కాటమరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{వికీకరణ}}
తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగిన వాటిల్లో '''కాటమరాజు కథ''' ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి [[ఆరుద్ర]] ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు.
ఈ పుస్తకానికి దిగుమర్తి సీతారామస్వామి ముందుమాట రచించారు. ఈ నాటకాన్ని స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై వారు పుస్తకంగా ప్రచురించారు.
 
==సంక్షిప్త కథ==
పంక్తి 13:
==పాత్రల చిత్రీకరణ==
 
మొత్తం ముప్పైనాలుగు రంగాలుగా విభజించబడ్డ ఈ నాటకరచన ఒకరంగం నుండి మరో రంగంలోని పాత్రలకూ, స్థలానికీ అత్యంత సహజంగా మారుతూ కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిస్తుంది. మనకు ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఖడ్గతిక్కన కథలో ఖడ్గతిక్కన నాయకుడిగానూ, కాటమరాజు పుల్లరి ఎగ్గొట్టి మోసం చేసిన ప్రతినాయకుడిగానూ కనిపిస్తారు. అటువంటి బహుళప్రచారంలో ఉన్న పాత్రలను తీసుకుని కాటమరాజుని అవతారపురుషుడిగా, సౌమ్యుడు, మితభాషి ఐన ఉత్తముడిగా చిత్రీకరించడం, దానిని పాఠకుడిచేత సందేహం లేకుండా ఆమోదింపజేయటం అంత సులభమైన పనేం కాదు. ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్నేళ్ళుగా ఖడ్గతిక్కనకు ఉన్న కథానాయకుడి స్థానం మారినప్పటికీ, అతని వ్యక్తిత్వ చిత్రణ, ధీరత్వ వర్ణన, పాత్ర ఉదాత్తత వంటి విషయాల్లో ఎటువంటి మార్పూ చెయ్యకుండా ఆ పాత్రపై పాఠకుడిలో ఆరాధనాభావాన్ని కలిగిస్తారు రచయిత.
 
కథానాయకుడైన కాటమరాజు మొదటినుంచీ ధర్మబద్ధుడిగా, ఆవేశం, ఆగ్రహం, విషాదం కలిగించే సందర్భాల్లో సంయమనం పాటించే వ్యక్తిగా, అవసరానికిమించి మాట్లాడని తత్వంగలవాడిగా, తన పశుగణాలపై, తమవారిపై అపారమైన అభిమానంగలవాడుగా కనిపిస్తాడు. ఇచ్చినమాటకు అతను కట్టుబడే విధానాన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే – దక్షిణాదికి పశువులతో సహా తరలివస్తున్నప్పుడు అది శత్రుసీమ కాబట్టి తన కొడుకుని పంపడం ఇష్టం లేని సవతితల్లి, అయితమరాజును పంపకుండా కొన్ని సాకులు ఏర్పరుస్తుంది. కానీ అక్కడ కాటమరాజు తప్పక నెగ్గుకొస్తాడనే నమ్మకం లోలోపల ఉన్నది కావటం చేత సంవత్సరం తర్వాత తాము దక్షిణాదిన సాధించిన దానిలో తమ్మునికి వాటా ఇవ్వమని మాట తీసుకుంటుంది. ఐతే ఆమె చెప్పిన గడువుకి యుద్ధం మొదలౌతుంది. తాము నెల్లూరిసీమలో సాధించినది ఇదే కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడికి యుద్ధంలో భాగం ఇస్తానని కబురు పంపుతాడు కాటమరాజు.
 
