తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
=== మతపరమైన స్థితిగతులు ===
 
== తొలిదశ ==
1921 నవంబర్ 12న హైదరాబాద్‌లోని టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునే లక్ష్యంతో [[ఆంధ్ర జనసంఘం]] ఏర్పాటుచేశారు. [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ముందుముల నరసింగరావు]], [[ఆదిరాజు వీరభద్రరావు]], [[రామస్వామి నాయుడు]], [[టేక్‌మాల్ రంగారావు]] తదితర 11మంది యువకులతో ఆ సంఘం ఏర్పాటైంది. తెలుగు భాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం వంటివి ప్రారంభించింది. ఆ సంస్థ 1930కల్లా [[ఆంధ్రమహాసభ|ఆంధ్రమహాసభగా]] రూపుదిద్దుకుంది.<ref>బండెనక బండికట్టి:వాసిరెడ్డి నవీన్:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2012</ref>