ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కథా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ'''
| residence =
| other_names =ఆచంట సాంఖ్యాయన శర్మ
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[అక్టోబర్ 19]], [[1864]]
| birth_place =
| native_place =
| death_date = [[1933]]
| death_place =
| death_cause =
| known = తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు<br />తొలితరం తెలుగు కథకుడు
| occupation =
| title =
పంక్తి 37:
 
 
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది<ref> అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]] సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు<ref>
{{Cite web|title= తెలుగు సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు|last=శ్రీ లింగాల|first= రామతీర్థ |url=http://www.prabhanews.com/specialstories/article-61775 | publisher= ఆంధ్రప్రభ|date=2009-12-28|accessdate=2014-03-15}}
</ref>. కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>తొలినాటి తెలుగు కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?) </ref>
 
1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు<ref>విజ్ఞానశాస్త్రంతెలుగు రచయితలు- చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి </ref>. సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశాడు<ref>తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి - -చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>.
 
సాంఖ్యాయన శర్మ 1864లో మద్రాసు ప్రెసిడెన్సీలోని విశాఖపట్నంలో విద్యాధికులైన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో నరసమాంబ, బాపిరాజు దంపతులకు జన్మించాడు.<ref>[http://www.maganti.org/PDFdocs/achanta.pdf మాగంటి.ఆర్గ్ లో పత్రము]</ref> సాంఖ్యాయన శర్మ 1903లో కల్పలత అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక. ఈ పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవాడు. ఈ పత్రికలో శాస్త్ర విషయాలతో పాటు లఘ కథానికలు, ఆధునిక కవిత్వం మొదలైన ఇతర సాహితీ రచనలు కూడ ప్రచురించబడేవి. సాంఖ్యయన శర్మ కథలు లలిత, విశాఖ మరియు అపూర్వోపన్యాసం మొదలైన ఈ పత్రికలో ప్రకటించినవే.<ref>[http://www.sundarayya.org/eap/EAP287/Note%20on%20the%20List%20of%20Journals%20to%20be%20done%20in%20the%20project.doc List of Telugu Journals published prior to 1947 ] {{deadlink|date=March 2014}}</ref>
 
==రచనలు==