త్రిజట: కూర్పుల మధ్య తేడాలు

చిన్న చిన్న మార్పులు
పంక్తి 22:
 
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక [[రాముడు|రామ]] [[లక్ష్మణుడు|లక్ష్మణులు]] బ్రతికే ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా నేను నీమీది స్నేహంతో చెబుతున్నాను. నేను ఏనాడూ అబద్ధం ఆడను. నీవు శీలవతివి గనుక నా మనసును ఆకర్షించావు - అని సీతను అనునయించింది. సీత తన చేతులు జోడించి "నీ మాటే సత్యం కావాలి" అంది.
==ప్రస్తావన==
ర|| విభీషణుని కూఁతురు. సీత రావణునిచేత పట్టువడి ఉండు కాలమున ఈమె సీతకు మిగుల ఊఱటమాటలు చెప్పుచు ఉండెను. ఒకప్పుడు రావణుని నాశమునకు సూచకమైన కల ఒకటి కని రాక్షసస్త్రీలు చేయు నిర్బంధములచే మిగుల ఖిన్నురాలై ఉండిన సీతకు ఆస్వప్నవృత్తాంతము చెప్పి శీఘ్రకాలములో రాముఁడు రావణుని నశింపఁజేసి ఆమెను తోడుకొనిపోవును అని ఈమె సమాధాన పఱచెను.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/త్రిజట" నుండి వెలికితీశారు