యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 29:
ఈయన 1975 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ , ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థల ఫెలోషిప్ లను అందుకుని పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. దేశ, విదేశ ప్రఖ్యాత సంస్థలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. అమెరికన్ లెదర్ కెమిస్ట్స్ అసోషియేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్, సొసైటీ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్ (బ్రిటన్) మొ.. సంస్థలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్కు, అసోషియేషన్ ఆఫ్ లెదర్ కెమిస్ట్స్ మొదలగు ప్రసిద్ధి చెందిన సంస్థలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇంటటి ఘనతరమైన హోదాలను నిర్వహించినప్పటికీ, సమావేశాలలో ఇతర సభలలో అపరిచితులతో సందర్బవశాత్తు "నా పేరు నాయుడమ్మ అంటారండీ" అని అతి సాధారణంగా తనను తాను పరిచయం చేసుకునేవారు. ఎంతటి వారినైనా ఈయనలోని నిరాడంబరత్వం, నిశిత మేధస్సు, విషవివేచనానుభవం ఇట్టే ఆకట్టుకునేవి.
==ప్రభుత్వ గౌరవ సలహాదారుగా==
ఈయన లోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈయనను రాష్త్రరాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈయనను గౌరవ పదవిలో కొనసాగిస్తూ ఈయన పరిణతను, సుదీర్ఘ అనుభవసారాన్ని వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, సైన్స్, టెక్నాలజీలను ఉపయోగించి, వెనుక బాఅటుతనాన్ని (ఆర్ధికంగా) రూపుమాపేందుకు వెనుకబడిన జిల్లాల దత్తత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అనూహ్యంగా సత్ఫలితాలను సధించిన ఈ కార్యశీలి పలు విశిష్ట గౌరవాలు అందుకున్నారు.
==వ్యక్తిత్వం==
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు