తాడంకి శేషమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1958 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| death_cause =
| known = తొలి తరం తెలుగు సినిమా నటి
| occupation = [[నటన]]
| title =
| salary =
పంక్తి 36:
}}
 
'''తాడంకి శేషమాంబ''' (1908-1968) తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది.
 
[[తెనాలి]]లోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త తాడంకి వెంకయ్య కూతురు పుట్టిన తర్వాత మరణించడంతో ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. పూడగడవని పరిస్థితిని గమనించిన ప్రముఖ లాయర్ [[నండూరు శేషాచార్యులు]], ప్రముఖ డాక్టర్ [[గోవిందరాజులు సుబ్బారావు]]లు ఈమెను ప్రోత్సహించి, నటనలో శిక్షణ ఇప్పించి, రంగస్థల ప్రవేశం చేయించారు.
పంక్తి 42:
తన తొలినాటకం కన్యాశుల్కంలో మధురవాణిగా శేషమాంబ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి అలరించడంతో, నాటకరంగంలో స్థిరపడి కుటుంబ నిర్వహణకు ఇబ్బందులు తీరిపోయాయి. పాండవోద్యగవిజాయాలు నాటకంలో కర్ణుడి పాత్ర, ఖిల్జీ రాజ్య పతనంలో కమలారాణి పాత్రలు శేషమాంబకు పేరుతెచ్చి పెట్టాయి.
 
1939లో వాహినీ పతాకంపై [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం]] సినిమా నిర్మాణంలో ఉన్న దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డికి అందులో గయ్యాళి అత్త పాత్రను పోషించడానికి సరైన నటి దొరకలేదు. ఆ అన్వేషణలో ఉన్న ఆయన మిత్రుల ద్వారా శేషమాంబ గురించి విని ఆమెను పరీక్షించడానికి సముద్రాల, ఎ.కె.శేఖర్ లను తెనాలి పంపాడు. వాళ్ళు శేషమాంబతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని మద్రాసు తిరిగివెళ్ళారు. అలా సినిమా రంగానికి పరిచయమైంది శేషమాంబ. నిజ జీవితంలో అత్త ఆడబిడ్డల అదమాయింపులు, ఆరళ్ళు చాలాకాలం అనుభవించిన శేషమాంబ తన అనుభవసారాన్ని రంగరించి గయ్యాళి అత్త పాత్రను తనదైన శైలిలో అద్భుతంగా పోషించింది.<ref>[http://2.bp.blogspot.com/_vDh6VLh0MwE/TEpZKim_jXI/AAAAAAAACbE/6n9zMA8yedQ/s1600/hero+raamasarma+1.jpeg ఈనాడులో తాడంకి శేషుమాంబపై వినాయకరావు వ్యాసం]</ref>
 
శేషమాంబ 14-11-1958 తేదీన [[తెనాలి]]లోనే మరణించింది.<ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ:279-80.</ref> ఈమె కూతురు స్వరాజ్యలక్ష్మి కూడా నటే.
"https://te.wikipedia.org/wiki/తాడంకి_శేషమాంబ" నుండి వెలికితీశారు