ఇంటి పిచ్చుక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 29:
 
 
పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరి జీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్తితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయి పోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారి లేకపోతే పెగుతున్న సాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్తితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకు పోవడానికి కారణాలు:
# ఇంధన కాలుష్యం
# గృహనిర్మాణంలో మార్పులు
# పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు
# సాంకేతిక మార్పులతొపాటు సెల్ టవర్లు నిర్మాణం (వీటితరంగాల వలన తగ్గు తున్న ఉత్పత్తి).
 
==గృహనిర్మాణం==
 
సాధారణంగా పిచ్చుకలు ఇంటి కప్పులక్రింద, పూర్వం రోజులలో పెంకులు అడుగుభాగంలో, 90 శాతం ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ, మగ పిచ్చుకలు కలసి జీవనం సాగించుకోవడానికి నిర్నయించుకున్న తరువాత గూడు నిర్మాణం చేపడుతాయి. రెండూ కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి భాద్యత బాధ్యత వహించుతాయి. ఇవిఎక్కువగా ధాన్యం తింటాయి. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యంగింజని మాత్రం తింటాయి, అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి
 
 
==ప్రపంచ దేశాలలో పిచ్చుకలు==
సాధారణంగా పిచ్చుకలు మనదేశంలోనే కాకుండా ఆశియా, ఆఫ్రికా యూరప్ ఖండాల్లొ కూడా కనిపించుతున్నాయి. భారతదేశంలో కర్ణాటకా, గుజరాత్, మహారాష్ట్ర, తమిలనాడ్, పశ్చిమబెంగాల్ ఒడిశ్సా రాష్ట్రాలలో విరివిగా కనిపించుతాయి.
==ప్రపంచ పిచ్చుకల దినోత్సవం==
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇంటి_పిచ్చుక" నుండి వెలికితీశారు