहू नयेत". Sakal (in Marathi). 17 January 2012. Archived from the original on 30 November 2012. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. "'वसुधा'च्या जीवनाची कहाणी". Maharashtra Times (in Marathi). 15 April 2003. Archived from the original on 26 January 2013. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  6. Aarti Kulkarni (8 March 2003). "अंधुक रेषा जपताना... : प्रतीक्षा लोणकर". Maharashtra Times (in Marathi). Archived from the original on 26 January 2013. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. "Marriage mantra". Mid-Day. 31 January 2006. Retrieved 2022-08-26.
  8. "विवाहसंस्था". Maharashtra Times (in Marathi). 9 March 2012. Archived from the original on 2014-08-26. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  9. "Hedging his bhets". Mid-Day. 18 June 2002. Retrieved 2022-08-26.
  10. "पणती आहे की…". Navshakti (in Marathi). 11 May 2012. Archived from the original on 18 February 2013. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  11. Shanta Gokhale. Playwright at the centre: Marathi drama from 1843 to the present.
  12. "Drama Details". Mumbai. Archived from the original on 26 May 2013. Retrieved 2022-08-26.
  13. Aarti Kulkarni (8 March 2003). "अंधुक रेषा जपताना... : प्रतीक्षा लोणकर". Maharashtra Times (in Marathi). Archived from the original on 26 January 2013. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  14. Ambarish Mishra (3 March 2003). "Marathi stars rock and roll on Mata night". The Times of India. Mumbai. Archived from the original on 3 January 2013. Retrieved 2022-08-26.
  15. "Pune International Film Festival witnesses star-studded closing ceremony". Indiantelevision.com. 18 January 2007. Retrieved 2022-08-26.
  16. "Award-winning Marathi film in Dharwad". The Hindu. Dharwad. 14 March 2008. Archived from the original on 18 March 2008. Retrieved 2022-08-26.
  17. "डॉ. श्री बालाजी तांबे यांना वैभव पुरस्कार जाहीर". Sakal (in Marathi). 12 October 2011. Archived from the original on 27 April 2012. Retrieved 2022-08-26.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  18. "वैभव पुरस्काराचे आज फलटण येथे वितरण". Dainik Aikya (in Marathi). 14 October 2011. Archived from the original on 2016-03-04. Retrieved 2022-08-26.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు