మానవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మానవ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Da Vinci Vitruve Luc Viatour.jpg|thumb]]
'''మానవ శాస్త్రము ''' లేదా '''మానుష శాస్త్రము''' (Anthropology) [[మానవజాతి]] పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం..
([[గ్రీక్ భాష]] లో "Anthropos-" అంటే "[[మనిషి]]", "-logy" అంటే "[[శాస్త్రము]]" అని అర్థం).
 
మానవ శాస్త్రము ఒక [[జీవ శాస్త్రం]] మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య [[చరిత్ర|చారిత్రాత్మకంగా]] ఏర్పడిన భేదాలను కూడ తెలిపే [[సాంఘిక శాస్త్రం]] కూడా. [[మానవ శాస్త్రజ్ఞులు]] అనేక ప్రాంతాలలో [[పరిశోధన]]లు చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో [[పురావస్తు శాస్త్రము]] (Archealogy) ప్రకారంగా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే [[తెగ]]ల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం [[ సమయం|సమయాన్ని]], [[స్థలం|స్థలాన్ని]], [[జీవితం|జీవన శైలి]]ని ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ్యయనాలు పరిశీలిస్తాయి.
 
అనువర్తిత మానవ శాస్త్రం (Applied Anthrology) అనే విభాగం సైన్సు ద్వారా తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుపుతుంది. [[దక్షిణ అమెరికా]] లో ఉత్తమమైన పురాతన వ్యవసాయ ప్రక్రియలను అధ్యయనం చేసరుద్ధానం చేయదం ఈ మధ్య ఈ శాస్త్రం సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరుగున పడిపోతున్న ప్రాచీన భాషలను నేర్చుకునే విధానాలను ఆ యా భావి తరాల వారికి అంద జేయడం కూడ ఈ విభాగం కిందికే వస్తుంది.
 
==మానవ శాస్త్రంలో ఇతర విభాగాలు ==
 
* [[పురావస్తు శాస్త్రం]] - పూర్వ కాలం లో ప్రజలు ఎలా బ్రతికారో అధ్యయనం చేసే విభాగం. ఇది ఆ యా నాగరికతల పనిముట్లు, పాత్రలు ఇతర వస్తువుల ఆధారంగా ఈ పరిశోధన చేస్తుంది.
* వివిధ ప్రాంతాలలోని పరిసరాలకు అనుగుణంగా మానవాళి మనుగడ, శరీర భౌతిక లక్షణాలు కాలక్రమేణా లో ఎలా మార్పు చెందాయో పరిశీలించే శాస్త్రమే [[భౌతిక మానవ శాస్త్రం]] (Physical Anthropology). మానవాళితో పాటుగా భౌతిక మానవ శాస్త్రజ్ఞులు జీవ [[పరిణామం]] లో పూర్వీకులైన [[వానర]] జాతులను కూడ పరిశోధిస్తారు.
 
* [[భాష|భాషాపర]] మానవశాస్త్రం (Linguistic Anthropology) - నాగరికత పరిణామాన్ని భాష కోణంలోంచి పరిశీలిస్తుంది. పదాలు, వాటి అర్థాల కాలానుగత మార్పులు, పరిసర భాషల ప్రభావము వంటి విషయాలే కాక భాష, పదాల ఆధారంగా ప్రజల ఆలోచనాసరళి లో పరిణామాన్ని కూడ ఈ శాస్త్ర పరిధిలో అధ్యయనం చేస్తారు.
 
* జనుల ప్రస్తుత జీవన విధానం, కాలానుగుణంగా కలిగిన మార్పులు, దేశకాల పరిస్థితులననుసరించి వారు వాడిన పనిముట్లు, వారి ఆహారపుటలవాట్లు ఇతరత్రా విషయాలను అర్థంచేసుకునేందుకు [[సంస్కృతి|సాంస్కృతిక]] మానవ శాస్త్రం (Cultural Anthropology) ప్రయత్నిస్తుంది. ఈ విభాగం [[సామాజిక శాస్త్రం]] (Sociology), సాంఘిక [[మనస్తత్వ శాస్త్రము]](Social Psychology) లకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.
 
చాలామట్టుకు మానవ శాస్త్రజ్ఞులు మొదట అన్ని విభాగాలలోనూ ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించి, పోను పోను ఒకటి రెండు విభాగాలలో నైపుణ్యం సాఢిస్తారు.
 
== జీవ మానవ శాస్త్రం (Bio-Anthropology) ==
ఇవి కాక కొన్ని సందర్భాలలో [[జీవ శాస్త్రం|జీవ]] మానవశాస్త్రాన్ని ప్రత్యేక విభాగంగానో, జీవ శాస్త్రంలో భాగంగానో కూడ అధ్యయనం చేయటం పరిపాటి.
 
 
"https://te.wikipedia.org/wiki/మానవ_శాస్త్రం" నుండి వెలికితీశారు