“తమకు గురుతుల్యులైన బ్రాహ్మలతో యుద్ధం చెయ్యడం యాదవవంశ ఆనవాయితీ కాదని”, కాటమరాజు కత్తిని ఒరలో దించి ఒంటరివాడైన తిక్కన ముందు తలదించి నిలబడే సన్నివేశం నాయక పాత్రకు ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టింది.
పంక్తి 34:
దొనకొండలో ఉండవలసిన దోరవయసు బాలుడు పోచయ్య యుద్ధభూమిలో బాలచంద్రుడివలే భయంగొల్పి , వీరాభిమన్యుడివలె విజృంభించి చివరకు రాజభటులు ప్రయోగించిన విలుమూకలకూ, చాయలబల్లాలకూ బలి అవుతాడు. ఈ రకంగానే మిగతా యాదవముఖ్యులంతా హతమౌతారు.
 
పతాక సన్నివేశంలో తలపడ్ద కాటమరాజు, నల్లసిద్ధి తమ తమ తప్పొప్పులపై, బలమూ, బలగాల ప్రస్థావనతో రాజనీతి గురించి మాట్లాడుకునే సన్నివేశం సందర్భోచితంగా ఉంటుంది.
 
మోవాకుల మీద లేఖ రాయడం కోసం ఎర్రయ్య తాటిచెట్టుని పెకలించుకురావడం అంతకుముందే ప్రచారంలో ఉన్న వీరగాథల్లోనే ఉండటం వల్ల ఆరుద్ర గారు తేదలచుకున్న రామాయణ సామ్యానికి హనుమంతుడి బలానికి పోలిక సరిపోయింది.
పంక్తి 49:
మచ్చుకి కొన్నిమాటలు:
 
వెర్రిగొల్లలు వెక్కిరిస్తే నాదేం పోదు. ఓండ్రకప్పకు నోరు గొప్పదే. దెబ్బల యెలుగులాగ మీరు బొబ్బరిస్తే ఏం భయపడం. గొల్ల వంకరబుద్ధి గొబ్బున మానండి.
మీరు ముడుపులోని కనకంలాంటివారు. మేము ముడుపుపైన ముద్రవంటివారం. ముద్రలుపోనిదే ముడుపుపోదు. మీరు కన్నయితే మేము కంటికి రెప్పల వంటి వాళ్లము, రెప్పకు హాని రానిదే కంటికి దెబ్బ తగలదు.
ఆవులు అల్లకల్లోలం చేస్తున్నాయి ప్రభూ! కొమ్ముటేనుగులను కూలదోస్తున్నాయి. అశ్వాలసేనపై అమాంతంగా పడుతున్నాయి.
 
==తెలుగు నుడికారం, జాతీయాలు, వాడుక పదాలు==
పంక్తి 57:
ఈ నాటక రచనలో కథనాన్ని నల్లేరు మీద నడిపించి వీరరసాన్ని విరివిగా ఒలికించడానికి ఆరుద్ర ఎంతో చాకచక్యంగా అలవోకగా వాడిన జాతీయాలు ప్రధాన కారణం. తెలుగు భాష, వాడుక పదాలు, నుడికారం వంటివాటిపై ఆయనకున్న పట్టు ఎన్నోచోట్ల తేటతెల్లమౌతుంది. అటువంటి కొన్ని వాడుకలు:
 
పుల్లరి – కప్పం, సుంకం, శిస్తు వంటిది. పశువులను పరాయి గడ్దపై మేపుకోనిచ్చినందుకు ప్రతిగా చెల్లించవలసిన రుసుము.
శుద్ధకాంతలు – అంతఃపుర కాంతలని శుద్ధకాంతలు అని వ్యవహరిస్తారు, ఒకచోట
ఏరాలి కొడుకు – సవతి కొడుకు
పొరుపులు - పొరపొచ్చాలు
రాణువలు- సేనలు
కూటయుద్ధం – అధర్మయుద్ధం
సాగుమానం: సహగమనానికి వికృతి రూపం కావచ్చు
సృగాలాలు – నక్కలు
కెంధూళి – గోధూళి కి మరో రూపం (కెంపు+ధూళి)
 
===జాతీయాలు===
"https://te.wikipedia.org/wiki/కాటమరాజు_కథ" నుండి వెలికితీశారు