పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== పాలు ఎరుగని పసిబుగ్గలు ==
[[Image:Well-clothed baby.jpg|thumb|చలినుండి వివిధరకాలైన దుస్తులతో రక్షించబడిన పసిపాప.]]
రాష్ట్రంలో 75 శాతం మంది పిల్లలకు పాలు తాగే స్థోమత లేదు.73 శాతం మంది పండ్లు తినేది నెలకో, ఏడాదికో అని ప్రణాళికా సంఘం అధ్యయనంలో చేదునిజాలు వెల్లడయ్యాయి.మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని వారంతా కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. బడి గంట కొట్టగానే బిలబిలమంటూ కంచాలు చేతపట్టి భోజనానికి వరుసలో నిలబడతారు. అన్నం, సాంబారు కలుపుకొని అవురావురుమంటూ తింటారు. రాత్రికి ఇంటిలో మళ్లీ అరకొర భోజనం. ఇంట్లో పాలు, పళ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయాలు వంటి పౌష్టికాహారమేదీ అందుబాటులో ఉండదు. ఇటువంటి దయనీయ దుస్థితి ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మరీ ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తున్న పిల్లలకు వారి ఇళ్లవద్ద ఇంకేమీ పోషకాహారమంటూ లభించటంలేదు.
* 60.24 శాతం మంది పిల్లలు వ్యవసాయ, ఇతర కార్మికుల కుటుంబాలకు చెందినవారు. వీరి కుటుంబ వార్షికాదాయం దేశ మొత్తం మీద ఇక్కడే అతి తక్కువగా కేవలం రూ.16,672గా ఉంది. దీంతో ఇళ్లల్లో పిల్లలకు పోషకాహారమంటూ ఏదీ లభించటంలేదు.
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు