"స్త్రీ" కూర్పుల మధ్య తేడాలు

11 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:స్త్రీవాదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
[[దస్త్రం:Scheme female reproductive system-en.svg|left|thumb|[[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]]]]
 
జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. [[అండాశయాలు]] హార్మోనులను తయారు చేయడమే కాకుండా అండం విడుదల కు మూలం. ఫలదీకరణంలో భాగంగా అండం, పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది, [[పిండం]]గా మారడానికి [[గర్భం]] చేరి, తద్వారా కొత్త తరం జీవులను తయారుచేస్తాయి. [[గర్భాశయం]] పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. [[యోని]] పురుష సంయోగానికి మరియు [[పిండం]] జన్మించడానికి తోడ్పడుతుంది. [[వక్షోజాలు]] వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు [[క్షీరదాలు|క్షీరదాల]] ముఖ్యమైన లక్షణము. ఎక్కువమంది స్త్రీల [[కారియోటైపు]] 46,XX, అదే పురుషుల కారియోటైపు 46,XY. ఇందువలన [[X క్రోమోసోము]] మరియు [[Y క్రోమోసోము]]లను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.
[[దస్త్రం:Sky spectral karyotype.png|right|thumb|మానవ స్త్రీల [[కారియోటైపు]].]]
 
తెలుగు భాషలో పురుషుడితో పోలిస్తే స్త్రీకి అనేక పర్యాయ పదాలున్నాయి. అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, ఆడది, ఆడకూతురు, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభ్యాస, ఇందుముఖి, ఇందువదన, ఇగురుబోడి, ఇభయాన, ఉగ్మలి, ఉవిద, ఉజ్జ్వలాంగి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకంఠి, కనకాంగి, కమలాక్షి, కలకంఠి, కలశస్తని, కలికి, కాంత, కువలయాక్షి, కేశిని, కొమ్మ, కోమలి, కోమలాంగి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలువ, చేడె, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తొయ్యలి, తోయజాక్షి, దుండి, ననబోడి, నళినాక్షి, నవలా, నాతి, నారి, నీరజాక్షి, నీలవేణి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పల్లవాధర, పాటలగంధి, పుత్తడిబొమ్మ, పూబోడి, పైదలి, పొలతుక, ప్రమద, ప్రియ, బింబాధర, బింబోష్టి, బోటి, భామ, మగువ, మహిళ, మదిరాక్షి, మానిని, మానవతి, ముగుద, ముదిత, ముద్దుగొమ్మ, మెలత, యోష, రమణి, రూపసి, లతాంగి, లలన, లేమ, వనిత, వలజ, వారిజనేత్రి, వాల్గంటి, విరబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శాతోదరి, సుందరి, సుగాత్రి, సుదతి, సునయన, హంసయాన, హరిణలోచన. బాలిక అన్న పదానికి అమ్మాయి, అమ్మి, కన్య, కన్యక, కుమారి, కొంజిక, కొండుక, కొమారి, చిన్నది, చిఱుతుక, ధీత, ధీద, నగ్నిక, నివర, పసిగాపు, పాప, పిన్నపాప, పిల్ల, పీపరి, పోఱి, బాల, గుంట, బాలిక, బాలకి, రోహిణి, వాసువు అనే పర్యాయపదాలున్నాయి.
 
మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని అందురు. యువతికి ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు అనీ; వృద్ధురాలుకు జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ వంటి పదాలున్నాయి. ఒక బిడ్డను మాత్రమే కన్న స్త్రీని కదళీవంధ్య అనీ; ఇద్దరు బిడ్డలు మాత్రమే కన్న స్త్రీని కాకవంధ్య అనీ ఒకప్పుడు అనేవారు.
దూషిత, హత అంటే కన్యాత్వము చెడినది అనీ; భర్త, పిల్లలు గతించిన స్త్రీని నిర్వీర అనీ; మారుమనువాడిన స్త్రీని పునర్భువు అనీ; పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలు, అప్రజాత, అశశ్వి, గొడ్డురాలు, బందకి, వంజ, వంధ్య, వృషలి, శూన్య అనీ; గర్భవతియైన స్త్రీని అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి అని పేర్కొనడం వుంది. అలాగే బాలెంతరాలు అయిన స్త్రీని జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి అని పేర్కొంటారు. ఇలా స్త్రీకి వివిధ దశల్లో కూడా పేర్కొనబడే అర్థసూచక పదాలు అనేకం వున్నాయి. ఆత్రేయి, ఉదక్య, ఏకవస్త్ర, త్రిరాత్ర, నెలబాల,స్త్రీ ధర్మిణి అంటూ ఋతుమతి అయిన స్త్రీకి పర్యాయపదాలున్నాయి.
 
== సమాజంలో స్త్రీల పాత్ర ==
[[ముదిత]] అనగా స్త్రీ . ''ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దర నేర్పించినన్'' ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....అని అన్నారు. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. స్త్రీని పూర్వ కాలంలో [[అబల]] అనగా బలం లేనిది అనేవారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లలు యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది. యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించేవారు. కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్ధిక స్వేచ్చ ను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది. అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని, పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని, స్త్రీ ఆర్ధిక స్వేచ్చ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్త కాస్త బలహీన పడింది అని చెప్పవచ్చు.
 
== స్థానిక సంస్థల్లో స్త్రీలకు 50 శాతం సీట్లు ==
 
== తగ్గుతున్న స్త్రీల జనాభా ==
మాతృస్వామ్యంలో అవతరించి పితృస్వామ్య వ్యవస్థకు మారింది దేశీయ సంస్కృతి. మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పురుషాధిక్యత పెరుగుతోంది. గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి భావిస్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు, కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య తలెత్తినా తామే పరిష్కరించాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో ఆడపిల్లల పై ప్రేమానురాగాలు తగ్గాయి. ఇదే తరుణంలో మగపిల్లల పై మోజు పెరిగింది. విద్యాబుద్దులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది రూపాయల కట్నం తెస్తాడని, తమను పున్నామ నరకం నుండి రక్షిస్తాడని భావించారు. దీంతో తల్లి గర్బంలోనే పిండం ప్రాణం పోసుకుంటున్న దశలో [[స్కానింగ్‌]]లు తీయించి పాప అయితే [[గర్భవిచ్ఛిన్నం]] చేయించుతున్నారు.
* ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను క లిగి ఉన్న భారత్‌... స్త్రీ, పురుషులను సమానంగా చూసేవిషయం లో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన సూచి వెల్లడించింది. భారత్‌లో ఆడ శిశువుల ను గర్భంలోనే చంపేస్తున్నారని, 2.5 కోట్ల మంది ఆడపిల్లలు భూ మ్మీదకు రాకముందే హత్యకు గు రయ్యారని నోబెల్‌ బహుమతి గ్ర హీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళనలను ఇది నిర్ధారించింది. 134 దేశాలపై రూపొందించిన ఈ సూచిలో భారత్‌ 114వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నే పాల్‌ దేశాలు సైతం ఈ సూచీలో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.<ref>ఆంధ్రజ్యోతి11.11.2009</ref>
* పురుషులతో పోలిస్తే మహిళలకే వ్యవసాయ భూములు తక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల అసలు మహిళలకు వ్యవసాయ భూమి అనేదే లేదు.. తమ పేరుమీద వ్యవసాయ భూములున్నవారు మనదేశంలో మొత్తం 119 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 9.21 శాతంగా మాత్రమే<ref>ఈనాడు 22.2.2010</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1220253" నుండి వెలికితీశారు