భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహిత్యంలో మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
 
[[ఫైలు:Bandaru Acchamamba.JPG|right|150px]]
'''భండారు అచ్చమాంబ''' ([[1874]] - [[1905]]) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]]కు అక్క.
==జీవిత విశేషాలు==
అచ్చమాంబ [[గురజాడ అప్పారావు]] కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ [[1874]] వ సంవత్సరంలో కృష్ణా జిల్లా [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]] లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి [[మచిలీపట్నం]]లో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. [[1905]] [[జనవరి 18]]వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.
 
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క [[భండారు అచ్చమాంబ]]ల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''అబలా సచ్చరిత్రమాల'' అనే గ్రంధాన్ని రచించింది. ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని [[కందుకూరి వీరేశలింగం]] పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు.
== అచ్చమాంబ భావాలు==
#స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రవేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్దకము జేతురు.
పంక్తి 31:
* సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902)
* స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
* భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జులై)
* అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903)
* బీద కుటుంబము (సావిత్రి, 1904)
* ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
* ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం) ఇంతదాకా అలభ్యంగా వుండిన 'ప్రేమా పరీక్షణము', 'ఎఱువుల సొమ్ము బఱువుల చేటు' అనే రెండు కథలు [[సంగిశెట్టి శ్రీనివాస్]] కు లభించాయి.<ref>http://www.andhrajyothy.com/ContentPage.jsp?category=vividha&story_id=40918 </ref>
'''ఇతర పుస్తకాలు'''
* అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)(చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నయి.)
* క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
* ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
* ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
;'''ఇతర పుస్తకాలు'''
* అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
* క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
* ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
* ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
 
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు